Peoplespulse: పరువు కోసం పార్టీల పాట్లు..!
Telangana politics: తెలంగాణలో లోక్‌సభ ఎన్నికలు మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావుకు ఎంత సవాలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి కూడా అంతే పెద్ద సవాల్! ఒకరికి నిలవటం సవాలైతే మరొకరికి గెలవటం సవాల్. మంచి సంఖ్యలో ఎంపీ సీట్లు గెలుచుకువచ్చే వరకు రేవంత్‌రెడ్డికి అన్నీ సానుకూలమే! తాను సూచించే వ్యక్తులకు టిక్కెట్లు లభిస్తాయి. తాను కోరినపుడు-కోరినచోటికి ఢిల్లీ నాయకులస్తారు, రాసిచ్చింది ప్రకటిస్తారు. ఎలా తలచుకుంటే అవి అలా జరిగిపోతుంటాయి. ఇక జరగాల్సిందల్లా మెజారిటీ ఎంపీ సీట్లు తెలంగాణ నుంచి ఆయన…