పెగాసస్ పై విచారణకు ప్రత్యేక కమిటీ_ సుప్రీం

దేశంలో పెగాసస్‌ నిఘా వ్యవహారంపై స్వతంత్ర దర్యాప్తుకు ఆదేశాలివ్వాలని కోరుతూ దాఖలైన పలు వ్యాజ్యాలపై సుప్రీంకోర్టు ఇవాళ తీర్పు ఇచ్చింది. పెగాసస్‌ వ్యవహారంపై నిపుణుల కమిటీని ఏర్పాటు చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది. సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి నేతృత్వంలో నిపుణుల కమిటీని నియమిస్తున్న‌ట్లు తెలిపింది.చట్టబద్ధ పాలన సాగాలన్నదే తమ అభిమతం అని ఈ సంద‌ర్భంగా సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ప్రాథమిక హక్కుల ఉల్లంఘన స‌రికాద‌ని, ఈ విష‌యాన్ని కోర్టు సహించదని స్ప‌ష్టం చేసింది. ఈ కేసులో కొందరు పిటిషనర్లు పెగాసస్‌ ప్రత్యక్ష…

Read More

హుజరాబాద్లో మేనిఫెస్టో విడుదల చేసిన బీజేపీ..

హుజూరాబాద్ ఎన్నిక‌ల ప్ర‌చారం మ‌రో కొన్ని గంట‌ల్లో ముగియ‌నుండ‌గా ప్ర‌ధాన పార్టీల‌న్నీ ఓట‌ర్ల‌ని ఆక‌ర్షించే ప‌నిలో చివ‌రి ఘ‌ట్టానికి చేరుకున్నాయి. అందులో భాగంగా బిజేపి మ్యానిఫెస్టో విడుద‌ల చేసింది. కాగా స‌బ్ కా సాథ్, స‌బ్ కా వికాస్‌… స‌బ్ కా విశ్వాస్‌, స‌బ్ కా ప్ర‌యాస్‌… అనే ప్ర‌ధాని మోడీ నినాదం స్ఫూర్తితో హుజూరాబాద్‌లో అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌ల సంక్షేమానికీ, అభివృద్ధికీ కృషి చేస్తామ‌ని రాష్ట్ర బిజెపి మ్యానిఫెస్టోను విడుద‌ల చేసింది. ఇందులో పొందు ప‌రిచిన…

Read More

దేశంలో స్వల్పంగా తగ్గిన పసిడి ధరలు..

దేశంలో బంగారం ధ‌రలు ప‌లుచోట్ల పెరిగిన‌ప్ప‌టికీ హైద‌రాబాద్‌లో స్వ‌ల్పంగా తగ్గాయి. మొత్తంగా చూసుకుంటే గ‌త నాలుగు రోజులుగా దేశంలో బంగారం రేటు పెరిగింద‌నే చెప్పాలి. ఇక బుధవారం బంగారం ధ‌ర‌ల‌ను గ‌మ‌నిస్తే, 22 క్యార‌ట్‌ బంగారం ధ‌ర పది గ్రాములకు 47 వేల 270 రూపాయ‌లుగా ఉంది. 24 క్యార‌ట్ బంగారం ప‌ది గ్రాములు 48 వేల 270. ఇక దేశ‌వ్యాప్తంగా ప‌లు న‌గ‌రాల్లో బంగారం ధ‌ర‌లు గ‌మ‌నిస్తే, చెన్నైలో 22 క్యారెట్ 45 వేల 380…

Read More

దేశంలో స్వల్పంగా పెరిగిన ఇంధన ధరలు..

దేశంలో పెట్రోల్, డీజిల్ ధ‌ర‌ల పెంపు కొనసాగుతూనే ఉన్నాయి. బుధవారం ఇంధ‌నం ధరలు స్వల్పంగా పెరిగాయి. తాజా పెట్రోల్ ధ‌ర‌ల్ని ప‌రిశీలిస్తే, రాజ‌థాని ఢిల్లీలో పెట్రోల్ 107 రూపాయ‌ల 94 పైస‌లుగా ఉంటే, డీజిల్ 96 రూపాయ‌ల 67 పైస‌లుంది. హైద‌రాబాద్‌లో పెట్రోల్ 111 రూపాయ‌ల 91 పైస‌లు, డీజిల్ ధ‌ర 105 రూపాయ‌ల 08 పైస‌లుగా ఉన్నాయి. ఇక వరంగ‌ల్‌లో పెట్రోల్ 15 పైస‌లు పెరిగి, 111 రూపాయ‌ల 45 పైస‌ల‌కు చేరుకుంది. అలాగే డీజిల్…

Read More

ఎన్నికల హామీలు విస్మరించిన కేసిఆర్ గద్దె దిగాలి: షర్మిల

ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలుచేయకుండా మాట తప్పిన సీఎం కేసీఆర్ వెంటనే గద్దె దిగాలని వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్షర్మిల డిమాండ్చేశారు. ఇంటికో ఉద్యోగం ఇస్తానని నిరుద్యోగులను, డబుల్ బెడ్రూం ఇళ్లు నిర్మించి ఇస్తామని పేదలను కేసీఆర్ మోసం చేశారని విమర్శించారు. కాగా 3ఎకరాల భూమి ఇస్తామని దళితులను, కేజీ టు పీజీ ఉచిత విద్య అందిస్తానని విద్యార్థులను, 12 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని మైనార్టీలను సీఎం మోసం చేశారని అన్నారు. ప్రజా ప్రస్థానం పాదయాత్రలో భాగంగా…

