Nancharaiah merugumala senior journalist:
కడప, కర్నూలు రెడ్డి ఫ్యాక్షన్ రాజకీయ కుటుంబాల అల్లుళ్లకు హైదరాబాద్ బౌన్సర్ల అవసరం ఎందుకొచ్చింది? ఏ టీవీ చానలూ చెప్పదేంటి?
వేలాది మంది కాదు, లక్షలాది మంది అభిమానులున్న సినీ నటులు మంచు మోహన్ బాబు, అతని ఇద్దరు కొడుకులు విష్ణువర్ధన్ బాబు, మనోజ్ కుమార్ మధ్య ఏదో కీచులాటుల కారణంగా వాళ్ల ఇళ్ల కాడ ఆత్మరక్షణ కోసం దాదాపు 100 మంది దాకా బౌన్సర్లను రప్పించారని తెలుగు టీవీ చానళ్లు పొద్దుటి నుంచీ ఒకటే గోల. మారణాయుధాలు దగ్గర ఉండని ఈ బౌన్సర్లు ఎవరో తెలియక ప్రేక్షకులు గందరగోళంలో పడుతున్నారు. రాయలసీమలో ఫ్యాక్షన్ నేపథ్యం ఉన్న జిల్లాల (కడప, కర్నూలు) రెడ్డి రాజకీయ కుటుంబాలకు అల్లుళ్లు అయ్యాక కూడా డీమ్డ్ టూ మీ యూనివర్సిటీ నడిపే మంచు భక్తవత్సల నాయుడు ఉరఫ్ మోహన్ బాబు కొడుకులు హింసాత్మక ఘటనలకు కేంద్ర బిందువులు కావడం తెలుగోళ్లకు అర్ధంకాని విషయంగా మారింది. అసలు హింసతో నడిచిన రాయలసీమ ఫ్యాక్టన్ రాజకీయ కుటుంబాల అమ్మాయిలను పెళ్లాడిన తర్వాత కూడా మోహన్‌బాబు కొడుకులు అద్దెకు తెచ్చుకున్న హైదరాబాద్ సిటీ బౌన్సర్లను రంగంలోకి ఎందుకు దింపుతున్నారో ఏ తెలుగు టీవీ న్యూజ్ చానలూ స్పష్టంగా వివరించడం లేదు.