యూపీ పై బీజేపీ ఫోకస్!

యూపీపై ఫుల్‌ ఫోకస్‌ పెట్టింది బీజేపీ సర్కార్‌. అసెంబ్లీ ఎన్నికలకు ఏడాది గడువు ఉండటంతో అనేక అభివృద్ది పనులను ప్రారంభిస్తోంది. ఈ నేపథ్యంలోనే ప్రధాని మోదీ.. షాజహాన్‌పూర్‌లో గంగా ఎక్స్‌ప్రెస్‌వేకు శంకుస్థాపన చేశారు. గంగా ఎక్స్​ప్రెస్​వే ద్వారా యువతకు ఉపాధి సహా ఎన్నో కొత్త అవకాశాలు కలుగుతాయని ప్రధాని పేర్కొన్నారు. త్వరలోనే అత్యాధునిక మౌలిక వసతులు కలిగిన రాష్ట్రంగా ఉత్తర్​ప్రదేశ్​ నిలుస్తుందన్నారు. అటు యోగీ ఆదిత్యనాథ్‌ ఆదిత్యనాథ్‌పై ప్రశంసలు కురిపించారు ప్రధాని మోదీ. యూపీ ప్లస్ యోగి…

Read More

పంజాబ్ లో బీజేపీ పొత్తు ఖరారు!

పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికల వేళ కీలక పరిణామం చోటు చేసుకుంది. ఎన్నికలకు ఏడాది సమయం ఉన్నప్పటికి.. పార్టీలు ఇప్పటినుంచే వ్యూహాలకు పదునుపెడుతున్నాయి. మాజీ ముఖ్యమంత్రి అమరీందర్‌ సింగ్‌ నేతృత్వంలోని పంజాబ్ లోక్ కాంగ్రెస్​ పార్టీతో బీజేపీతో పొత్తు కుదుర్చుకుంది. అమరీందర్ సింగ్​తో భేటీ అనంతరం.. కేంద్ర మంత్రి, పంజాబ్ బీజేపీ ఇన్​ఛార్జ్​ గజేంద్ర సింగ్ షెకావత్ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. ఇక ప్రతి స్థానాన్ని పరిశీలించి, పరిస్థితులనుబట్టి ఏ పార్టీ ఎన్ని స్థానాల్లో పోటీ చేయాలో…

Read More

కొత్త త్రిదళాధిపతిగా ఎంఎం నరవణెకే..?

కొత్త త్రిదళాధిపతిని ఎంపిక ప్రక్రియను వేగవంతం చేసింది కేంద్రం. త్రివిధ దళాల సిఫారసు మేరకు అర్హుల జాబితాను త్వరలోనే రక్షణమంత్రి రాజ్​నాథ్ సింగ్​కు అధికారులు అందజేయనున్నారు. హెలికాప్టర్​ ప్రమాదంలో మరణించిన సీడీఎస్​ జనరల్ బిపిన్​ రావత్ వారసుడ్ని ఎంపిక చేసేందుకు ఆర్మీ, నేవీ, వాయుసేన సీనియర్ అధికారులతో కూడిన ప్యానెల్​ను కేంద్ర ప్రభుత్వం త్వరలోనే ఖరారు చేయనుంది. మరోవైపు కొత్త సీడీఎస్​గా ఎంపికయ్యే అవకాశాలు సైన్యాధిపతి జరనల్ ఎంఎం నరవణెకే అధికంగా ఉన్నట్లు తెలుస్తోంది. అనుభవంలో అందరికన్నా…

Read More

కోహ్లీ_గంగూలీ వివాదంపై స్పందించిన మాజీ ఓపెనర్!

టీమిండియా టెస్టు సారథి విరాట్ కోహ్లీ- బీసీసీఐ చీఫ్ సౌరవ్ గంగూలీ వివాదంపై బిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. టీ20 కెప్టెన్సీ విషయంలో తననెవరూ సంపద్రించలేదని విరాట్ చెప్పగా… సారథ్య బాధ్యతల నుంచి వైదొలగొద్దని తాను కోహ్లీకి వ్యక్తిగతంగా చెప్పినట్టు నాలుగైదు రోజుల క్రితం గంగూలీ వ్యాఖ్యానించాడు. ఈ నేపథ్యంలో పలువురు మాజీ క్రికెటర్లు ఈ వివాదంపై స్పందిస్తున్నారు. తాజాగా.. భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా మాట్లాడుతూ.. ఈ వివాదంలో అసలు నష్టపోయింది భారత క్రికెట్ అని ఆవేదన…

Read More

దేశంలో ఒమిక్రాన్ టెన్షన్.. సెంచరీ దాటిన కేసులు!

భారత్‌లో కొత్త వేరియంట్ ఒమిక్రాన్ సెంచరీ కొట్టింది. డెల్టా వేరియంట్ కంటే వేగంగా వ్యాపిస్తూ కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. దేశంలో 11 రాష్ట్రాలకు పాకిన ఒమిక్రాన్ కేసులు 101కి చేరింది. అత్యధికంగా మహారాష్ట్రలో 32, దేశ రాజధాని ఢిల్లీలో 22 కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. ఇక 11 రాష్ట్రాలకు పాకిన ఒమిక్రాన్ వైరస్ కేసులు.. 101కి పెరగడం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా ఒక్కరోజే కర్నాటకలో 5, తెలంగాణలో 4 కొత్త కేసులు…

Read More

దేశంలో గుబులు పుట్టిస్తోన్న ఒమిక్రాన్ వేరీయంట్!

