తెలంగాణ కాంగ్రెస్‌కు జ్ఞానోదయమెప్పుడు..?
తప్పులు దొర్లడం సహజం. జరిగిన తప్పిదాలను మరోసారి జరుగకుండా.. చూసుకుంటు ముందుకు సాగడం ఆనవాయితీ. కాని తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న తప్పిదాలను అధిష్ఠానం గుర్తించలేక పోతుందా..? లేదా తెలిసి ఊరుకుంటుందా..? అనే సందేహాలు అందరిని ఆలోచనల్లో పడేశాయి. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఇచ్చింది. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్‌ను కాదని ప్రజలు ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు కోసం పోరాటం చేసిన టీఆర్‌ఎస్‌కే పట్టం కట్టారు. తెలంగాణలో ప్రజలకు చేసిన మేలుకు కాంగ్రెస్‌కు ప్రతిపక్ష హోదాను కొత్త రాష్ట్రంలో…