×

విశీ(వి.సాయివంశీ):  అవును! పెరియార్ పుట్టిన కర్మభూమిలోనే ఈ ఘటన జరిగింది. సుబ్రహ్మణ్య భారతి పాటలు రాసిన నేల మీదే ఈ కళంకం జరిగింది. రాష్ట్రాన్ని గొప్పగా ముందుకు తీసుకెళ్తున్నాం అని గొప్పలు చెప్పే కరుణానిధి కుటుంబం పాలిస్తున్న రాజ్యంలోనే ఈ అమానుషం జరిగింది.

కోయంబత్తూరులో 8వ తరగతి చదువుతోంది ఆ దళిత విద్యార్థిని. ఏప్రిల్‌ 5న తొలిసారి తనకు పీరియడ్స్ వచ్చాయి. ఇలా జరిగినప్పుడు తెలుగు రాష్ట్రాల్లో జరిగినట్టే తమిళనాడులో కూడా వేడుకలు చేస్తారు. దాన్ని రకరకాల పేర్లతో పిలుచుకుంటారు. కొన్ని రోజుల పాటు పిల్లను బయటకు పంపరు. అయితే బాలిక తల్లిదండ్రులు అవేమీ ఆలోచించకుండా తనను బడికి పంపారు. ఏప్రిల్ 7న, అంటే తొలి పీరియడ్స్ వచ్చిన రెండు రోజుల తర్వాత, ఆ బాలిక ఫైనల్ ఎగ్జామ్స్ రాద్దామని స్వామి చిన్మయానంద మెట్రిక్ హయ్యర్ సెకండరీ స్కూల్‌కి వెళ్లింది. అప్పటికే తన విషయం బడిలో టీచర్లకు తెలిసింది కాబట్టి, తనను లోపలికి రానివ్వకుండా బయటే ఉంచేశారు. మొట్టమొదటి పీరియడ్స్ కాబట్టి, ‘తీట్టు’(తెలుగులో ‘ముట్టు’) అని, లోపలికి వస్తే ఇబ్బంది అవుతుందని బయట మెట్ల మీద కూర్చోబెట్టి పరీక్ష రాయించారు.

పాపం! అమాయక పిల్ల. తనతోటి వారంతా లోపల పరీక్ష రాస్తుంటే తను మాత్రం బయట కూర్చోవడం ఎంత బాధ! పైగా పీరియడ్స్ ఉన్నాయని చెప్పి బయటకు పంపడం ఎంత అమానుషం! పరీక్ష కాగానే ఇంటికి వెళ్లి ఈ విషయం చెప్పింది. ఇలాంటి విషయాలను ఆధారసహితంగా నిరూపించాలని తల్లి అనుకుంది. తర్వాత రోజు పాపను బడికి వెళ్లి, వెనక తనూ వెళ్లింది. పరీక్ష మొదలైన కాసేపటికి తన ఫోన్ కెమెరాలో వీడియో ఆన్ చేసుకొని వెళ్లగా, కూతురు బయట కూర్చుని పరీక్ష రాస్తోంది. ఆ దృశ్యాన్ని రికార్డు చేసిన ఆమె విద్యాశాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై విచారణ జరుగుతోంది.

వీడియో సోషల్‌మీడియాలో రావడంతో అందరూ ఆ స్కూల్ యాజమాన్యం మీద విమర్శలు చేస్తున్నారు. చదువుకున్న టీచర్లు విద్యార్థినిపై ఇంత దారుణంగా ప్రవర్తిస్తారా అని మండిపడుతున్నారు. కానీ కొందరు మాత్రం ‘విద్యాలయాలు దేవాలయాల్లాంటివే, ముట్టులో ఉండి గుడికి వెళ్తారా? ఇది కూడా అంతే! పరీక్షకు వెళ్లకపోతే ఏమైంది? కావాలంటే మళ్లీ పరీక్షలు రాసుకునేది’ అంటున్నారు. లోకో భిన్న రుచి: కాదు, మూర్ఖో భిన్న రుచి:.

