తెలంగాణ సంప్రదాయ బతుకమ్మ పండుగకు అరుదైన గౌరవం దక్కింది. ఎడారి దేశం దేశంలో తంగేడు వనం విరబూసింది. దుబాయ్ లోని బూర్జా ఖలిఫాపై బతుకమ్మ పండుగ వీడియోను ప్రదర్శించి తెలంగాణా గొప్పతనాన్ని చాటి చెప్పారు.
కాగా బతుకమ్మ వీడియోను బూర్జా ఖలిఫాపై రెండూ సార్లు ప్రదర్శించారు. ఈ వీడియోల్లో బతుకమ్మ విశిష్ఠత ,సంస్కృతిని అద్భుతంగా ఆవిష్కరించారు. అంతేకాదు సీఎం కేసిఆర్ ముఖ చిత్రాన్ని కూడా ప్రదర్శించారు.