ఇంగిత జ్ఞానం లేదా..థూ… నీ బతుకు చెడ: బండి సంజయ్

తన కుమారుడి వీడియో ఘటనపై బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ ఘాటుగా స్పందించారు. దమ్ముంటే.. మొగోడైతే..కేసిఆర్  రాజకీయం తనతో చేయాలని సవాల్ విసిరారు. రాజకీయం చేయలేక..దద్దమ్మలా..కాలేజీపై ఒత్తిడి తెచ్చి కేసు పెట్టిస్తావా?అంటూ మండిపడ్డారు. పిల్లలు.. పిల్లలు కొట్లాడుకుంటారు.. మళ్లీ కలుస్తారు.. కేసు పెట్టియాల్సిన అవసరం ఏమొచ్చిందన్నారు?. తన కొడుకు తో పాటు ముగ్గురు పిల్లల జీవితాలు నాశనం చేస్తావా?.. థూ… నీ బతుకు చెడ… ఎందుకు బతుకుతున్నవో అర్ధం కావడం లేదని’  ఆగ్రహాంతో ఊగిపోయారు.చిన్న పిల్లలను…

Read Full News

ఉచిత విద్యుత్ ను అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణా : మంత్రి జగదీష్

సూర్యాపేట: తెలంగాణా అభివృద్ధి లో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పిలుపునిచ్చారు. తెలంగాణా విద్యుత్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ రూపొందించిన 2023 డైరీ క్యాలెండర్ ను ఆయన శనివారం ఉదయం క్యాంప్ కార్యాలయంలో ఆవిష్కరించారు. కొత్త జిల్లాల ఏర్పాటు విద్యుత్ కాంట్రాక్టర్లతో పాటు యావత్ రైతాంగానికి ఎంతో దోహదపడుతుందన్నారు జ‌గ‌దీష్ రెడ్డి.సుదూర ప్రాంతాల నుండి ట్రాన్స్ఫార్మర్స్ ఇతర పరికరాలు సరఫరా చేసే భారం తప్పిందని గుర్తు చేశారు. కొత్త జిల్లాల…

Read Full News

పేరుతో కాదు..‘ఫేమ్‌’తోనే పని !

ఇంట గెలిచి రచ్చ గెలవమన్నారు. ఈ నానుడి అంతరార్థం ఇతరులెవరికన్నా కూడా తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావుకే ఎక్కువ తెలుసు. రాష్ట్ర సాధనకు, తాను శీర్షభాగాన ఉంటూ నడిపిన ఉద్యమానికి ఊపిరిపోసిన మూలసూత్రమిది! అటువంటి అవసరం ఏర్పడిరదంటే, ఎంతటి శ్రమకోర్చి అయినా అది సాధించేవరకు ఆయన వదలరు. ఇలాంటి విషయాల్లో ఆయనది రాక్షసకృషి అంటే అతిశయోక్తి కాదు. తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్‌) ని రాజకీయంగా విస్తరిస్తూ భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్‌) గా ప్రకటించి నెలలు గడుస్తున్నా…….

Read Full News

ఇంకా నాలుకెక్కని బిఆర్‌ఎస్‌ ….

తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్‌ఎస్‌) దేశం మొత్తానికి విస్తరించే లక్ష్యంతో భారతరాష్ట్ర సమితి (బిఆర్‌ఎస్‌) గా రూపాంతరం చెందింది. అధికారికంగా పేరు మారిన దృష్ట్యా విషయాన్ని ఎన్నికల సంఘానికి, లోక్‌సభ, శాసనసభా స్పీకర్‌ కార్యాలయాలకు, ఇతరత్రా అందరికీ తెలియజేశారు. పార్టీ నాయకులు, కార్యకర్తల శ్రేణులు దాటి పేరు ప్రజల్లోకి వెళుతున్న క్రమం ఇది. పేరు మార్పు ఎంతగా ప్రజాబాహుళ్యంలోకి వెళ్ళింది? అంతకన్నా ముందు పార్టీ నాయకుల్లో, కార్యకర్తల శ్రేణుల్లో కొత్తపేరు (బిఆర్‌ఎస్‌) ఎంతగా మెదళ్లలో నాటుకుంది …?…

Read Full News

ప్రతిపక్షాలు లేకుండా చేయాలనుకున్న కేసీఆర్ కుట్రను ఛేదించాలి :టీపీసీసీ రేవంత్

తెలంగాణలో పార్టీ ఫిరాయింపులపై టీపీసీసీ రేవంత్ రెడ్డి  నిప్పులు చెరిగారు. అధికారాన్ని పదిలం చేసుకోవడానికి.. కేసిఆర్ ప్రతిపక్షాలను నిర్వీర్యం చేస్తున్నాడని ఆరోపించారు.  2014 నుంచి సిఎం కేసిఆర్  ఇదే తరహ పాలన సాగిస్తున్నారని మండిపడ్డారు. 2018లో కేసీఆర్ పార్టీలో 88 మంది ఎమ్మెల్యేలు గెలిచారని.. హామీలు అమలు చేయాలని జనం సంపూర్ణ మెజారిటీ ఇచ్చారని తెలిపారు. అయినప్పటికి కేసీఆర్ వైఖరిలో మాత్రం మార్పు రాలేదని..రెండోసారి అధికారంలోకి వచ్చినా ఫిరాయింపులను కొనసాగిస్తునే ఉన్నారని  ఆగ్రహాం వ్యక్తం చేశారు. ఒక…

Read Full News

పార్టీలకు ఈ యేడు పరీక్షా కాలమే..!

