వాలెంటైన్స్ డే స్పెష‌ల్‌..ఈట‌లపై కేసీఆర్ కు ప్రేమెందుకు?

హుజురాబాద్ ఎమ్మెల్యే ఈట‌ల రాజేంద‌ర్ పార్టీ మార్పు ప్ర‌చారంలో నిజ‌మెంత‌? అసెంబ్లీలో కేసీఆర్ ఈట‌ల జ‌పం చేయ‌డంలో దాగున్న మ‌ర్మం ఏంటి? త‌న ఇమేజ్ డ్యామేజ్ చేసేందుకే కేసీఆర్ అలా మాట్లాడిండు అన్న ఈట‌ల వాద‌న‌లో వాస్త‌వ‌మెంత‌? అసెంబ్లీ ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌ప‌డుతున్న‌ వేళ బిఆర్ ఎస్ మైండ్ గేమ్ మొద‌లెట్టిందా? మీడియాను బేస్ చేసుకుని ప్ర‌తిప‌క్ష నేత‌ల‌ను టార్గెట్ చేసిందా? తెలంగాణ రాజ‌కీయం సినిమా ట్విస్టుల‌ను త‌ల‌పిస్తోంది. అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు టైం ద‌గ్గ‌ర‌ప‌డుతుండ‌టంతో ప్ర‌ధాన రాజ‌కీయ పార్టీలు…

Read More

ఏది సాధ్యం? ఎవరికోసం?

ముస్లీంలు ఈ దేశంలో తరచూ చర్చనీయాంశమే! దాంతో వారికి జరిగే మంచి కన్నా చెడే ఎక్కువ! వారే లక్ష్యంగా పార్టీలు వ్యూహ`ప్రతివ్యూహాలు పన్నుతుంటాయి. అది పార్టీల లాభనష్టాల వ్యవహారమే తప్ప ముస్లీంలకు ఒరిగేదేమీ ఉండదు. ముస్లీంలు ఇతర బలహీనవర్గాల సంరక్షణ కోసమే పనిచేస్తున్నట్టు చెప్పుకునే మజ్లీస్‌ ఇత్తహాదుల్‌ ముస్లిమీన్‌ (ఎంఐఎం) వల్ల కూడా వారికి కలిగే ప్రత్యేక ప్రయోజనం ఏమీ ఉండదు. కానీ, అలా పడిన ముద్ర వల్ల మజ్లీస్‌ పార్టీ పొందే రాజకీయ ప్రయోజనమే ఎక్కువ!…

Read More

ఏదైనా…కాలపరీక్షకు నిలిస్తేనే..!!

తెలంగాణ భవిష్యత్‌ రాజకీయాలకు సంబంధించిన కీలక పరిణామాలు… ఈ వారం రెండు రాజకీయ శిబిరాల్లో శీతాకాలంలోనూ వేడి పుట్టించాయి. మొదటిది, ఢల్లీిలో జరిగిన బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో ‘మిషన్‌ తెలంగాణ’ కేంద్రకంగా జరిగిన నిర్ణయాలైతే, రెండోది బుధవారం ఖమ్మంలో జరిగిన బీఆర్‌ఎస్‌ తొలి రాజకీయ సభ! ఉద్యమం నుంచి రాజకీయాలకు మళ్లిన టీఆర్‌ఎస్‌ తన 23 ఏళ్ల ప్రస్తానంతో భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్‌) గా మారింది. ఆ క్రమంలో… పెద్ద సభావేదిక నుంచి, కేంద్రంలో…

Read More

ఇంగిత జ్ఞానం లేదా..థూ… నీ బతుకు చెడ: బండి సంజయ్

తన కుమారుడి వీడియో ఘటనపై బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ ఘాటుగా స్పందించారు. దమ్ముంటే.. మొగోడైతే..కేసిఆర్  రాజకీయం తనతో చేయాలని సవాల్ విసిరారు. రాజకీయం చేయలేక..దద్దమ్మలా..కాలేజీపై ఒత్తిడి తెచ్చి కేసు పెట్టిస్తావా?అంటూ మండిపడ్డారు. పిల్లలు.. పిల్లలు కొట్లాడుకుంటారు.. మళ్లీ కలుస్తారు.. కేసు పెట్టియాల్సిన అవసరం ఏమొచ్చిందన్నారు?. తన కొడుకు తో పాటు ముగ్గురు పిల్లల జీవితాలు నాశనం చేస్తావా?.. థూ… నీ బతుకు చెడ… ఎందుకు బతుకుతున్నవో అర్ధం కావడం లేదని’  ఆగ్రహాంతో ఊగిపోయారు.చిన్న పిల్లలను…

Read More

పేరుతో కాదు..‘ఫేమ్‌’తోనే పని !

ఇంట గెలిచి రచ్చ గెలవమన్నారు. ఈ నానుడి అంతరార్థం ఇతరులెవరికన్నా కూడా తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావుకే ఎక్కువ తెలుసు. రాష్ట్ర సాధనకు, తాను శీర్షభాగాన ఉంటూ నడిపిన ఉద్యమానికి ఊపిరిపోసిన మూలసూత్రమిది! అటువంటి అవసరం ఏర్పడిరదంటే, ఎంతటి శ్రమకోర్చి అయినా అది సాధించేవరకు ఆయన వదలరు. ఇలాంటి విషయాల్లో ఆయనది రాక్షసకృషి అంటే అతిశయోక్తి కాదు. తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్‌) ని రాజకీయంగా విస్తరిస్తూ భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్‌) గా ప్రకటించి నెలలు గడుస్తున్నా…….

