యూపీ పై బీజేపీ ఫోకస్!
యూపీపై ఫుల్ ఫోకస్ పెట్టింది బీజేపీ సర్కార్. అసెంబ్లీ ఎన్నికలకు ఏడాది గడువు ఉండటంతో అనేక అభివృద్ది పనులను ప్రారంభిస్తోంది. ఈ నేపథ్యంలోనే ప్రధాని మోదీ.. షాజహాన్‌పూర్‌లో గంగా ఎక్స్‌ప్రెస్‌వేకు శంకుస్థాపన చేశారు. గంగా ఎక్స్‌ప్రెస్‌వే ద్వారా యువతకు ఉపాధి సహా ఎన్నో కొత్త అవకాశాలు కలుగుతాయని ప్రధాని పేర్కొన్నారు. త్వరలోనే అత్యాధునిక మౌలిక వసతులు కలిగిన రాష్ట్రంగా ఉత్తర్‌ప్రదేశ్ నిలుస్తుందన్నారు. అటు యోగీ ఆదిత్యనాథ్ ఆదిత్యనాథ్‌పై ప్రశంసలు కురిపించారు ప్రధాని మోదీ. యూపీ ప్లస్ యోగి…