literature: తెలుగు ‘కథ’ మీద ఏంటో ఈ తీరు?
విశీ: తెలుగు భాషా పరిరక్షణకు, తెలుగు సాంస్కృతికవ్యాప్తి కోసం పదేళ్లుగా ఒక మాసపత్రిక నడుస్తోంది. ఈ మధ్యనే ఆ పత్రికకు సంబంధించి ఒక వెబ్‌సైట్ కూడా మొదలుపెట్టారు. సరే! ఒకసారి చూద్దాం అని ఇవాళ చూశాను. ఏదైనా పత్రికలో నాకు ఎక్కువ ఆసక్తి కలిగించేవి కథలు. ఇందులో కథలు ఏమున్నాయో చూద్దామని PDFలు డౌన్‌లోడ్ చేశాను. దాదాపు ఆరు నెలల క్రితం వరకూ చూశాను. ఒక్కటంటే ఒక్క కథ లేదు. మధ్యలో ఒకే ఒకసారి ఏనాడో ఆంగ్లం…