Poetry: ఆమె ఎంతటి గాఢనిద్రలో ఉందంటే..?

Panyalajagannathdas:  సాహసించలేను.. ఆమె ఎంతటి గాఢనిద్రలో ఉందంటే, ఆమెను మేల్కొలిపేందుకు నేనిప్పుడు సాహసించలేను. ఆమె మాయాజాలంలో చిక్కుకున్నట్లు నా నాలుక పిడచగట్టుకుపోయింది. నా మాటలు గొంతు పోగొట్టుకున్నాయి. తననిలా చూడటానికి నా రెండు కళ్లూ చాలవు. తనను ముద్దాడటానికి నా పెదవులిక నిరీక్షించలేవు. ఇక ఓపలేని ఆత్రంతో నా ఓపికను కోల్పోతున్నాను. — ఇలాంటప్పుడే, ఒక అమరకవి ఇలా అన్నాడు- నేను మరణించానే గాని, నాలోని లౌకికానందానుభూతి మరణించలేదు. జీవంలేని నా దేహంలోంచి నా ఆత్మ సీతాకోకలా…

Read Full News

Illustrator: బొమ్మలేయడం కన్నా, బొమ్మలేస్తాం అని చెప్పుకోవడం కష్టం..!

Charanparimi: ( Illustrater అను అనామకుడు! ) బొమ్మలేయడం కన్నా,  బొమ్మలేస్తాం అని చెప్పుకోవడం కష్టం.  ఊర్లో మానాన్న నన్ను ఎమ్మార్వో ఆఫీస్ లో ఉద్యోగికి పరిచయం చేశాడు. ఆయన నన్ను ఏం చేస్తున్నావమ్మా అన్నాడు. గవర్నమెంట్ జీతగాళ్ల స్టైల్లో. ఇలస్ట్రేటర్ అంటే అర్థం కాదని పత్రికలో కార్టూనిస్ట్ అన్నా. అంటే బొమ్మలు గీయటమేగా. ఇంకేదన్నా మంచి ఉద్యోగం చూసుకోకూడదు, అన్నాడు.  నాకు మోయే.. మోయే!  అప్పటిదాకా ఈ బొమ్మలు వేయడం ఒక ప్రత్యేకమైనది. చాలా గొప్పది…

Read Full News
jaripha,jammu kashmir

Poetry: కవిత్వం రాయాలని.. కోడింగ్ భాష కనిపెట్టారామె..

విశీ:  తూర్పు కశ్మీర్‌లోని బండిపోర్ జిల్లా నైద్‌కయ్ గ్రామానికి చెందిన 65 ఏళ్ల జరీఫా జాన్ గురించి మీరు తెలుసుకొని తీరాలి. ఎందుకు? ఏమిటి ఆమె ప్రత్యేకత? సూఫీ కవిత్వం రాయడంలో ఆమె ప్రసిద్ధురాలు‌. అదేం గొప్ప? ఎంతో మంది కవిత్వం రాస్తున్నారు. ఆమె రాతలేం ప్రత్యేకం? ప్రత్యేకమే! ఆమెకు చదువు రాదు. చదవడం, రాయడం తెలియదు. అయినా కవిత్వం రాసేందుకు తన కోసం కొత్త భాష కనిపెట్టారు. కాగితంపై కలంతో సున్నాలు చుడుతూ కవితలు, పాటలు…

Read Full News

literature: తెలుగు ‘కథ’ మీద ఏంటో ఈ తీరు?

విశీ:  తెలుగు భాషా పరిరక్షణకు, తెలుగు సాంస్కృతికవ్యాప్తి కోసం పదేళ్లుగా ఒక మాసపత్రిక నడుస్తోంది. ఈ మధ్యనే ఆ పత్రికకు సంబంధించి ఒక వెబ్‌సైట్ కూడా మొదలుపెట్టారు. సరే! ఒకసారి చూద్దాం అని ఇవాళ చూశాను. ఏదైనా పత్రికలో నాకు ఎక్కువ ఆసక్తి కలిగించేవి కథలు. ఇందులో కథలు ఏమున్నాయో చూద్దామని PDFలు డౌన్‌లోడ్ చేశాను. దాదాపు ఆరు నెలల క్రితం వరకూ చూశాను. ఒక్కటంటే ఒక్క కథ లేదు. మధ్యలో ఒకే ఒకసారి ఏనాడో ఆంగ్లం…

Read Full News

Literature: సాహిత్య సభల్లో టైమర్ అవసరం..!

