karimnagar: సభ్యత్వ నమోదులో కరీంనగర్ నెంబర్ వన్ స్థానం కోసం కృషి: గంగాడి కృష్ణారెడ్డి..
Karimnagar: బిజెపి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని పరిశీలించడానికి జిల్లా అధ్యక్షుడి గంగాడి కృష్ణారెడ్డి ఆదివారం రోజున హుజురాబాద్ నియోజకవర్గంలోని పలు మండలాల్లో పర్యటించారు. ఈ మేరకు నియోజకవర్గంలోని హుజరాబాద్ పట్టణ ,రూరల్, కమలాపూర్, ఇల్లంతకుంట, జమ్మికుంట రూరల్ మండలాల్లో గంగాడి కృష్ణారెడ్డి పర్యటించి సభ్యత్వ నమోదుపై స్థానిక బిజెపి శ్రేణులకు దిశ నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కృష్ణారెడ్డి మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ క్యాడర్ బేస్డ్ పార్టీ అని.. కార్యకర్తల శ్రమతోనే నేడు బిజెపి ప్రపంచంలోనే…