ఇక కామెంట్ బాక్సులో మొదలుపెడతారు చూడండి, రుతుస్రావం, స్త్రీ ప్రాధాన్యత, ఆ రోజుల్లో ఎందుకు ఇలాంటి కట్టుబాట్లు పెట్టారు, అవి ఎందుకు పాటించాలి అనే వాట్సప్ అంకుల్స్. వాళ్ల లుంగీలు వాళ్లు ఉతుక్కోవడం బద్దకమైన ప్రతి పురుషుడూ స్త్రీలు పాటించే కట్టుబాట్ల గురించి చెప్తుంటే భలే నవ్వొస్తుంది.

PS: ఈ వీడియోలో పాప రాస్తోంది సైన్స్ పరీక్ష. కానీ తన పరిస్థితి మాత్రం మత ధర్మానికి లోబడి ఉంది. అదీ వైచిత్రి.

Author

dhoni.raju219@gmail.com

Related Posts

crime: క్షణికానందం కోసం కుటుంబాల నాశనం!

Hyderabad: By Amaravaji Nagaraju ✍🏽 ఒకప్పుడు సమాజంలో పేరు సంపాదించాలంటే ప్రతిభ ఉండాలి… కష్టపడాలి… విలువలు పాటించాలి. ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. కొన్ని సెకన్ల వీడియోతో కోట్ల మందికి...

Read out all

crime: ఒక్క క్లిక్‌తో మొదలై… జీవితాన్ని కుదేలు చేసే మోసాలు..!!

Socialmedia: సోషల్ మీడియా ప్రపంచంలో కనిపించే విలాసవంతమైన జీవితం చాలామందిని ఆకర్షిస్తోంది. ఖరీదైన కార్లు, ఫైవ్ స్టార్ హోటళ్లు, విదేశీ పర్యటనలు, బ్రాండెడ్ గిఫ్ట్స్… ఇవన్నీ సులభంగా దక్కుతాయనే భ్రమలో...

Read out all

cinima: “నా జీవితం తెల్లకాగితం.. మచ్చ పడనివ్వను”: మురళీమోహన్

హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మశ్రీ పురస్కారం సందర్భంగా ప్రముఖ నటుడు, నిర్మాత మురళీమోహన్ను తెలుగు ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ ఘనంగా సన్మానించింది. ఫిలిం ఛాంబర్‌లో నిర్వహించిన ‘మీట్ ది...

Read out all

cinima: “కావ్య మారన్ – అనిరుధ్ పెళ్లి.. నిజమేనా?”

Kollywood: కోలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్.. సన్‌రైజర్స్ హైదరాబాద్ సీఈఓ కావ్య మారన్.. గత కొంతకాలంగా వీరిద్దరి పేర్లు ప్రేమ, పెళ్లి వార్తలతో సోషల్ మీడియాలో మారుమోగుతున్నాయి....

Read out all

cinima: తెలంగాణ నేటివిటీకి అద్దం పట్టే ‘ఇడుపు కాయితం’

Tollywood: లోకేష్ కనకరాజ్ చేతుల మీదుగా ఘనంగా ప్రారంభమైన సుకుమార్ రైటింగ్స్ – బన్నీ వాస్ వర్క్స్ చిత్రం.. తెలంగాణ కుటుంబాల భావోద్వేగాలు, ఆచార వ్యవహారాలు, బంధాల మధ్య దాగి...

Read out all

Cinima : రామ్ గోపాల్ వర్మ ‘రక్త చరిత్ర’ రీ రిలీజ్

Tollywood: మాఫియా, హారర్, సస్పెన్స్ చిత్రాలను తీయడంతో పాటు యథార్థ ఘటనల నేపథ్య చిత్రాలను తెరకెక్కించడంలో రామ్ గోపాల్ వర్మది ఓ ప్రత్యేక శైలి. ఒకప్పుడు రాయలసీమ ఫ్యాక్షనిజంలో బద్ద...

Read out all
Optimized by Optimole