Read More

ఇంకా నాలుకెక్కని బిఆర్‌ఎస్‌ ….

తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్‌ఎస్‌) దేశం మొత్తానికి విస్తరించే లక్ష్యంతో భారతరాష్ట్ర సమితి (బిఆర్‌ఎస్‌) గా రూపాంతరం చెందింది. అధికారికంగా పేరు మారిన దృష్ట్యా విషయాన్ని ఎన్నికల సంఘానికి, లోక్‌సభ, శాసనసభా స్పీకర్‌ కార్యాలయాలకు, ఇతరత్రా అందరికీ తెలియజేశారు. పార్టీ నాయకులు, కార్యకర్తల శ్రేణులు దాటి పేరు ప్రజల్లోకి వెళుతున్న క్రమం ఇది. పేరు మార్పు ఎంతగా ప్రజాబాహుళ్యంలోకి వెళ్ళింది? అంతకన్నా ముందు పార్టీ నాయకుల్లో, కార్యకర్తల శ్రేణుల్లో కొత్తపేరు (బిఆర్‌ఎస్‌) ఎంతగా మెదళ్లలో నాటుకుంది …?…

Read More

ఇంట గెలిస్తేనే .. బీఆర్‌‘ఎస్‌’.. లేకపోతే కష్టమే సుమీ..!

కారులో ప్రయాణించాలంటే దాన్ని సామర్థ్యాన్ని బట్టి ప్రయాణికులుండాలి. ఓవర్‌ లోడిరగ్‌ అయితే ప్రమాదం తప్పదు. 2014 కంటే 2018 ఎన్నికల్లో జట్‌స్పీడ్‌గా వెళ్లి బీఆర్‌ఎస్‌ కారు కావాల్సిన మెజార్టీని సాధించింది. 2014 ఎన్నికల్లో 63 స్థానాలు గెలిచి బొటాబొటి మెజార్టీ సాధించిన బీఆర్‌ఎస్‌ కారు, 2018 ఎన్నికల్లో 88 స్థానాలతో  మరింత వేగవంతంగా లక్ష్యాన్ని చేరుకుంది. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుకు ఈ విజయం కూడా సంతృప్తి ఇవ్వలేదు. భవిష్యత్తులో కూడా పార్టీకి ఎలాంటి అడ్డంకులు ఉండొద్దనే భావనతో…

Read More

ట్విట్టర్ టిల్లుకు ‘‘విత్ డ్రావల్ సిమ్టమ్స్’: బండి సంజయ్

వేములవాడ: ట్విట్టర్ టిల్లు ‘‘విత్ డ్రావల్ సిమ్టమ్స్’’కారణంగా మతితప్పి మాట్లాడుతున్నాడని ఎద్దేవాచేశారు బిజేపి స్టేట్ చీఫ్ బండి సంజయ్. ముందుగా ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చిన తర్వాత.. నా తల నరకినా, చెప్పుతో కొట్టినా ప్రజల కోసం భరించేందుకు సిద్ధమన్నారు. కేసీఆర్ కుటుంబానికి అహంకారం తలకెక్కిందని దుయ్యబట్టారు. ప్రభుత్వ అధికారిగా ఉంటూ క్రైస్తవ మత ప్రచారం చేస్తారా?అంటూ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్ పై సంజయ్ విరుచుకుపడ్డారు. అలాంటి అధికారిని రోడ్లమీద ఉరికించి కొట్టండని పిలుపునిచ్చారు.   ఇక…

Read More

గురి ఎక్కడ? దెబ్బ మరెక్కడ?

‘అదిరిందయ్యా చంద్రం’ అని అప్పట్లో ఓ వ్యాపార ప్రకటన బాగా ఆకట్టుకునేది. ‘కొత్త కారు, కొత్త ఇల్లు, కొత్త భార్య వావ్‌ అదిరిందయ్యా చంద్రం…..’ ఇలా సాగుతుంది ఆ సృజనాత్మక ప్రకటన. పాత పార్టీకి కొత్త పేరే అయినా… భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్‌) ఢిల్లీ ఓపెనింగ్‌ అదిరింది సినిమా భాషలో చెప్పాలంటే! రాజకీయంగా క్లిక్‌ అవుతుందా? లేదా? అనేది ఇప్పుడు సాగుతున్న ప్రధాన చర్చ. చెట్టుకింద పోరంబోకు ముచ్చట్ల నుంచి సంపాదకుల పేజీల్లో వ్యాసాలు, టీవీ…

Read More

కేసిఆర్, కేటీఆర్ పై పేలుతున్న సెటైర్స్.. వదల బొమ్మాళి వదల అంటున్న నెటిజన్స్..!!

సీఎం కేసిఆర్, మంత్రి కేటీఆర్ పై సోషల్ మీడియాలో సెటైర్స్ పేలుతున్నాయి. అబ్బా, కొడుకులు మాటలే తప్ప.. చేతల నేతలు కాదంటూ నెటిజన్స్ కామెంట్స్ తో రెచ్చిపోతున్నారు.  ఇంతకు వీరిద్దరినీ నెటిజన్స్ టార్గెట్ చేయడం వెనక ఉద్దేశ్య ఎంటి? తెలంగాణలో దర్యాఫ్తు సంస్థల దాడుల కలకలం వేళ  ట్రోల్ చేయడం ఎంటన్న చర్చ రాజకీయ వర్గాల్లో నడుస్తోంది.  కాగా తెలంగాణ వ్యాప్తంగా చర్చనీయాంశమైన మునుగోడు ఉప ఎన్నికలో అధికార టీఆర్ఎస్.. చావు తప్పి కన్ను లొట్ట బోయిన…

Read More
Optimized by Optimole