విశీ: సాహిత్య సభల్లో టైమర్ పెట్టాలని, వాళ్లకి కేటాయించిన టైం రాగానే ఒక నిమిషం ముందు గంట మోగేలా ఏదైనా ఏర్పాటు చేయిస్తే బాగుంటుందని అప్పుడప్పుడూ అనుకుంటూ ఉంటాను.(నేను చూసినంత వరకు ఖదీర్ గారు నిర్వహించే సమావేశాలు టైం ప్రకారం జరుగుతాయి. టైం కాగానే ఆయన లేచి వాచీ చూస్తారు. ప్రసంగం ముగించాల్సిన సమయం వచ్చిందని అర్థమవుతుంది). TED Talksలో 18 నిమిషాలలోపు ప్రసంగం ముగించాలి. ఎంత ఘనులైనా అదే నిబంధన! మన దగ్గర మాత్రం కొందరు…

Read Full News

Telugu literature: రచయితలకు ఎడిటర్లు ఏమీ చెప్పరా..?

విశీ:  ఆ మధ్య కాలంలో ఒక రచయిత్రి ఒక కథ రాశారు. ఆ కథ పేరు నన్ను బాగా ఆకర్షించింది. కథ చదవకపోయినా ఆ పేరే చాలా కొత్తగా అనిపించి బాగా గుర్తుండిపోయింది. అదే పేరుతో ఆ రచయిత్రి కథల పుస్తకం కూడా వేశారు. ఆమెతో నాకు పరిచయం లేదు. ఎక్కడుంటారో తెలియదు. ఆ పుస్తకం ఎలా తెప్పించుకోవాలా అని చాన్నాళ్ల నుంచి అనుకుంటూ‌ ఉన్నాను. మొన్న బుక్ ఫెయిర్‌కి వెళ్లినప్పుడు ఆ పుస్తకం చూశాను. మళ్లీ…

Read Full News

మన తెలుగు పాటకిదే పట్టాభిషేకం..(స్వీయ రచన)

తెలుగు వెలుగు సాహిత్య వేదిక తేదీ 15-3-2023. అంశం, ప్రాసాక్షరి గీతం నననన,వవవవ,మిమిమిమి. శీర్షిక కీర్తి నిలుపు తెలుగు. మన తెలుగు పాటకిదే పట్టాభిషేకం జనపద జీవన లయల హర్షాతిరేకం పనస తొనల పలుకుల మధురగీతం ఘనతను సాధించేనేడు గానలహరి సంగీతం కవనమ్మున నాటుపదం పల్లవించినది నవరాగ సమ్మేళనం నాట్యమాడినది అవని లోని అణువణువు పులకరించినది జవసత్వముల తోడజగతికీర్తిపొందినది. సమిష్టి కృషి ఫలితమే ఈ ఆస్కారం తమిదీరని చలనచిత్ర మమకారం స్వామి దయతో వెండితెర వైభవవెలుగులు పంచాలి…

Read Full News

కవి జీవితం …

కవి ఎప్పుడూ రెండు జీవితాలను జీవిస్తుంటాడు. ఒకటి బాహ్యప్రపంచంలో, రెండోది అంతరంగంలో… కవి కళ్ళలోకి సూటిగా చూడు. అంతులేని అగాధాలు కనిపిస్తాయి. కాస్త సుదీర్ఘంగా చూశావనుకో, నువ్వందులో మునిగిపోవడం ఖాయం. చాలామంది కవుల కళ్ళలోకి అలా చూడరనుకో, కనీసం, కవి రాసిన కవిత్వాన్ని చేతుల్లోకి తీసుకో, ఒక్కొక్క పదమే తాపీగా చదువుకో. కవి రెండు భిన్నప్రపంచాల్లో జీవిస్తుంటాడు. — డకోటా మూలం: ఎమ్నాబీ తెలుగు స్వేచ్చానువాదం: పన్యాల జగన్నాథదాసు  

Read Full News

‘ మాతృ’ భూమిని.. భాషను మరిచిపోతే ఏం లాభం?

నేను పుట్టిపెరిగిన మ‌ట్టి భాషను  ఒక‌వేళ నేను మ‌ర‌చిపోతే, నా జ‌నాలు పాడుకునే పాట‌ల‌ను ఒక‌వేళ నేను మ‌ర‌చిపోతే, నాకు క‌ళ్లూ చెవులూ ఉండి ఏం లాభం? నాకు నోరుండి ఏం ప్ర‌యోజ‌నం? నా మ‌ట్టి ప‌రిమ‌ళాన్ని ఒక‌వేళ నేను మ‌ర‌చిపోతే, నా మ‌ట్టి కోసం నేనేమీ చేయ‌క‌పోతే, నాకు చేతులుండీ ఏం ఉప‌యోగం? నేనీ ప్ర‌పంచంలో దేనికి బ‌తుకుతున్న‌ట్లు? నా భాష పేద‌ద‌ని, బ‌ల‌హీన‌మైన‌ద‌ని అనుకోవ‌డం ఎంత వెర్రిత‌నం? నా త‌ల్లి తుదిప‌లుకులు ఎవెంకీ మాట‌లైన‌ప్పుడు!…

Read Full News
Optimized by Optimole