Read More

కేసీఆర్ వాఖ్యలు హాస్యాస్పదం_ కిషన్ రెడ్డి

ఎన్నికల ప్రచారంలో విమర్శలు.. ప్రతి విమర్శలు ఉండొచ్చు.. అవి చాలా సహజం.. కానీ వాటిని అధికార టీఆర్ఎస్ పార్టీ దిగజార్చేలా చేసిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. ఇక ఎలక్షన్ కమిషన్ పై కేసీఆర్ వాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయన్నారు కిషన్ రెడ్డి. ఎన్నికల ప్రచారంలో కేసీఆర్ కుటుంబ సభ్యులు, మంత్రులు, ఎమ్మెల్యే లు.. ఎవరి ప్రచారాలను కూడా అడ్డుకోవడం లేదన్నారు. నిబంధనలు అందరికీ సమానమే అన్నారు. ఎన్ని ప్రలోభాలకు గురిచేయాలని ప్రయత్నించినా హుజురాబాద్ ప్రజల డిసైడ్…

Read More

తెలుగు రాష్ట్రాల్లో స్వల్పంగా కరోనా కేసులు నమోదు…

తెలంగాణలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. కొత్తగా 41వేల 388 కరోనా పరీక్షలు నిర్వహించగా 190 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. జీహెచ్ఎంసీ పరిధిలో అత్యధికంగా 68 మందికి పాజిటివ్ కేసులు నిర్దారణ అయ్యాయని వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇక మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 14, రంగారెడ్డి జిల్లాలో 13 కేసులు వెల్లడయ్యాయి. అదే సమయంలో 111 మంది కరోనా నుంచి కోలుకోగా, ఒకరు మరణించారు. అటు ఏపీలో కొత్తగా 415 కరోనా కేసులు నమోదయ్యాయి. 24 గంటల్లో…

Read More

ఎన్టీఆర్, చరణ్ అభిమానులకు గుడ్ న్యూస్..!

దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘ఆర్ఆర్ఆర్’ . ఎన్టీఆర్ – చరణ్ ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సినిమా, అందరిలో ఆసక్తిని పెంచుతోంది. డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాకు, కీరవాణి సంగీతాన్ని అందించారు. జనవరి 7వ తేదీన ప్రపంచవ్యాప్తంగా సినిమాను విడుదల చేయనున్నారు. ఇప్పటికే విడుదలైన హీరోల లుక్స్ మూవీపై అంచనాలను పెంచేసింది. తాజాగా ఈ సినిమాకి సంబంధించి ఓవిషయం బయటికొచ్చింది. మూవీ టీజర్ ను అన్ని భాషల్లోనూ ఒకే రోజున ఒకే…

Read More

త్వరలో చిన్న పిల్లలకు కోవిడ్ టీకా: అపోలో ఛైర్మెన్ ప్రతాప్ రెడ్డి

కరోనా టీకా విషయంలో అపోల్ గ్రూప్ చైర్మన్ కీలక విషయాన్ని వెల్లడించారు. త్వరలోనే చిన్నారులకు కూడా టీకాలు వేయనున్నట్టు ఆయన తెలిపారు. అయితే, తొలి ప్రాధాన్యం మాత్రం కోమార్బిడిటీస్ తో బాధపడుతున్న వారికేనని తెలిపారు. వీరికి ఉచితంగా టీకాలు వేస్తామని పేర్కొన్న ఆయన.. ఇందుకు సంబంధించి ప్రభుత్వం నుంచి అనుమతి రావాల్సి ఉందన్నారు. 2 నుంచి 18 ఏళ్ల లోపు వారికి కొవాగ్జిన్ టీకా ఇప్పటికే సిద్ధమైందని, ఈ టీకాను రెండు డోసుల్లో 28 రోజుల వ్యవధిలో…

Read More

ఎస్సీ, ఎస్టీ అత్యాచారాల విషయంలో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..

ఎస్సీ, ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం కింద దోషిగా గుర్తించిన వ్యక్తిపై క్రిమినల్‌ ప్రొసీడింగ్స్‌ను కొట్టివేస్తూ సుప్రీం ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. ఏదైనా కేసు ఎస్సీ, ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం కింద నమోదైనప్పటికీ.. ఆ కేసుకు ప్రైవేటు/సివిల్‌ స్వభావం ఉంటే, బాధితుల కులం ఆధారంగా చేయని నేరమైతే.. దానిపై చేపట్టిన క్రిమినల్‌ ప్రొసీడింగ్స్‌ను కొట్టివేయొచ్చని సుప్రీంకోర్టు పేర్కొంది. కాగా కులం కారణంగా ఇబ్బందులు ఎదుర్కొనే బాధితులకు ఉపశమనం, పునరావాసం కల్పించేందుకు.. వారికి రెండింతల రక్షణనందించేందుకు…

Read More
Optimized by Optimole