2023, సమకాలీన భారత రాజకీయాల్లో ఎంతో ప్రాధాన్యత సంతరించుకున్న సంవత్సరం. ఈ కాలపు రాజకీయాల్లో ఎన్నికలు పార్టీలకు అగ్నిపరీక్ష మాత్రమే కాదు ఒక అవకాశం. తిరగేసి చూసినా అంతే, అవకాశం మాత్రమే కాదు ఒక అగ్నిపరీక్ష! లోక్‌సభకు 2024 లో జరగాల్సిన సాధారణ ఎన్నికలకు ముందు ఈ సంవత్సరమే 9 రాష్ట్రాల్లో ఆయా అసెంబ్లీలకు ఎన్నికలు జరుగనున్నాయి. బయట ప్రచారం జరుగుతున్నట్టు కశ్మీర్‌ లో ఎన్నికలు జరిపించే చిత్తశుద్ది కేంద్రం కనబరిస్తే, అది ఈ యేడాది ఎన్నికలు…

Read Full News

జాతీయ అధ్యక్షుడు లేని బీఆర్ఎస్ కు రాష్ట్ర అధ్యక్షుడా?: బండి సంజయ్

తెలంగాణలో గ్రామపంచాయతీ నిధుల మళ్లింపుపై  బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో దొంగలు పడ్డారని..జాతీయ అధ్యక్షుడు లేని బీఆర్ఎస్ కు రాష్ట్ర అధ్యక్షుడా? అంటూ ఎద్దేవా చేశారు. ఆహారపు అలవాట్లపై కేసీఆర్ చేసిన అవమానాన్ని ఆంధ్ర ప్రజలు మరచిపోగలరాని?ప్రశ్నించారు. ఆంధ్ర ప్రజల్ని మచ్చిక చేసుకునేందుకు తంటాలు పడుతున్న కేసీఆర్..తెలంగాణను నాశనం చేసి.. దేశాన్ని ఉద్ధరించడానికి బయల్దేరాడని  విమర్శించారు. ఇక కేసీఆర్ అధికారంలోకి వచ్చాక నిజాం షుగర్ ఫ్యాక్టరీలను మూసేసి తెలంగాణ ప్రజల దృష్టి…

Read Full News

కాపులకు సంపూర్ణ ‘రాజ్యాధికారం’ రాకున్నా..‘రాజకీయాధికారం’ వచ్చేసిందా?

ఆంధ్రప్రదేశ్‌లో నాలుగు రాజకీయ పార్టీల అధ్యక్షులూ కాపులే! ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి పదవి తమ నాలుగు కులాల్లో దేనికీ రాలేదనే బాధ కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులస్తులను ఇప్పుడు దహించివేస్తోంది. నిజమే. సంపూర్ణ ‘రాజ్యాధికారం’ ఇంకా ఈ నాలుగు కులాల సముదాయానికి గగన కుసుమం మాదిరిగానే కనిపిస్తోంది. 2009 అసెంబ్లీ ఎన్నికల్లో పీఆర్పీ పేరిట జరిగిన తొలి ‘రాజ్యాధికార’ ప్రయత్నం విఫలమైంది. 2014 ఎన్నికల్లో తాను స్వయంగా పోటీచేయని జనసేన మాత్రం తెలుగుదేశం పార్టీని అమరావతిలో అందలమెక్కించింది….

Read Full News

ఇంట గెలిస్తేనే .. బీఆర్‌‘ఎస్‌’.. లేకపోతే కష్టమే సుమీ..!

కారులో ప్రయాణించాలంటే దాన్ని సామర్థ్యాన్ని బట్టి ప్రయాణికులుండాలి. ఓవర్‌ లోడిరగ్‌ అయితే ప్రమాదం తప్పదు. 2014 కంటే 2018 ఎన్నికల్లో జట్‌స్పీడ్‌గా వెళ్లి బీఆర్‌ఎస్‌ కారు కావాల్సిన మెజార్టీని సాధించింది. 2014 ఎన్నికల్లో 63 స్థానాలు గెలిచి బొటాబొటి మెజార్టీ సాధించిన బీఆర్‌ఎస్‌ కారు, 2018 ఎన్నికల్లో 88 స్థానాలతో  మరింత వేగవంతంగా లక్ష్యాన్ని చేరుకుంది. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుకు ఈ విజయం కూడా సంతృప్తి ఇవ్వలేదు. భవిష్యత్తులో కూడా పార్టీకి ఎలాంటి అడ్డంకులు ఉండొద్దనే భావనతో…

Read Full News

రాజకీయ నాయకుల దిగజారుడు మాటలకు అంతం ఉండదా?

‘నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది‘ అంటారు పెద్దలు. మన నోటి నుంచి వచ్చే మాటలు కత్తి కంటే పదునైనవి. మనం మాట్లాడే ప్రతి మాట ఆలోచించి మాట్లాడాలి. ఒక్కసారి మాట పెదవి దాటితే దాన్ని వెనక్కి రప్పించడం సాధ్యం కాదు. కానీ, దురదృష్ట వశాత్తు మన రాజకీయ నాయకుల మాటలు వింటుంటే ఆవేదన, అదే సమయంలో ఆగ్రహం కలగకమానవు. నిజం చెప్పాలంటే రాజకీయ నాయకులు రోజు రోజుకు విలువల వలువలు ఊడదీసే ప్రయత్నం నిరాటంకంగా మందుకు తీసుకెళ్తున్నారు….

Read Full News
Optimized by Optimole