Saibaba: ఒక వీరునికి కడసారి వీడ్కోలు..!

తాడి ప్రకాష్: 2024 అక్టోబర్ 14,హైదరాబాద్, మౌలాలిలోని ఒక పెద్ద అపార్ట్ మెంట్ కింద కార్ పార్కింగ్ ప్లేస్ అంతా జనంతో కిటకిటలాడుతోంది. మధ్యాహ్నం 12 దాటుతోంది. జనం వస్తూనే వున్నారు. అల్విదా.. సాయిబాబా అంటున్నారెవరో! ఎర్ర గులాబీల దండల కింద ఒక కవి ఏ కదలికా లేకుండా వున్నాడు. సుత్తికొడవలితో మెరుస్తున్న ఎర్ర జెండా కింద… రాజీపడని, తలవంచని, భయమెరుగని యోధుడొకడు అచేతనంగా వున్నాడు. ప్రొఫెసర్ గోకరకొండ నాగసాయిబాబా అనే ప్రజల మనిషిని చివరిసారి చూడడం…

Read More

Balagopal: స్మరిస్తేనే రోమాలు నిక్కపొడుస్తాయ్.. కారణజన్ముడికి నివాళి..!

ఆర్. దిలీప్ రెడ్డి ( సీనియర్ జర్నలిస్ట్): ఎవరితోనూ పోల్చలేని వ్యక్తి బాలగోపాల్. నలుగురికి ఉపయోగపడే పనికి ప్రతిరూపం ఆయన.సమస్యను సమ్యక్ దృష్టితో చూడ్టం, అర్థంచేసుకోపడం, అందరికీ అవగాహన కలిగించడం, సమాధానాలు-పరిష్కారాల కోసం ఉద్యమీకరించడం… ఇలా తాను ఆచరిస్తూ, ఉదాత్త నేతృత్వంతో హక్కులకై పోరాడే ఒక తరాన్నే తయారుచేసిన కర్మయోగి! ఆయన ఆలోచనల బలం, తాత్విక దృష్టి విశాలత్వం, ఆచరణలోని నిబద్దత… ఎందరెందరినో ప్రభావితం చేసి, అభిమానులుగా, హక్కుల కార్యకర్తలుగా జేసింది. అణచివేత, నిర్బంధం, పీడన, హక్కుల…

Read More

ARTISTMOHAN:నిబద్ధత లో నిలువెత్తు తాడి చెట్టు…!

Taadi Prakash: (సెప్టెంబర్ 21 మోహన్ ఏడవ వర్ధంతి) హృదయంలో ప్యూరిటీ – ఆలోచనల్లో క్లారిటీ – ఈ రెండూ కలిస్తే ఆర్టిస్ట్ మోహన్ అవుతారు. తనలో మైనస్ పాయింట్ ఏమిటంటే ఎవరైనా సరే చదువుకోవాల్సిందే అంటాడు. డబ్బు సంపాదించమని, మేడలు కట్టుకోమనీ, విజయానికి కేవలం 555 మెట్లేననీ చెబితే బాగుంటుందిగానీ… దరిద్రంగా ఈ చదువుకోవడమేమిటో అని విసుక్కున్నా చికాకు పడినా.. రచయితలు, ఆర్డిస్టులు, కవులు, జర్నలిస్టులూ ఎప్పుడూ చదువుతూ ఉండవల్సిందేనని పదేపదే చెబుతుంటాడు. మోహన్ అలాగే…

Read More

KishanRao: పరహితునకు ఎదురులేదు..నివాళి..!!

ఆర్. దిలీప్ రెడ్డి (సీనియర్ జర్నలిస్ట్): ఈయనకు ఇంత దైర్యం, సాహసం… నిజంగా ఎక్కడి నుంచి వచ్చాయి అని నాకు ఎప్పుడూ ఆశ్చర్యంగా ఉండేది. నేను జర్నలిజంలోకి వచ్చిన కొత్త రోజుల నుంచీ చూస్తున్నా! 80ల చివర్లో, 90ల ఆరంభంలో….. ఎన్ని నిరసనలు, ఆందోళనలు, ఉద్యమాలు నడిపారో! 88 యేళ్ల నిండు జీవితం ఒక సాహస ప్రయాణం! పటాన్ చెరు, దాని చుట్టుపక్కల జరిగిన చాల కాలుష్య వ్యతిరేక ఉద్యమాలకు డాక్టర్ ఏ కిషన్ రావు గారు…

Read More

Ramana: ‘మిథునం’ పరిమళం మనసు దోచింది.. రమణ స్మృతిలో..!

