IndiraGandhi: అరశతాబ్ది కిందే విత్తులు చల్లిన నాయకత్వం..!
IndiraGandhi Birthanniversary: ఆ రోజు ఆమె స్వరం పర్యావరణ విశ్వగానమై పలికింది. ప్రకృతికి సరికొత్త భరోసాగా ధ్వనించింది. సౌరమండలంలోని ఏకైక జీవగ్రహం పుడమికి వినూత్న ఆశై పల్లవించింది. భారత చారిత్రక, ఆధ్యాత్మికమైన పర్యావరణ వారసత్వ సంస్కృతి-సుసంపన్నతకు రాయబారిగా నిలిచింది. ఇవాళ విశ్వమంతా ‘సౌత్ గ్లోబ్’ అని మనం గొంతెత్తుతున్నామే… అభివృద్ది చెందని-వెనుకబాటు ‘దక్షిణ ప్రపంచ’ దేశాలకు ఒక ఉమ్మడి ఊపిరయింది. ఆ ధీర-గంభీర స్వరం వేరెవరిదో కాదు…. భారత ఉక్కుమహిళా ప్రధాని, దివంగత నేత ఇందిరాగాంధీది. స్వీడన్…