తెలంగాణాలో కమలం జోరు!

తెలంగాణలో దుబ్బాక, హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో గెలుపుతో బీజేపీ జోరుమీదుంది. పార్టీ శ్రేణుల్లోనూ ఉత్సాహం కనిపిస్తోంది. విజయపరంపరను ఇలాగే కంటిన్యూ చేస్తే వచ్చే ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌తో ఢీకొట్టొచ్చని బీజేపీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే ఇప్పటిదాకా కేసీఆర్ అనుసరించిన వ్యూహాన్నే తామూ అనుసరించాలని బీజేపీ పెద్దలు డిసైడ్‌ అయినట్లు కనిపిస్తోంది. వచ్చే ఎన్నికల్లోనూ ఇదే స్ట్రాటజీ అమలు చేసి.. అధికారంలోకి రావాలని గట్టిగా ప్రయత్నిస్తోంది. కాగా బలమైన అభ్యర్థులు ఉంటే టిఆర్ఎస్‌ను ఓడించడం తేలికని దుబ్బాక, హుజురాబాద్ ఉప…

Read More

కేసిఆర్ కేంద్ర ప్రభుత్వాన్ని బద్నాం చేస్తున్నారు: కేంద్ర మంత్రి షేకావత్

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో నెల‌కొన్ని జల వివాదంపై స్పందించారు కేంద్ర మంత్రి గ‌జేంద్ర సింగ్ షెకావ‌త్‌. తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణ‌యాల కారణంగానే ట్రిబ్యున‌ల్ ఏర్పాటులో జాప్యం జ‌రుగుతోంద‌న్నారు. సీఎం కేసిఆర్ ప్రెస్ మీట్ పెట్టీ అవాస్తవాలు మాట్లాడారాన్నరు. 2015లో కొత్త ట్రిబ్యునల్ ఎర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిందన్నారు.కావాల‌నే కేంద్రాన్ని కేసీఆర్ బ‌ద్నాం చేస్తున్నారని ఆయన మండి పడ్డారు. ఇరు రాష్ట్రాల అంగీకారం త‌ర్వాతే ట్రిబ్యున‌ల్ ఏర్పాటు జ‌రుగుతుందన్నారు. అపెక్స్ కౌన్సిల్ సమావేశం…

Read More

ఫైనల్లో ఆస్ట్రేలియా.. కంగుతిన్న పాక్..!!

టీ20 ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా ఫైనల్ కి దూసుకెళ్లింది. గురువారం పాకిస్థాన్ తో జరిగిన ఉత్కంఠ పోరులో ఆసీస్ 177 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించి పాకిస్థాన్‌ జైత్రయాత్రకు బ్రేక్‌ వేసింది. ఆసీస్ బ్యాట్స్ మెన్స్ లో డేవిడ్ వార్నర్ (49), మార్కస్ స్టాయినిస్‌ (40) రాణించారు. చివర్లో మాథ్యూ వేడ్‌ (41) ధనాదన్ ఇన్నింగ్స్‌తో అదరగొట్టాడు. పాక్ బౌలర్లలో షాదాబ్‌ ఖాన్‌ నాలుగు, షాహీన్ ఆఫ్రిది ఒక వికెట్ తీశాడు. అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ ఆరంభించిన…

Read More

చమురు ధరలను జీఎస్టి పరిధిలోకి తెస్తే ధరలు తగ్గుతాయి: గడ్కరీ

పెట్రోల్ డీజిల్ ధరలను జీఎస్‌టి పరిధిలోకి తీసుకొస్తే, వాటిపై పన్నులు మరింత తగ్గుతాయన్నారు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ. రాష్ట్ర ప్రభుత్వాలు సహకరిస్తే ఇంధన ధరలను జీఎస్‌టీ పరిధిలోకి తీసుకొచ్చేందుకు కచ్చితంగా ప్రయత్నిస్తామని ఆయన స్పష్టం చేశారు. ఓ జాతీయ మీడియా ఛానల్ నిర్వహించిన వర్చువల్ సదస్సులో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. జీఎస్‌టీ కౌన్సిల్‌లో రాష్ట్రాల ఆర్థిక మంత్రులు కూడా సభ్యులని నితిన్ గడ్కరీ చెప్పారు. పెట్రోలు, డీజిల్‌లను జీఎస్‌టీ పరిధిలోకి తీసుకొచ్చేందుకు కొన్ని రాష్ట్రాలు వ్యతిరేకిస్తున్నాయన్నారు….

Read More

భారీ వర్షాలతో తమిళనాడు అతలాకుతలం!

ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో తమిళనాడులో ఎడతెరిపిలేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ఆగకుండా కురుస్తున్న వర్షంతో చెన్నై నగరం జలమయమైంది. చెన్నై, పుదుచ్చేరి నగరాలతో పాటు తిరువల్లూర్, రాణిపేట్, వెల్లూర్, తిరుపత్తూర్, తిరువనమలై, కల్లకురిచి, సాలెంలో వరద బీభత్సం కొనసాగుతోంది. విల్లుపురం, కుడలోర్, క్రిష్ణగిరి, ధర్మపురి, నమక్కల్, పెరంబలూర్, అరియలూర్ లోనూ జనం అవస్థలు పడుతున్నారు. వరదనీటికి తోడు మురుగునీరు ఇళ్లల్లోకి చేరి జనం నరకం చూస్తున్నారు. లోతట్టు ప్రాంతాల్లోని హాస్పిటళ్లు, ఆఫీసులు జలమయమయ్యాయి. రోడ్లపై 2 నుంచి 3…

Read More

దేశంలో స్వల్పంగా కరోనా కేసులు నమోదు!

దేశంలో కోవిడ్ కేసులు స్వల్పంగా నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 13 వేల 091​ మందికి పాజిటివ్​గా తేలింది. వైరస్ కారణంగా 340 మందిమృతి చెందారు. ప్రస్తుతం దేశంలో లక్ష 38 వేల 556 యాక్టివ్ కేసులు ఉన్నట్లు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. మరోవైపు దేశంలో కొవిడ్​ టీకా పంపిణీ జోరుగా కొనసాగుతోంది. బుధవారం ఒక్కరోజే 57,54,817 డోసుల వేసినట్లు వైద్య అధికారులు తెలిపారు. ఫలితంగా మొత్తం టీకా డోసుల పంపిణీ 1,10,23,34,225కి చేరింది….

Read More

‘ఆర్‌ఆర్‌ఆర్‌’.. మాస్‌ ఆంథమ్‌ ‘నాటు నాటు’ విడుదల!

దర్శకధీరుడు రాజమౌళి తెరెక్కిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం‘ఆర్‌ఆర్‌ఆర్‌’. రామ్ చరణ్‌ , ఎన్టీఆర్ హీరోలుగా నటిస్తున్న ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తున్నారు.తాజాగా ఈ చిత్రానికి సంబంధించి మాస్‌ ఆంథమ్‌ ‘నాటు నాటు’ వచ్చేసింది. పాన్‌ ఇండియాగా రాబోతున్న ‘ఆర్‌ఆర్‌ఆర్‌’.. 2022 సంక్రాంతి కానుకగా జనవరి 7 న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ప్రచారాన్ని వేగవంతం చేసింది. సినిమాలోని రెండో పాటైన ‘నాటు నాటు’ లిరికల్ నూ చిత్ర బృందం విడుదల చేసింది. ‘నా పాట…

Read More

తెలంగాణ గడ్డపై కాషాయ జెండా ఎగరడం ఖాయం: ఈటల

హుజూరాబాద్ శాసన సభ్యుడిగా ఈటెల రాజేందర్ బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన చేత స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రమాణం చేయించారు. అనంతరం ఈటెల మీడియాతో మాట్లాడారు. హుజరాబాద్ ప్రజా తీర్పుతో కేసీఆర్‌కు దిమ్మ దిరిగిపోయిందని అన్నారు. ఈ తీర్పు ఆరంభం మాత్రమేనని… త్వరలో తెలంగాణవ్యాప్తంగా ఇదే తరహా ఫలితాలు పునరావృతమవుతాయని స్పష్టం చేశారు. ఉద్యమకారులు, ప్రజాస్వామ్యాన్ని కాంక్షించేవారు టిఆర్ఎస్ పార్టీని వీడాలని కోరారు. టిఆర్ఎస్ ప్రభుత్వం మీద యుద్ధం చేయడానికి సిద్ధమవుతున్నానని ఈటెల పేర్కొన్నారు….

Read More

తెలంగాణలో రేపు, ఎల్లుండి భారీ వర్షాలు కురిసే అవకాశం : వాతావరణ శాఖ

బంగాళాఖాతంలో మంగళవారం ఏర్పడిన అల్పపీడనం రాగల 12 గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో తెలంగాణలో రేపు ఎల్లుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ అధికారులు హెచ్చరించారు.నిన్న ఏర్పడిన అల్పపీడనం ఉదయం తీవ్ర అల్పపీడనంగా బలపడి మధ్య ఆగ్నేయ బంగాళాఖాతంలో కొనసాగుతోందన్నారు. రాష్ట్రంలోకి ఈశాన్య దిశ నుంచి కిందిస్థాయి గాలులు వీస్తున్నాయని తెలిపారు. సముద్ర మట్టం నుంచి 5.8 కి.మీ. ఎత్తున ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని పేర్కొన్నారు.

Read More

యూపీ లో జికా వైరస్ కలకలం..!

యూపీ కాన్పుర్​లో జికా వైరస్ ​వ్యాప్తి సృష్టిస్తోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 16 మందికి వైరస్ సోకినట్లు తేలింది. దీంతో మొత్తం బాధితుల సంఖ్య 105కి చేరినట్లు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఈ నేపథ్యంలో పరిస్థితిని సమీక్షించేందుకు సీఎం యోగి ఆదిత్యనాథ్ కాన్పూర్‌లో బుధవారం పర్యటించనున్నారు. వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులతో చర్చించనున్నారు.

Read More
Optimized by Optimole