Poetry: రెండు సమాధుల దూరంలో…!
Panyalajagannathdas: రెండు సమాధుల దూరంలో… రెండు సమాధుల దూరంలో దేవదూతల వీపులకు రెక్కలేవీ ఉండవు. వాళ్ల అలజడి నేలను అతలాకుతలం చేస్తుంది. మొత్తానికి ఏదోలా శాశ్వతంగా నిద్రిస్తున్న వారికి సూర్యోదయం చేరువవుతుంది. రెండు సమాధుల దూరంలో ఎవరూ పట్టించుకోని రెక్కల కుప్పలు- ఇప్పుడెవరికీ అవి ఏమాత్రం అక్కర్లేదు. గగనపు గరిక భస్మాన్నిపోగుచేస్తూ, మునివేళ్లతో నీట కలుపుతూ ఆరిపోతున్న గొంతుల్లో నేను దగ్ధమవుతున్నాను. రెండు సమాధుల దూరంలో ఆశల ధిలాసాతో గుండెల మీద చేతులేసుకున్న వాళ్లెవరూ లేరు. ఎవరి…