డ్రగ్స్ కేసుపై సంచలన వ్యాఖ్యలు చేసిన దేవేంద్ర ఫడ్నవీస్..!

ముంబై క్రూయిజ్ డ్రగ్స్ పార్టీ కేసు.. రోజుకో ట్విస్టులు, పూటకో రాజకీయ రచ్చ కొనసాగుతోంది. ఎన్సీబీ అధికారి సమీర్ వాంఖడే టార్గెట్‌గా ట్వీట్లు, ఆరోపణలు గుప్పిస్తున్న మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్‌పై మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దీపావళి తర్వాత బాంబు పేల్చుతానని ముందే చెప్పిన ఫడ్నవీస్.. అనుకున్నట్టే మాలిక్‌కు దావూద్ గ్యాంగ్‌తో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని ఆరోపించారు. దావూద్ అనుచరుల నుంచి మాలిక్ చౌకగా ఆస్తులు కొన్నారని, ఆయనకు అండర్ వరల్డ్‌తో…

Read More

గవర్నర్ చేతులమీదుగా రుద్రమదేవి కాంస్యవిగ్రహావిష్కరణ !

చందుపట్లలో రాణిరుద్రమ కాంస్యవిగ్రహాన్ని ఆవిష్కరించిన గవర్నర్ తమిళి సై సౌందరరాజన్. తెలంగాణ గవర్నర్ తమిళి సై సౌందరరాజన్ నకిరేకల్ మండలం చందుపట్లలో పర్యటించారు. చందుపట్లలో ఉన్న రాణీరుద్రమ మరణశాసనానికి గవర్నర్ పూలమాలలు వేసి గౌరవ వందనం చేశారు. అనంతరం రుద్రమ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. మహరాణి రుద్రమదేవి మరణ శాసనం చందుపట్లలో ఉందని తెలిసినప్పటినుంచి వీరగాథలు తెలుసుకోవాలని కుతుహులంగా ఉన్నట్లు గవర్నర్ తమిళి సై స్పష్టం చేశారు. కాకతీయుల సామ్రాజ్యాన్ని యావత్ భారతావానికి చాటిచెప్పి..ఆకాలంలోనే స్రీజాతి ఔనత్యానికి…

Read More

ఐపీఎల్లో మరో రెండు కొత్త టీంలు_బీసీసీఐ

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ లో మరో రెండు కొత్త జట్లు వచ్చి చేరాయి. కొత్తగా లక్నో, ఆహ్మదాబాద్‌ ఫ్రాంచైజీలను బిసిసిఐ ప్రకటించింది. దీంతో ఐపీఎల్‌ లో జట్ల సంఖ్య పదికి చేరింది. లక్నో ఫ్రాంచైజీని సంజీవ్‌ గోయెంకా గ్రూప్‌ 7090 కోట్లకు దక్కించుకోగా… ఆహ్మదాబాద్‌ ఫ్రాంచైజీని సివిసి కంపెనీ 5600 కోట్లకు కొనుగోలు చేసింది. వచ్చే ఏడాది నుంచి ఐపీఎల్‌ లో పది జట్లు ఆడతాయని బిసిసిఐ తెలిపింది. ఆటగాళ్ల మెగా వేలం డిసెంబర్‌ లో నిర్వహించనున్నట్లు…

Read More

టి 20 ప్రపంచకప్ లో ఆస్ట్రేలియా బోణీ..

టీ20 ప్రపంచకప్లో ఆస్ట్రేలియా బోణీ కొట్టింది. సూపర్​-12 పోటీల్లో దక్షిణాఫ్రికాతో తొలి మ్యాచ్​ ఆడిన ఆస్ట్రేలియా రెండు పరుగుల తేడాతో గెలిచింది. దక్షిణాఫ్రికా బౌలర్లలో నోర్ట్జే 2 వికెట్లు తీయగా.. రబాడ, మహరాజ్, షంసీ చెరో వికెట్ దక్కించుకున్నారు. మొదట టాస్​ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా.. దక్షిణాఫ్రికాను 118 పరుగులకే కట్టడి చేసింది. అనంతరం బరిలోకి దిగిన ఆస్ట్రేలియా మరో 2 బంతులు మిగిలుండగానే లక్ష్యాన్ని ఛేదించింది. స్టీవ్​ స్మిత్ 35 పరుగులు చేసి జట్టు…

Read More

‘బలగం’ కు ఉన్న బలమేమిటీ?

Narsim Cartoonist :  అటు ప్రేక్షకులు, ఇటు మేధావుల మెప్పుతో పాటు కలెక్షన్లలో కూడా ‘జయహో’ అనిపించుకుంటున్న “బలగం” చూస్తుంటే తెలుగులో చిన్న సినిమాకు మంచి రోజులు వచ్చినట్టే అనిపిస్తుంది. సినిమాలు, సాహిత్యం మిగతా అన్ని రకాల కళలు విజయాలు సాధించాలన్నా, కలకాలం నిలిచి ఉండాలన్నా ముఖ్యంగా అవి ప్రజలతో కనెక్ట్ కావాలి. “బలగం”- అట్లా కనెక్ట్ అయిన సినిమా, ఒక ఎమోషనల్ కనెక్షన్. తెలంగాణా మాండలికంలో, అచ్చంగా తెలంగాణ సినిమానే అయినా ఒక్క తెలంగాణాకే కాక…

Read More

Poetry: ‘ నిశ్శబ్దం ‘..నెమ్మదిగా పాకుతోంది..!

Panyala jagannathdas:  నిశ్శబ్దం.. రాత్రి తెరలను దించిన చేయి కాంతిని నిశితంగా చూస్తూ పకాలుమని నవ్వుతోంది. సీసాలో ఉక్కిరిబిక్కిరి అవుతున్నదేమిటి? పరచుకున్న మబ్బు, కాసింత వెలుగు. చీకటి కనుగుడ్లను చీల్చుకుని దూసుకెళ్లిన బాణం ధవళ చిహ్నాలను విడిచిపెట్టింది. కిటికీకి ఆవల రాత్రి తెర మీద ఒక ఉల్క నెమ్మదిగా పాకుతోంది. — కజక్‌ మూలం: అర్దక్‌ నుర్గాజ్‌ స్వేచ్ఛానువాదం: పన్యాల జగన్నాథదాసు

Read More

వణికిస్తోన్న ఒమిక్రాన్..ఒక్కరోజే 16 కేసులు!

ప్రపంచాన్ని వణికిస్తోన్న ఒమిక్రాన్‌ వేరియంట్‌…. దేశంలో చాపకింద నీరులా విస్తరిస్తోంది. మంగళవారం ఒక్కరోజే భారత్‌లో అత్యధికంగా 16 కేసులు వెలుగు చూశాయి. ఢిల్లీలో నాలుగు, రాజస్థాన్‌లో నాలుగు చొప్పున ఒమిక్రాన్‌ కేసులు నమోదయ్యాయి. మహరాష్ట్రలో ఎనిమిది కేసులు నిర్ధారణ అయ్యాయి. ఇందులో 7 కేసులు ముంబైలో.. మరో కేసు వాసాయి విహార్‌ శివారులో నమోదైనట్లు వైద్యాధికారులు వెల్లడించారు. తాజా కేసులతో కలిపి మహరాష్ట్రలో కేసుల సంఖ్య 28కి చేరింది. దీంతో దేశంలో ఒమిక్రాన్‌ కేసుల సంఖ్య 57…

Read More
Optimized by Optimole