literature: ‘ఇర్లచెంగి’.. భలే భలేటి కథల మనిషి..!

సాయి వంశీ:   తెలుగులో ఆడవాళ్లు తమ బాల్య జ్ఞాపకాలు కథలుగా రాయడం అరుదు. నాకు తెలిసి సోమరాజు సుశీల ‘ఇల్లేరమ్మ కతలు’, పొత్తూరి విజయలక్ష్మి ‘నోస్టాల్జియా’, మన్నం సిందుమాధురి ‘ఉళైనూరు క్యాంపు కతలు’ రాశారు. ఇప్పుడు ఆంధ్రజ్యోతిలో జూపాక సుభద్ర తన బాల్య జాపకాలు రాస్తున్నారు. అలాగే కొన్ని కథల్లో ఎండపల్లి భారతక్క తన బాల్యం గురించి రాశారు. (ఇంకెవరైనా రాసి ఉంటే మెన్షన్ చేయండి). చిత్తూరు జిల్లాలో పుట్టిన ఆచార్య మహాసముద్రం దేవకి గారు…

Read Full News

Literature: స్వయంకృతాపరాధం..

దిలీప్ రెడ్డి సీనియర్ జర్నలిస్ట్: స్వయంకృతం – – – – – – – – సీ : గర్వమెవ్వరినైన గతితప్పగాజేయు వడిజార్చి పడగొట్టు పతనమునకు, కడు అహంకారమే కడతేర్చు హోదాల కనరాని పాట్లనే కడ మిగుల్చు, దర్పమేవిధి సమ్మతము కాదు, సంపద మిడిసిపాటున దుఃఖమేను కడకు, ‘నేన’నేటి నియంత యెంతటి ఘనుడైన నాకౌట్ (Knockout) తప్పదేనాటికైన తే.గీ : యిన్ని రీతుల కాసుకొనిడుములుండ…. యేల నిశ్చింతగుండెనో యెరుకలేక! కలలొనైనను ఊహించనలవి కాని ఓటమాతడ్ని శాపమై…

Read Full News

Poetry: నిన్నను క్షమించేద్దాం..!

Poetry:  నిన్నను క్షమించేద్దాం రేపటి రోజును నాశనం చేసే అవకాశాన్ని నిన్నకు ఇవ్వొద్దు. బాస రూపుమాసిపోతుంది. గొంతు ఊగిసలాడుతుంది. రాలిన ఆకుల చప్పుళ్లతో చెవులు గింగురుమంటుంటాయి. పొద్దు పొడిచే లోపే అవకాశానికి ఆటంకం ఎదురవుతుంది. నిన్నటి రోజును దాని మానాన గడచిపోనిద్దాం. కాలజాలంలోని కలనేతను కాసింత సడలించుదాం. రేపటి రోజును అదుపు చేయవద్దని నేటిని వేడుకుందాం. వెనుదిరిగి చూడనే చూడొద్దు. ఇక నిన్ను నడిపించేది నీ సంకల్పమే! — బాస్క్‌ మూలం: వీ ఫ్లమింగో స్వేచ్ఛానువాదం: పన్యాల…

Read Full News

Telugu literature: కుక్కతోక..!

Literature:  కుక్కతోక ‘నేను బాగా నాట్యమాడతాను’ కుక్కతో దాని తోక అంది. ‘మనం పోటీ పడదాం’ తోకకు సవాలు విసిరింది కుక్క. అలసిపోయిన కుక్క సహనం కోల్పోయింది. తోకను కొరికి అవతలకు ఉమ్మేసింది. ‘జాగ్రత్త! ఏమనుకున్నావో, ఏమో!’ గుర్రుమంటూ హెచ్చరించింది. — టిగ్రిన్యా మూలం: రీసమ్‌ హెయిలీ స్వేచ్ఛానువాదం: పన్యాల జగన్నాథదాసు

Read Full News

Telugu literature: నేటి సాహిత్యం..వంకర నవ్వులు..!

Poetry :  వంకర నవ్వులు దొంతర దంతాలు ఒక దాని మీద ఒకటి వాలి ఉంటాయి- సందడి చేసే ప్రియురాళ్లలాగ. పలువరుసలోని దంతాలన్నీ ఒకే వరుసలో ఉండాలని నియమమేమీ లేదు. ఏదో మోజు కొద్ది జనాలు వంకర నవ్వులను సవరించుకోవడానికి పలువరుసలను చక్కదిద్దుకుంటూ ఉంటారు. — ఫేరోయీస్‌ మూలం: పాలా గార్డ్‌ స్వేచ్ఛానువాదం: పన్యాల జగన్నాథదాసు

Read Full News

Poetry: రెండు సమాధుల దూరంలో…!

Panyalajagannathdas:  రెండు సమాధుల దూరంలో… రెండు సమాధుల దూరంలో దేవదూతల వీపులకు రెక్కలేవీ ఉండవు. వాళ్ల అలజడి నేలను అతలాకుతలం చేస్తుంది. మొత్తానికి ఏదోలా శాశ్వతంగా నిద్రిస్తున్న వారికి సూర్యోదయం చేరువవుతుంది. రెండు సమాధుల దూరంలో ఎవరూ పట్టించుకోని రెక్కల కుప్పలు- ఇప్పుడెవరికీ అవి ఏమాత్రం అక్కర్లేదు. గగనపు గరిక భస్మాన్నిపోగుచేస్తూ, మునివేళ్లతో నీట కలుపుతూ ఆరిపోతున్న గొంతుల్లో నేను దగ్ధమవుతున్నాను. రెండు సమాధుల దూరంలో ఆశల ధిలాసాతో గుండెల మీద చేతులేసుకున్న వాళ్లెవరూ లేరు. ఎవరి…

Read Full News

SriSri : శ్రీశ్రీకి… అశ్రుదీపాల అల్విదా..!

Taadi prakash: Last Journey of the greatest poet of 20th century రాయగడలో సూర్యోదయంతోపాటే లేచారు శ్రీశ్రీ. ఉదయం 8.30కే చర్చావేదిక. ప్రశ్న జవాబు సెషన్. సాయంత్రం బహిరంగ సభ. 1981 మే నెల 2వ తేదీ శనివారం. రాయగడ మున్సిపల్ టౌన్ హాలు. శ్రీశ్రీకి సన్మానం. రచయితలు అర్నాద్, మంథా వెంకట రమణ, పంతుల జోగారావు ముఖ్య అతిథులు. జర్నలిస్టు ‘జోత్స్న’, వెలుగు రామినీడు మరికొందరు నిర్వాహకులు. శ్రీశ్రీ ఉపన్యాసకుడు కాదు. గంభీరమైన…

Read Full News

literature: రచయితలై బతికి బట్టకడదామనేనా?

విశీ( సాయి వంశీ):  (Note) : ఇది సరదాగా రాసిన పోస్టు. ఇది ఎవర్నీ ఉద్దేశించింది కాదు. చదివి సరదాగా నవ్వుకోండి…. అని నేనంటే అచ్చంగా నమ్మేరు! అలా ఏమీ లేదు. ఇది సీరియస్‌గా రాసిందే. నాతోసహా కొంతమంది స్వీయ అనుభవాలు విని రాసింది. మనకు ‘రచయిత’ అని పేరు రావడమూ, మన ఇంటిని పోలీస్‌స్టేషన్‌కు అద్దెకివ్వడమూ ఒక్కలాంటివే! వేళాపాళా లేని అనేక విషయాలు మనల్ని వెంటాడుతూ ఉంటాయి. అనేక ఊహాగానాలు మన మీద చెలరేగుతూ ఉంటాయి….

Read Full News

Poetry: ‘ నిశ్శబ్దం ‘..నెమ్మదిగా పాకుతోంది..!

Panyala jagannathdas:  నిశ్శబ్దం.. రాత్రి తెరలను దించిన చేయి కాంతిని నిశితంగా చూస్తూ పకాలుమని నవ్వుతోంది. సీసాలో ఉక్కిరిబిక్కిరి అవుతున్నదేమిటి? పరచుకున్న మబ్బు, కాసింత వెలుగు. చీకటి కనుగుడ్లను చీల్చుకుని దూసుకెళ్లిన బాణం ధవళ చిహ్నాలను విడిచిపెట్టింది. కిటికీకి ఆవల రాత్రి తెర మీద ఒక ఉల్క నెమ్మదిగా పాకుతోంది. — కజక్‌ మూలం: అర్దక్‌ నుర్గాజ్‌ స్వేచ్ఛానువాదం: పన్యాల జగన్నాథదాసు

Read Full News

Storytelling: విశీ..భూగోళమంత చేదు (మైక్రో కథ)..!!

విశీ( సాయి వంశీ) : “హూ! కమాన్..” “హే! వద్దు ప్లీజ్!” “ప్లీజ్! ఈ ఒక్కసారికి. ఎలాగూ ఇంత దూరం వచ్చాం కదా! ఇదే లాస్ట్ టైం. ప్లీజ్.. ప్లీజ్.. నాకోసం” “ఎప్పుడూ ఇలాగే చెప్తావ్! వద్దంటున్నా ఇంతదూరం తీసుకొచ్చావ్! నాకిష్టం లేదు..” “హే! నాకోసం. ప్లీజ్.. ప్లీజ్! మన లవ్ కోసం. నేనే కదా! ఏమీ కాదు. ప్లీజ్! కొంచెం సేపు.. జస్ట్‌.. కొంచెంసేపే! నువ్వు చేయకుంటే మన లవ్ మీద ఒట్టు. ప్లీజ్” మొహం…

Read Full News
Optimized by Optimole