కేసిఆర్ రాష్ట్రాన్ని అమ్మేసిన అమ్మేస్తాడు: సీఎల్పీ విక్రమార్క
Mancherial : సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పీపుల్స్ మార్చ్ పాదయాత్ర మంచిర్యాల జిల్లాలో జోరుగా సాగుతోంది. పాదయాత్రలో భాగంగా భట్టి.. సీఎం కేసీఆర్ పై తీవ్ర విమర్శలు చేశారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సస్యశ్యామలం కాకుండా.. పదివేల కోట్లు ఖర్చుతో చేపట్టిన ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుకు అడ్డుపడ్డ అతి పెద్ద ద్రోహి కెసిఆర్ అని మండిపడ్డారు. జిల్లాలో ఉన్న సింగరేణి గనులను ప్రైవేట్ పరం చేస్తూ ఉద్యోగావకాశాలు లేకుండా చేస్తున్న కెసిఆర్ ను ప్రజలు క్షమించరని ఆగ్రహం…