ఇంగిత జ్ఞానం లేదా..థూ… నీ బతుకు చెడ: బండి సంజయ్

తన కుమారుడి వీడియో ఘటనపై బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ ఘాటుగా స్పందించారు. దమ్ముంటే.. మొగోడైతే..కేసిఆర్  రాజకీయం తనతో చేయాలని సవాల్ విసిరారు. రాజకీయం చేయలేక..దద్దమ్మలా..కాలేజీపై ఒత్తిడి తెచ్చి కేసు పెట్టిస్తావా?అంటూ మండిపడ్డారు. పిల్లలు.. పిల్లలు కొట్లాడుకుంటారు.. మళ్లీ కలుస్తారు.. కేసు పెట్టియాల్సిన అవసరం ఏమొచ్చిందన్నారు?. తన కొడుకు తో పాటు ముగ్గురు పిల్లల జీవితాలు నాశనం చేస్తావా?.. థూ… నీ బతుకు చెడ… ఎందుకు బతుకుతున్నవో అర్ధం కావడం లేదని’  ఆగ్రహాంతో ఊగిపోయారు.చిన్న పిల్లలను…

Read More

బాబు రీ ఎంట్రీ బలమా? బలహీనతా?

   ఎవరికి వరం? ఎవరికి శాపం? ‘ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చింది’ అన్నట్టుంది తెలంగాణలో పాలక విపక్షాల నడుమ రాజకీయం. తెలంగాణ రాజకీయాల్లోకి తెలుగుదేశం నేత చంద్రబాబునాయుడు పునరాగమనం… పెద్ద చర్చనే లేవనెత్తింది. తెలంగాణ కాంగ్రెస్‌తో జతకట్టిన ఆయన రాక 2018లో సీఎం చంద్రశేఖరరావుకు అయాచిత లాభం చేకూర్చింది. అదే చంద్రబాబు ఇప్పుడు బీజేపీతో జతకట్టి వస్తే కేసీఆర్‌కు, ఆయన బీఆర్‌ఎస్‌కు నష్టం కలిగిస్తారనే అంచనాలు రాజకీయ వర్గాల్లో సాగుతున్నాయి. ప్రభావమేమీ ఉండదని, పైగా పాలకపక్షానికే లాభమని…

Read More

గురి ఎక్కడ? దెబ్బ మరెక్కడ?

‘అదిరిందయ్యా చంద్రం’ అని అప్పట్లో ఓ వ్యాపార ప్రకటన బాగా ఆకట్టుకునేది. ‘కొత్త కారు, కొత్త ఇల్లు, కొత్త భార్య వావ్‌ అదిరిందయ్యా చంద్రం…..’ ఇలా సాగుతుంది ఆ సృజనాత్మక ప్రకటన. పాత పార్టీకి కొత్త పేరే అయినా… భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్‌) ఢిల్లీ ఓపెనింగ్‌ అదిరింది సినిమా భాషలో చెప్పాలంటే! రాజకీయంగా క్లిక్‌ అవుతుందా? లేదా? అనేది ఇప్పుడు సాగుతున్న ప్రధాన చర్చ. చెట్టుకింద పోరంబోకు ముచ్చట్ల నుంచి సంపాదకుల పేజీల్లో వ్యాసాలు, టీవీ…

Read More

కెసిఆర్ సర్కార్ పై యుద్ధం ప్రకటించిన బిజెపి నేతలు

తెలంగాణలో బండి సంజయ్‌ అరెస్ట్‌ను మైలేజ్‌గా తీసుకున్న కమలనాధులు… కేసీఆర్‌ సర్కార్‌పై యుద్ధం ప్రకటించారు. ప్రస్తుతం కరీంనగర్‌ జైల్లో ఉన్న బండి సంజయ్‌ను… కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి, ఈటల రాజేందర్‌ సహా పలువురు నేతలు ములాఖత్‌ త్వారా పరామర్శించారు. జాగరణ దీక్ష సందర్భంగా జరిగిన పరిణామాలను అడిగి తెలుసుకున్నారు. అక్కడి నుండి నేరుగా బండి సంజయ్ క్యాంప్‌ ఆఫీస్‌కు వెళ్లారు. ఘటన వివరాలను స్థానిక నేతలను అడిగి తెలుసుకున్నారు. అటు ఎంపీగా తన హక్కులకు భంగం…

Read More

తెలంగాణాలో కమలం జోరు!

