‘బెంగుళూరు’ విక్టరీ!
ఐపీఎల్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా బెంగుళూరు రాయల్ ఛాలెంజర్స్ వరుస విజయాలతో దూసుకుపోతుంది. వరుసగా నాలుగు మ్యాచ్లో గెలిచి పాయింట్లు పట్టి కలో అగ్రస్థానంలో నిలిచింది. గురువారం వాఖండే వేదికగా జరిగిన మ్యాచ్లో బెంగుళూరు, రాజస్థాన్ రాయల్స్ని 10 వికెట్ల తేడాతో ఓడించింది. తొలుత టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన రాజస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 177 పరుగులు చేసింది. టాప్ ఆర్డర్ విఫలమైనా, మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ జట్టును ఆదుకున్నారు….