విశాఖపట్నం: బేబి సినిమా తరహాలో రియల్ ట్రయాంగిల్ లవ్ స్టొరీ నడిపిన బాలిక కథ చివరకి విషాదాంతమయ్యింది. పట్టణంలో ఇంటర్ విద్యార్థిని (17) ఒకే సమయంలో సాయికుమార్ (23), సూర్య ప్రకాష్ (25) అనే ఇద్దరు యువకులతో ప్రేమాయణం నడిపింది. ఈ క్రమంలోనే ప్రియుడు సాయి కుమార్ తో రహస్యంగా తాలి కట్టించుకుంది. అనంతరం సూర్య ప్రకాష్ తో సైతం ప్రేమాయణం నడిపింది. ఈ సమయంలో బాలిక పెళ్లికి సంబంధించిన వీడియో , సూర్య ప్రకాష్ తో సన్నిహితంగా ఉన్న ఫోటోలు బయటకు వచ్చాయి.
దీంతో భర్త సాయికుమార్, ప్రియుడు సూర్యప్రకాష్ ఇద్దరూ ఆ బాలిక ఇంటికి వెళ్ళి మా ఇద్దరిలో ఎవరు కావాలో తేల్చుకో అంటూ నిలదీశారు.మనస్తాపానికి గురైన బాలిక ‘ సూర్యా వాళ్ళను ఎవరిని వదలకు.. కొడుకులు కుక్క చావు చావలి అంటూ లెటర్ రాసి అత్మహత్య చేసుకుంది.