సాయి వంశీ (విశీ): (ఒక కథ.. రెండు అద్భుతాలు ❤️❤️) తెలుగు నేలంతా తెలిసిన కథ‌ శ్రీరమణ గారు రాసిన ‘మిథునం’. 1997లో ప్రచురితమై తెలుగు వారికి పంచిన పరిమళం గురించి ఎంత చెప్పినా తక్కువే! చదివినవారంతా బాగుందని వదిలేయకుండా మిగిలిన వారితో చదివించారు. ఆ రుచి అందరికీ పంచారు. బాపు అంతటి వారు చదివి.. ఆనందంతో స్వదస్తూరితో కథ రాశారు. 2012లో తనికెళ్ల భరణి గారి దర్శకత్వంలో చిత్రంగా రూపొంది ప్రేక్షకుల మనసు దోచింది. అయితే…

Read More

గద్దర్ కి కన్నీటి నివాళి!

రాదిరె:   శిశిర కాలపు శీతగాలి ఒరిపిడి పెడుతోంది. స్వెటర్ కూడా లేదు, వేడి వయసు బద్దకమేమో… కొనాలి అనుకుంటూనే వాయిదా వేస్తున్నా. ఏముందిలే, ఒకపూటేగా….! ఆ ఉత్సాహం, ఆ ఉద్వేగం మాత్రం చూడాలి! ఎందుకనుకున్నానో… ఆ పూట అలా ఫిక్సయిపోయా! 1989 జర్నలిజం వృత్తిలోకొచ్చి నెలలు అవుతోందంతే! రిపోర్టింగ్ కి రాలేదింకా… ట్రయినీ సబెడిటర్ గానే వున్నా! సోమాజీగూడ ఆఫీస్ లో పని కాస్త తొందరగానే ముగించుకొని, బయటపడేటప్పడికి 8 దాటినట్టుంది. జాగుచేయకుండా నేరుగా నిజాం కాలేజీ…

Read More

ఓ పట్టుదల, మరో పట్టువిడుపు..!

తండ్రి పార్థసారథి గారెంత పట్టుదలో…. తనయుడు వట్టి వసంత్‌ కుమార్‌ గారిది అంతటి పట్టువిడుపు తత్వం. పైకి కటువుగా, మొరటుగా, ఇగోయిస్టిక్‌గా కనిపించినా…లోన వెన్నంటి మెత్తటి మనస్తత్వమాయనది. ఆరోగ్యసమస్యలు చివరి రోజుల్లో బాగా ఇబ్బందిపెట్టాయి కానీ, ఇంకొంత కాలం హాయిగా గడవాల్సిన జీవితం నాలుగు రోజుల కింద ముగిసింది. సుదీర్ఘ కాలం డా.వై.ఎస్‌.రాజశేఖరరెడ్డి గారికి సన్నిహితుడిగా, 80ల నుంచే ఆయన అనుయాయుల్లో ముఖ్యుడిగా ఉన్న వ్యక్తి. నాకు 90ల నుంచి పరిచయం. వై.ఎస్‌.ప్రభుత్వంలో గ్రామీణాభివృద్ది శాఖ మంత్రిగా…

Read More

అరుదుగా… HR లో Human..(నివాళి)

‘జర్నలిజం చేయాలని ఎందుకు అనుకున్నావ్‌?’ ఏదో తెలుగు భాషపైన అభిమానం, పట్టు ఉన్నాయి గనుక ‘పట్టు అంటే, ఎట్లా వచ్చింది ఏమైనా చదివావా?’ ఆ… చదివాను, తెలుగు సాహిత్యం. ‘ఏం సాహిత్యం చదివావు?’ రామాయణ, భారత, భాగవతం వంటి ప్రాచీన పద్య సాహిత్యం నుంచి ఆధునిక వచన సాహిత్యం వరకు ఏవేవో చదివా. ‘….. ఊ, ఎవరెవరి పుస్తకాలు చదివావేంటి?’ నన్నయ, పోతన, పెద్దన, శ్రీనాథుడి నుంచి విశ్వనాథసత్యన్నారాయణ, గురజాడ, శ్రీశ్రీ, చలం, ఆత్రేయ… ఇలా చాలా…

Read More
Optimized by Optimole