భారత్‌నూ ఒమిక్రాన్ వేరియంట్‌ వణికిస్తోంది. పలు రాష్ట్రాల్లో ఒమిక్రాన్ కేసులు వేగంగా పెరుగుతుండగా.. దేశంలో ఒమిక్రాన్‌ కేసుల సంఖ్య 69కి చేరింది. అంతకంతకు పెరుగుతున్న కేసుల సంఖ్య గుబులురేపుతోంది. ఒమిక్రాన్ వ్యాప్తిపై అలర్ట్‌ అయిన కేంద్రం…విదేశీ ప్రయాణికులపై నిఘాపెట్టింది. ఆరు ఎయిర్‌పోర్టులో విదేశాల నుంచి వచ్చేవారికి RT-PCR టెస్టులను ముమ్మరం చేసింది. అటు తెలంగాణలోకి ఒమిక్రాన్ ఎంట్రీతో ప్రభుత్వం అప్రమత్తమైంది. రెండు ఒమిక్రాన్ కేసులు వెలుగుచూసిన హైదరాబాద్​టోలిచౌకిలో వైద్యఆరోగ్య శాఖ హైఅలర్ట్ ప్రకటించింది.టోలిచౌకిలోని పారామౌంట్‌ కాలనీ టెస్టులను…

Read More

అమ్మాయిల పెళ్లి విషయంలో కేంద్రం కీలక నిర్ణయం!

అమ్మాయిల కనీస వివాహ వయసుపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. అమ్మాయిలకు 18ఏళ్లు నిండితేనే పెళ్లి చేయాలన్న చట్టం ప్రస్తుతం ఉండగా.. దానిని 21ఏళ్లకు పెంచాలన్న ప్రతిపాదనకు కేంద్ర కేబినెట్​ ఆమోదం తెలిపింది. వివాహ వయసు విషయంలో అబ్బాయిలు, అమ్మాయిల మధ్య తేడా తొలగించాలన్న అభ్యర్థనల మేరకు ఈ నిర్ణయానికి వచ్చింది. ప్రస్తుతం దేశంలో కనీస వివాహ వయసు అబ్బాయిలకు21ఏళ్లు, అమ్మాయిలకు 18ఏళ్లుగా ఉంది. దీనిపై గత కొంతకాలంగా దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. అబ్బాయిలు, అమ్మాయిల మధ్య…

Read More

వణికిస్తోన్న ఒమిక్రాన్..ఒక్కరోజే 16 కేసులు!

ప్రపంచాన్ని వణికిస్తోన్న ఒమిక్రాన్‌ వేరియంట్‌…. దేశంలో చాపకింద నీరులా విస్తరిస్తోంది. మంగళవారం ఒక్కరోజే భారత్‌లో అత్యధికంగా 16 కేసులు వెలుగు చూశాయి. ఢిల్లీలో నాలుగు, రాజస్థాన్‌లో నాలుగు చొప్పున ఒమిక్రాన్‌ కేసులు నమోదయ్యాయి. మహరాష్ట్రలో ఎనిమిది కేసులు నిర్ధారణ అయ్యాయి. ఇందులో 7 కేసులు ముంబైలో.. మరో కేసు వాసాయి విహార్‌ శివారులో నమోదైనట్లు వైద్యాధికారులు వెల్లడించారు. తాజా కేసులతో కలిపి మహరాష్ట్రలో కేసుల సంఖ్య 28కి చేరింది. దీంతో దేశంలో ఒమిక్రాన్‌ కేసుల సంఖ్య 57…

Read More

మహారాష్ట్రలో బయటపడిన శివలింగం..!

మహారాష్ట్రలోని నాందేడ్ లో వెలుగులోకి వచ్చిన శివలింగం. స్థానిక రైతు తమ పొలంలో త్రవ్వకాలు జరుపుతుంటే పురాతన కాలం నాటి శివమందిరం బయటపడింది.దీంతో స్ధానికులు దేవాదాయ శాఖ అధికారులకు సమచారం ఇచ్చారు. శివలింగానికి సంబంధించి మరిన్ని వివరాలకు త్వరలో తెలియజేస్తామని అధికారాలు వెల్లడించారు.

Read More

తమిళనాడులో కుప్పకూలిన ఆర్మీ విమానం!

తమిళనాడులో ఆర్మీ హెలికాప్టర్ కుప్పకూలింది. ఊటి దగ్గర చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌ బిపిన్‌ రావత్‌ ప్రయాణిస్తున్న హెలకాప్టర్ ఉన్నట్టుండి కుప్పకూలింది. ఇందులో మొత్తం 14 మంది ఆర్మీ అధికారులు ఉన్నట్టు తెలుస్తోంది. హెలికాప్టర్‌ కూలిన తరువాత మంటలు చెలరేగాయి. తీవ్ర గాయాల పాలైన ముగ్గురు అధికారులను ఆస్పత్రికి తరలించారు. మరోవైపు హెలికాప్టర్ ప్రమాదాన్ని ఎయిర్ ఫోర్స్ అధికారికంగా ధృవీకరించింది. ప్రమాదం జరిగిన సమయంలో రావత్ హెలికాప్టర్ లో ఉన్నట్లు తెలిపింది. ప్రమాదం జరగడానికి గల కారణంపై…

Read More
Optimized by Optimole