ప్రీ_ పోల్ సర్వేలతో డైలమాలో తెలంగాణ ఓటర్లు..!

బొజ్జ రాజశేఖర్ (సీనియర్ జర్నలిస్ట్):  గతంలో ఎన్నడు లేని విధంగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రీ- పోల్‌ సర్వేలు రాజకీయ పార్టీలను, ఓటర్లను ఆయోమయానికి గురి చేస్తున్నాయి. జాతీయ సర్వే.. మీడియా..  పోల్‌ మెనేజ్‌మెంట్‌  సంస్థలు ప్రీ పోల్‌ సర్వేలను విడుదల చేశాయి. సర్వేల్లో మెజార్టీ కాంగ్రెస్‌ గెలుస్తుందిని.. కొన్ని సంస్థలు బీఆర్‌ఎస్‌ గెలుస్తుందని, బీజేపీ, బీఎస్‌పీ పార్టీలు ప్రధాన పార్టీల కొంప ముంచనున్నాయని ఇలా ఎవ్వరికి ఇష్టం వచ్చిన రీతిలో వారు సర్వేలు బహిరంగం వెల్లడించాయి. …

Read More

తెలుగు రాష్ట్రాల యువత భవిష్యత్తు బంగారం కావాలి: పవన్ కళ్యాణ్

Telanganaelections: ‘ తాను ఏనాడూ పదవులు కోసం రాజకీయాల్లోకి రాలేదన్నారు జనసేన అధ్యక్షులు  పవన్ కళ్యాణ్. తెలంగాణ ఎన్నికల ప్రచారంలో భాగంగా జనసేన- బీజేపీ అభ్యర్థుల విజయాన్ని కాంక్షిస్తూ దుబ్బాకలో ఏర్పాటు చేసిన సకల జనుల విజయ సంకల్ప సభలో పవన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అధికారం కోసం తాను ఏ నాడూ అర్రులు చాచలేదన్నారు. అధికారం, పదవులు మాత్రమే ఆఖరి లక్ష్యం అయితే  ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోనే రాజకీయాలు చేసుకునేవాడినని..అక్కడే ఉండిపోయేవాడినని స్పష్టం…

Read More

నేనూ కాపోడినే: సీఎం కేసీఆర్

Nancharaiah merugumala senior journalist:    “నేనూ కాపొడినే..   కరీంనగర్ లో కేసీఆర్ వెల్లడిసకల కాపు సోదరసోదరీమణులకూ చల్లని మాటిది” ‘నేనూ కాపోడినే,’ అని సోమవారం కరీంనగరు ఎన్నికల సభలో తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు వెల్లడించారు. మున్నూరు కాపు మంత్రి గంగుల కమలాకర్ గెలుపు కోసం బీఆరెస్ అధినేత ప్రచారం చేస్తూ, ‘ నేనూ కాపోడినే. నేనూ వ్యవసాయం చేస్తన్నా. కాపోడిగా రైతు కష్టం నాకు తెల్సు,’ అని తెలంగాణ సీఎం బహిరంగంగా ప్రకటించడం…

Read More

భారీ మెజార్టీతో బీజేపీ, జనసేన అభ్యర్థులను గెలిపించండి: పవన్ కళ్యాణ్

Telanganaelection2023: ఆంధ్రలో రౌడీలు రాజ్యాలేలుతున్నారని జనసేన అధ్యక్షులు  పవన్ కళ్యాణ్ మండిపడ్డారు.రౌడీలను, గూండాలను, ఫ్యాక్షనిస్టులను ఎదుర్కొని నిలబడి ఉన్నానంటే దానికి ముఖ్య కారణం తెలంగాణ ఇచ్చిన స్ఫూర్తేనని ఆయన స్పష్టం చేశారు.ధన బలం లేకపోయినా గుండె ధైర్యం, ఆశయ బలం ఉంటే ఏదైనా సాధించవచ్చునని ఈ నేల నేర్పిందన్నారు. 1200 మంది ఆత్మ బలిదానాలతో ఏర్పాటైన తెలంగాణ రాష్ట్రం అవినీతి, కమీషన్ల తెలంగాణగా మారిపోవడం చూసి బాధ కలిగింద”ని జనసేనాని ఆవేదన వ్యక్తంచేశారు. ఆంధ్ర నాకు జన్మనిస్తే…

Read More

కూకట్ పల్లిలో జనసేన జెండా ఎగరాలి: నాదెండ్ల మనోహర్

Telangana election2023: కూకట్ పల్లి నియోజకవర్గం జనసేన అభ్యర్ధి  ముమ్మారెడ్డి ప్రేమ కుమార్ గెలుపు కోసం ప్రతి ఒక్క జన సైనికుడు, వీర మహిళ కృషి చేయాలని  జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్  నాదెండ్ల మనోహర్ పిలుపునిచ్చారు.  మంగళవారం సాయంత్రం కూకట్ పల్లి జనసేన పార్టీ కార్యాలయంలో  ఎన్నికల ప్రచార సరళి, అనుసరించాల్సిన విధానాలపై పార్టీ బాధ్యులతో మనోహర్ ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాలను కవర్ చేసేలా ప్రచారం  చేయాలని సూచించారు….

