దొంగ నోట్ల పంపిణీ వ్యవహారంపై ఎన్ఐఏ చేత విచారణ జరిపించాలి: ఎంపీ రఘురామ
పింఛన్ లబ్ధిదారులకు దొంగ నోట్ల పంపిణీ వ్యవహారంపై కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ చేత విచారణ జరిపించాలని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజు డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంతో ప్రభుత్వ పెద్దలకు నిజంగానే సంబంధం లేకపోతే ముఖ్యమంత్రి రవ్వంత చొరవ తీసుకొని ఎన్ఐఏ విచారణ కోసం లేఖ రాయాలని కోరారు. అవసరమైతే తాను సైతం లేఖ రాస్తానని స్పష్టం చేశారు.ఈ వ్యవహారంలో అడ్డంగా దొరికిపోయిన తర్వాత మసిపూసి మారేడు కాయ చేసే ప్రయత్నం జరుగుతోందని రఘురామ విమర్శించారు….