తెలంగాణలో దుబ్బాక, హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో గెలుపుతో బీజేపీ జోరుమీదుంది. పార్టీ శ్రేణుల్లోనూ ఉత్సాహం కనిపిస్తోంది. విజయపరంపరను ఇలాగే కంటిన్యూ చేస్తే వచ్చే ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌తో ఢీకొట్టొచ్చని బీజేపీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే ఇప్పటిదాకా కేసీఆర్ అనుసరించిన వ్యూహాన్నే తామూ అనుసరించాలని బీజేపీ పెద్దలు డిసైడ్‌ అయినట్లు కనిపిస్తోంది. వచ్చే ఎన్నికల్లోనూ ఇదే స్ట్రాటజీ అమలు చేసి.. అధికారంలోకి రావాలని గట్టిగా ప్రయత్నిస్తోంది. కాగా బలమైన అభ్యర్థులు ఉంటే టిఆర్ఎస్‌ను ఓడించడం తేలికని దుబ్బాక, హుజురాబాద్ ఉప…

Read More

టిఆర్ఎస్ పై నిప్పులు చెరిగిన బండి సంజయ్!

అధికార టిఆర్ఎస్ పై నిప్పులు చెరిగారు బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్. హుజూరాబాద్‌లో టీఆర్‌‌ఎస్ అభ్యర్థి ఎవరో కూడా తెలికుండానే ఆ పార్టీ నేతలు ఓట్ల కోసం డబ్బులు పంచుతున్నారని ఆయన ఆరోపించారు. నియోజకవర్గ ప్రజలు ఆ పైసలు తీసుకుని ఈటల రాజేందర్‌‌కే ఓటు వేయాలని పిలుపునిచ్చారు. మాజీ మంత్రి ఈటల రాజేందర్ చేస్తున్న పాదయాత్ర ఆరో రోజున కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండలం వాగు ఒడ్డు రామన్న పల్లి గ్రామంలో జరిగిన సభలో బీజేపీ రాష్ట్ర…

Read More

బెస్ట్ సీఎంగా న‌వీన్ ప‌ట్నాయ‌క్‌!

దేశంలో ఉత్త‌మ ముఖ్య‌మంత్రిగా ఒడిశా సీఎం నవీన్ ప‌ట్నాయ‌క్ మొద‌టి స్థానంలో నిలిచారు. కోవిడ్ లాంటి క్లిష్ట ప‌రిస్థితుల్లో రాష్టాల ముఖ్య‌మంత్రుల ప‌నితీరు గురించి ముంబైకి చెందిన ఆర్మాక్స్‌ మీడియా ఓ స‌ర్వే నిర్వ‌హించింది. ఇందులో న‌వీన్ ప‌ట్నాయ‌క్ 57 శాతం రేటింగ్‌తో ఫ‌స్ట్ ప్లేస్‌లో నిల‌వ‌గా.. ఏపీ సీఎం జ‌గ‌న్ 55 శాతంతో రెండో స్థానంలో, తెలంగాణ ముఖ్య మంత్రి కేసీఆర్ 44 శాతంలో 15 వ స్థానంలో.. కేర‌ళ సీఎం పిన‌ర‌యి విజ‌య‌న్, అస్సాం…

Read More

ముఖ్యమంత్రి మార్పు లేదు: సీఎం కేసీఆర్

తెలంగాణ సీఎం మార్పు గురించి జరుగుతున్న ప్రచారం పై ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టత ఇచ్చారు. ఆదివారం తెలంగాణ భవన్లో నిర్వహించిన పార్టీ కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కేటీఆర్ ముఖ్యమంత్రి అంటూ బహిరంగ సమావేశంలో మాట్లాడే నేతలకు చురకలు అంటిచారు. తాను రాజీనామా చేయాలని చూస్తున్నారా అని నేతలను ప్రశ్నించారు. ఇంకోసారి ఎవరైన ముఖ్యమంత్రి మార్పు పై మాట్లాడితే కర్రు కాల్చి వాతపెడతానని హెచ్చరించారు. మరో 10 ఏళ్ళు తానే ముఖ్యమంత్రిగా కొనసాగుతానని స్పష్టంచేశారు. ఈ నెల…

Read More

మేయర్ ఎన్నిక అమావాస్య రోజే ఎందుకు? : బండి సంజయ్

కొడుకుని సీఎం చేసేందుకే కెసిఆర్ మేయర్ అధ్యక్ష ఎన్నికను అమావాస్య రోజు ఖరారు చేశారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. మంగళవారం రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన  సమావేశానికి హాజరైన ఆయన మాట్లాడుతూ.. కొడుకును ముఖ్యమంత్రి చేసేందుకు దోష నివారణ పూజల కోసం కాళేశ్వరం వెళ్లారని.. ఎంఐఎం ఒత్తిడికి తలొగ్గి ప్రజలను మభ్య పెట్టే ప్రయత్నం చేస్తున్నారని పేర్కొన్నారు. ఇక నికార్సయిన హిందువుగా చెప్పుకునే ముఖ్యమంత్రి అమావాస్య రోజు మేయర్ అధక…

Read More
Optimized by Optimole