మూడోసారి ప్రధానిగా మోదీ!

దేశంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వరుసగా మూడోసారి ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తుందని ఇండియా టుడే మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే తేల్చింది. కాకపొతే ఎన్డీయే సీట్ల సంఖ్య 296కు పడిపోతుందని చెప్పింది. అంతేకాక త్వరలో జరగనున్న ఐదు రాష్ట్రాల్లోనూ మోదీకి 50 శాతం పైగా మద్దతు తెలుప్తున్నట్లు సర్వే రిపోర్ట్ చెబుతుంది. కాగా ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఎన్డీఏ కూటమి సొంతంగా 271 సీట్లతో సొంతంగా అధికారంలోకి వస్తుందని…..

Read More

వలసల పై ప్రతిపక్షాలు అసత్యాలు ప్రచారం చేస్తున్నాయి- బీజేపీ

యూపీ బీజేపీలో ఏంజరుగుతోంది? మంత్రులు, ఎమ్మెల్యేలు పార్టీని ఎందుకు వీడుతున్నారు? కమలం పార్టీలో ముసలం మొదలైందా? ఎస్పీలోకి వలసలు దేనికి సంకేతం? మరోసారి కులం, ఓటు బ్యాంకు రాజకీయాల ప్రభావమెంత? వలసలపై కమలనాధులు సమాధానం ఏంటి? అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ యూపీలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. బీజేపికి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలతో పాటు పలువురు ఎస్పీలో చేరారు. ఈనేపథ్యంలో ఎప్పటిలానే దేశవ్యాప్తంగా మెయిన్‌ స్ట్రీమ్‌ మీడియాతో పాటు పలు వెబ్‌సైట్స్‌ కమలం పార్టీపై విషప్రచార కథనాలను మొదలెట్టాయి….

Read More

ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీదే హవా.. సర్వేలో వెల్లడి!

దేశంలో ఎన్నికల మిని సంగ్రామం మొదలైంది. అతిపెద్ద రాష్ట్రం ఉత్తర్ ప్రదేశ్తో పాటు మరో నాలుగు రాష్ట్రాలకు వచ్చే నెలలో అసెంబ్లీ ఎన్నికలు జరుగునున్నాయి. దీంతో ఈ ఐదు రాష్ట్రాలకు సంబంధించి టైమ్స్ నౌ సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో కమలం పార్టీ హవా కొనసాగుతుందని వెల్లడైంది. కాగా వచ్చే నెల జరగనున్న ఎన్నికల్లో కాషాయం పార్టీ ఉత్తరాఖండ్‌, ఉత్తరప్రదేశ్‌, గోవాల్లో మరోమారు అధికారాన్ని చేపడుతుందని తేలింది. ఒక్క పంజాబ్‌ మినహా.. మిగతా రాష్ట్రాల్లో కాంగ్రెస్ కు…

Read More

ప్రధాని భద్రత వైఫల్యం పై సుప్రీం కోర్టు విచారణ!

ప్రధాని మోదీ పంజాబ్ పర్యటనలో తలెత్తిన భద్రతా వైఫల్యంపై విస్తృత చర్చ నడుస్తోంది. ప్రధాని భద్రతా ఏర్పాట్ల వ్యవహారం కాక పుట్టిస్తున్న వేళ.. సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. ప్రధాని పంజాబ్ పర్యటన భద్రతా లోపాలకు సంబంధించిన అన్ని ఆధారాలు, రికార్డులు సుప్రీంకోర్టు రిజిస్ర్టార్ జనరల్‌కు అందజేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈనేపథ్యంలో ఇదే అంశంపై దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా బీజేపీ నేతలు నిరసనలు చేపట్టారు. కాగా ప్రధాని మోదీ భద్రతకు భంగం కలిగిందని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు మళ్లీ…

Read More

హైకోర్టు ఆదేశాలతో సంజయ్ విడుదల!

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ హైకోర్టు ఆదేశాలతో విడుదలయ్యారు. కేంద్ర మంత్రి భగవత్ కుభాతో పాటు బీజేపీ శ్రేణులు భారీగా జైలు వద్దకు చేరుకుని ఆయనకు స్వాగతం పలికారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీజేపీ శ్రేణులు నినాదాలు చేశారు. అనంతరం సీఎం కేసీఆర్‌పై సంజయ్‌ ఫైర్‌ అయ్యారు. టీఆర్ఎస్‌పై ధర్మ యుద్ధం చేస్తానని, కేసీఆర్‌ను జైలుకు పంపేవరకూ వదలిపెట్టనని శపథం చేశారు సంజయ్‌. కరీంనగర్ పోలీసులు సీఎంఓ డైరెక్షన్లో పనిచేస్తున్నారని దుయ్యబట్టారు. జీవో 317 విషయంలో వెనుకడుగు…

Read More

పంజాబ్ ప్రధాని పర్యటన రద్దుపై దుమారం!

