KAVITHA: బిఆర్ఎస్ పార్టీకి కవిత గుడ్ బై..?
telangana: బిఆర్ఎస్ పార్టీతో తాడో పేడో తేల్చుకునేందుకు ఎమ్మెల్సీ కవిత సిద్ధమైనట్లు తెలుస్తోంది.మేడే సందర్భంగా వేదికపై ఏర్పాటు చేసిన ప్లెక్సీలో కేసీఆర్ ఫోటో కనపడకపోవడం.. ఆయన స్థానంలో ప్రోఫెసర్ జయశంకర్ ఫోటో దర్శనమివ్వడం ఇందుకు నిదర్శనంగా కనిపిస్తోంది. ఇటీవల బిఆర్ఎస్ రజతోత్సవ సభలో ఎదురైన అవమానంతో తగ్గేదేలే అన్నట్లు రాజకీయ ప్రయాణం ఉండబోతోందని కవిత చెప్పకనే చెప్పిందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే ఆమె వేరే పార్టీలో చేరతారా లేక తెలంగాణ జాగృతి పేరుతో ఒంటరి పోరాటం చేస్తారన్నది…