Read More

కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో విడుదల…

inctelangana:2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తన ఎన్నికల మేనిఫెస్టో ను శుక్రవారం నాడు విడుదల చేసింది. గాంధీ భవన్ లో జరిగిన ఈ కార్యక్రమంలో ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే ముఖ్యఅతిథిగా పాల్గొని మ్యానిఫెస్టో ను విడుదల చేసారు. మేనిఫెస్టో కమిటీ ఛైర్మన్ శ్రీధర్ బాబు చైర్మన్ మేనిఫెస్టో రూపొందించారు.టీపీసీసీ వర్కింగ్ ప్రసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన ఈ కార్యక్రమం జరిగింది.అభయహస్తం.. మేనిఫెస్టో పేరుతో ఇందిరమ్మ రాజ్యం.. ఇంటింటా సౌభాగ్యం అంటూ 37 అంశాలతో…

Read More

కాంగ్రెస్ పార్టీ ప్రకటనలపై(యాడ్) నిషేధం..

Telanganaelections2023: అధికార పార్టీల ఒత్తిడి కారణంగానే ఎన్నికల కమీషన్ కాంగ్రెస్ పార్టీ ప్రకటనలకు(యాడ్) లను నిషేధించిందని కాంగ్రెస్ పార్టీ పేర్కొంది. ఈ మేరకు తెలంగాణ కాంగ్రెస్ ట్వీట్ చేసింది.ఓడిపోతామని తెలిసి, బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు చేసిన ఒత్తిడి కారణంగానే ఎన్నికల కమీషన్ ప్రకటనలను నిషేదిస్తూ నిర్ణయం తీసుకుందని తెలిపింది. అంతేకాదు ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండానే కాంగ్రెస్ ప్రకటనలను ఎన్నికల కమీషన్ నిషేదించిందని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. అయితే కేవలం మీడియా ఛానెళ్లలో మాత్రమే ప్రకటనలను నిషేదించడంతో…

Read More

భార్యను గెలిపించుకోవాలని ఉత్తమ్ నయా స్కెచ్..

(nancharaiah merugumala senior journalist): గొల్ల మల్లయ్యను ఓడించి, భార్య పద్మావతిని గెలిపించుకోవడానికి కర్ణాటక డెప్యూటీ సీఎం డీకే శివకుమార్, ‘సరిహద్దు నేత’ రఘువీరారెడ్డిని కోదాడ  రప్పించిన ఉత్తమ్‌ రెడ్డి నిజంగా గ్రేట్‌! బీఆరెస్‌ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్‌ ను ఓడించి, భార్య పద్మావతిని గెలిపించుకోవడానికి కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్, ఆంధ్రా పీసీసీ మాజీ నేత, మాజీ మంత్రి, కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ సభ్యుడు ఎన్‌ రఘువీరారెడ్డిని  శుక్రవారం కోదాడ రప్పించారు నలమాడ…

Read More

బీఆర్ఎస్ నేతలకు ఇదో కనువిప్పు లాంటి కథ..

కిరణ్ రెడ్డి వరకాంతం (ఐన్యూస్ జర్నలిస్ట్):  అధికార పార్టీ అభ్యర్థులపై నెగిటివ్ టాక్ కు అసలు కారణమేంటి ?అభివృద్ధి చేసినా సానుభూతి ఎందుకు లేదు ?వారి ఎదురీతలో ఆంతర్యమేంటి ?తిన్నొడే తన్నాడా ? నిజంగా నిజాలు ఎప్పుడూ చేదుగానే ఉంటాయి.పొగిడితే తప్పా నిజం చెబితే ఎవరూ నమ్మరు.ఈ కథంతా ఎందుకు చెబుతున్నా అంటే…అసెంబ్లీ ఎన్నికల పోరు హోరా హోరీగా సాగుతుంది.ఇప్పుడు రాష్ట్రంలో ఎక్కడ చూసినా….ఇది గెలిచే సీట్ అని ఎవరూ ఖచ్చితంగా చెప్పలేక పోతున్నారు.సర్వే సంస్థలు కూడా…

Read More

కుత్బుల్లాపూర్‌ గౌడ ‘కూన’లు ఎంతగా కలబడినా ‘కొలను’ రెడ్డికి ఫాయిదా ఉండదు!

Nancharaiah merugumala senior journalist:(కుత్బుల్లాపూర్‌ గౌడ ‘కూన’లు ఎంతగా కలబడినా ‘కొలను’ రెడ్డికి ఫాయిదా ఉండదు!ఇది హైదరాబాద్‌ మెట్రోపాలిటన్ ఏరియా..కాకినాడ రూరలో, రామచంద్రపురమో కాదు!!) ===================== గురువారం సూరారం రాంలీలా మైదానంలో– జాబిలీ హిల్స్‌లో భూమి విలువేగాక, హైదరాబాద్‌ నగర శివార్లలోని నేల ఖరీదెంతో తెలిసిన ఓ కృష్ణా జిల్లా ‘సెటిలర్‌’ యాజమాన్యంలోని ఓ తెలుగు టీవీ న్యూజ్‌ చానల్‌ నిర్వహించిన బహిరంగ చర్చలో ఒకే కులానికి చెందడమేగాక ఒకే ఇంటి పేరున్న ప్రస్తుత ఎమ్మెల్యే కూన…

Read More
Optimized by Optimole