పంజాబ్‌లో ప్రధాని మోదీ పర్యటన సందర్భంగా భద్రతా లోపాలు తలెత్తడం తీవ్ర దుమారానికి తెరతీసింది. ఈ ఘటనపై కేంద్ర హోంశాఖ సీరియస్ అయింది. వివరణ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. కాగా మరికొద్ది నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రధాని మోడీ పర్యటన అర్ధంతరంగా రద్దు కావడం రాజకీయ దుమారానికి తెరతీసింది. పర్యటనలో భాగంగా బఠిండా ఎయిర్‌పోర్టులో ల్యాండ్‌ అయిన ప్రధాని…..అక్కడి నుంచి ఫిరోజ్‌పూర్‌ జిల్లా హుస్సెనివాలాలోని స్వాతంత్ర్య సమరయోధుల స్మారక స్థూపం దగ్గర నివాళులర్పించేందుకు…

Read More

కెసిఆర్ సర్కార్ పై యుద్ధం ప్రకటించిన బిజెపి నేతలు

తెలంగాణలో బండి సంజయ్‌ అరెస్ట్‌ను మైలేజ్‌గా తీసుకున్న కమలనాధులు… కేసీఆర్‌ సర్కార్‌పై యుద్ధం ప్రకటించారు. ప్రస్తుతం కరీంనగర్‌ జైల్లో ఉన్న బండి సంజయ్‌ను… కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి, ఈటల రాజేందర్‌ సహా పలువురు నేతలు ములాఖత్‌ త్వారా పరామర్శించారు. జాగరణ దీక్ష సందర్భంగా జరిగిన పరిణామాలను అడిగి తెలుసుకున్నారు. అక్కడి నుండి నేరుగా బండి సంజయ్ క్యాంప్‌ ఆఫీస్‌కు వెళ్లారు. ఘటన వివరాలను స్థానిక నేతలను అడిగి తెలుసుకున్నారు. అటు ఎంపీగా తన హక్కులకు భంగం…

Read More

బండి సంజయ్ అరెస్ట్ పై దుమారం!

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్టు తీవ్ర దుమారం రేపుతోంది. ఈనేపథ్యంలో అధికారుల తీరుపై తీవ్రంగా మండిపడుతున్నారు బీజేపీ నేతలు. పోలీసులు ఎంపీ క్యాంపు కార్యాలయంలోకి అక్రమంగా ప్రవేశించ‌డ‌మే కాకుండా డోర్లు ప‌గ‌ల గొట్టడం, గ్యాస్ క‌ట్టర్లు, రాడ్లు వినియోగించ‌డంపైనా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. క‌రోనా నిబంధన‌ల‌కు అనుగుణంగా జాగ‌రణ చేస్తుంటే.. పోలీసుల‌కు, ప్రభుత్వంకు వ‌చ్చిన ఇబ్బంది ఏమిటంటూ ప్రశ్నిస్తున్నారు. కాగా బండి సంజయ్ అరెస్టు, తాజా రాజకీయ పరిణామాలపై అత్యవసర సమావేశం నిర్వహించారు బీజేపీ…

Read More

ఐదు రాష్ట్రాల ఎన్నికలపై బీజేపీ ఫోకస్!

వచ్చే ఏడాది జరగనున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలపై కమలనాథులు గురిపెట్టారు. గోవా, ఉత్తరప్రదేశ్‌, పంజాబ్‌, మణిపూర్‌, ఉత్తరాఖండ్‌ రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో గెలుపే లక్ష్యంగా కమలనాథులు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. అటు ప్రధాని మోదీ.. ఇటు అమిత్‌ షా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఉత్తరాఖండ్‌లో పర్యటించిన మోదీ.. అక్కడి ప్రజలపై వరాల జల్లు కురిపిస్తూనే… విపక్షాలను ఎండగట్టారు. అలాగే యూపీలో పర్యటించిన అమిత్‌ షా… సంక్షేమ మంత్రమే ఆయుధంగా ప్రచారాన్ని హోరెత్తించారు. ఇక ఉత్తరాఖండ్‌లో…

Read More

తెలంగాణాలో వేడెక్కిన రాజకీయం!

తెలంగాణలో టీఆర్‌ఎస్‌, బీజేపీ, కాంగ్రెస్‌ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు మూడు పార్టీల నేతలు. టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ను టార్గెట్‌ చేస్తూ బీజేపీ విమర్శలు చేస్తుంటే…. టీఆర్ఎస్‌, బీజేపీలు దొందు దొందేనంటూ…కాంగ్రెస్‌ చెబుతోంది. మొత్తానికి… మూడూ పార్టీల ఆరోపణలు ప్రత్యారోపణలతో… తెలంగాణ రాజకీయాలు వేడెక్కెతున్నాయి. ఇక బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ కాంగ్రెస్‌, టీఆర్ఎస్‌పై మరోసారి విరుచుకుపడ్డారు. దళితులను కాంగ్రెస్‌ ఓటు బ్యాంక్‌గా చూసిందని విమర్శించారు. కేసీఆర్‌ ప్రభుత్వం సైతం దళితులకు…

Read More
Optimized by Optimole