కాంగ్రెస్ ను చావనీయండి గాని నెహ్రూ-గాంధీ ఫ్యామిలీని కాపాడుకోండి!
Nancharaiah Merugumala (senior journalist): ————————————–^——— 2004 నుంచీ చావు దారిన వేగంగా నడుస్తోంది కాంగిరేసు పార్టీ. పదేళ్ల తర్వాత దిల్లీలో అధికారం కోల్పోయింది. నరేంద్రమోదీ ప్రధాని అయినాక కాంగ్రెస్ పతనానికి పార్టీ అధ్యక్షరాలు సోనియాగాంధీ, ఆమె కొడుకూకూతుళ్లు రాహుల్, ప్రియాంకా పరోక్షంగా కారకులయ్యారు. వారి దివంగత కుటుంబ పెద్ద ఇందిరాగాంధీ కాంగ్రెస్ పార్టీని రెండుసార్లు (1969,1978) చీల్చి దాన్ని బతికించారు. ఈ స్థాయిలో తర్వాత కాంగ్రెస్ పార్టీని శరద్ పవార్ గాని, ఎన్డీ తివారీ-అర్జున్ సింగ్…