Appoliticalwar: ఏపీలో దాష్టీకాలకు ముగింపు ఎప్పుడు?
POLITICALWAR: అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్ నిత్యం నెత్తురు చిందే ఘటనలతో వార్తల్లో నిలుస్తోంది. వేధింపులు, కక్షలు, దాడులు, దాష్టీకాలతో ఉడికిపోతోంది. హత్యలకూ వెనుకాడడం లేదు. బీహార్, బెంగాల్ తరహా హింసాత్మక ఘటనలతో రాష్ట్రంలో అశాంతి నెలకొంటుంది. రక్తపు మడుగుల వార్తలు పత్రికల్లో పతాక శీర్షికలవుతున్నాయి. రాష్ట్రం అభివృద్ధిలో పయనించాలంటే శాంతిభద్రతలు కీలకమనే మౌలిక సూత్రాన్ని గత పాలకులు, ప్రస్తుత పాలకులు విస్మరిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి సర్కార్ పై అసంతృప్తితో ప్రజలు ఆయన ప్రభుత్వాన్ని మట్టికిరిపిస్తే వారి ఓటమి నుండి…
