అక్రమ కేసుల నుంచి న్యాయమే మమ్మల్ని కాపాడుతుంది: నారా లోకేష్
APpolitics : అక్రమ కేసులనుంచి న్యాయం, చట్టాలే తమను కాపాడతాయని యువనేత నారా లోకేష్ ధీమా వ్యక్తంచేశారు. చంద్రబాబునాయుడు అక్రమ అరెస్టుకు నిరసనగా డిల్లీలో లోకేష్ చేపట్టిన నిరాహారదీక్షను ఎంపి కనకమేడల రవీంద్రకుమార్ కుటుంబసభ్యులు నిమ్మరసం ఇచ్చి విరమింపజేశారు. అనంతరం లోకేష్ విలేకరులతో మాట్లాడుతూ… మహాత్మాగాంధీ, నెల్సన్ మండేలా నమ్మిన సిద్ధాంతం కోసం జైలుకెళ్లారు.. చంద్రబాబు గారు నిరుద్యోగులకు ఉపాధి కల్పించడం కోసం స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్టు తెచ్చినందుకే అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపారని…