‘వ్యూహా’ల పరుగులో ‘చిత్త’వుతున్న రాజకీయం..!
Political strategists: రాజకీయపార్టీల బాగుకు వ్యూహకర్తలు, వ్యూహసంస్థలు కావాలా? దేశ రాజకీయాల్లో ఓ కొత్త ఒరవడి బలపడుతోంది. ఏమాత్రం ప్రభావాల అంచనా (ఇంపాక్ట్ అసెస్మెంట్) లేకుండా సాగే ఈ ప్రక్రియలో వందల కోట్ల రూపాయలు చేతులు మారుతోంది. పుట్టగొడుగుల్లా వ్యూహ సంస్థలు పుట్టుకొస్తున్నాయి. సోషల్మీడియా వేదికల్ని అతిగా వాడుతూ, అసలు జనాభిప్రాయం మరుగుపరుస్తూ రాజకీయ వాతావరణ కాలుష్యం చేస్తున్నారు. ఆకర్షణీయ నినాదాల జిత్తులు, దృష్టి మళ్లింపు ఎత్తులు, వాణిజ్య మెళుకువలు, వ్యాపార చిట్కాలు… వంటి మార్కెట్ మాయలొచ్చి…