మధ్యప్రదేశ్ లో కొత్త వేరియంట్ కలకలం…

మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో క‌రోనా కొత్త వేరియంట్ క‌ల‌క‌లం సృష్టిస్తోంది. ఇండోర్‌కు చెందిన ఆరుగురు వ్య‌క్తులు దీని బారిన ప‌డ్డార‌ని న‌మూనా ప‌రీక్ష‌లు వెల్ల‌డించాయి. ఎవై.4 గా చెబుత‌న్న క‌రోనా వైర‌స్‌లోని కొత్త వేరియంట్ మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో ప‌లువురికి సోకిన విష‌యాన్ని దేశ రాజ‌ధాని ఢిల్లీలోని జాతీయ వ్యాధి నివార‌ణా కేంద్రం నిర్థారించింది. అయితే, ఈ కొత్త వేరియంట్ బారిన‌ప‌డ్డ‌వారంతా వ్యాక్సినేష‌న్ తీసుకున్నావారేన‌ని తెలిసింది. ఈ వేరియంట్ జ‌న్యు క్ర‌మాన్ని ప‌రిశీలించేందుకు వ్యాధి సోకిన‌వారి న‌మూనాల‌ను ప్ర‌యోగ‌శాల‌కు పంపించారు. కొత్త వేరింట్…

Read More

దేశంలో తగ్గిన కరోనా కేసులు..

దేశంలో రోజువారి కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 12వేల 428 కరోనా కేసులు నమోదయ్యాయి. వైరస్​​ ధాటికి మరో 356మంది ప్రాణాలు కోల్పోగా.. 15,951 మంది కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో లక్ష 63వేల 816 కేసులు ఉన్నట్లు వైద్య ఆరోగ్య శాఖ బులెటిన్ విడుదల చేసింది.

Read More

సమాచార హక్కు చట్టంపై హైకోర్టులో పిల్ దాఖలు..

సమాచార హక్కు చట్టంపై రాష్ట్ర సిఎస్ ఇచ్చిన ఆదేశాల రద్దు కోరుతూ హైకోర్టులో పిల్ దాఖలైంది. సమాచార హక్కు చట్టాన్ని ప్రభుత్వం నిర్వీర్యం చేస్తుందని న్యాయవాది రాపోలు భాస్కర్ పిటిషన్ దాఖలు చేశారు. కాగా సమాచార హక్కు చట్టం కింద ఏ శాఖకు సంబంధించిన సమాచారమైనా తెలుసుకునే వీలు లేకుండా ప్రభుత్వం అడ్డుకుంటోందని పిల్ లో పిటిషనర్ పేర్కొన్నారు. డిపార్ట్మెంట్ ఉన్నతాధికారుల అనుమతి తీసుకున్నాకే సమాచారం ఇవ్వాలని రాష్ట్ర సిఎస్ జీవో ఇవ్వడం సహచట్టాన్ని నిర్వీర్యం చేయడమే…

Read More

ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో కొత్త ట్విస్ట్..

బాలీవుడ్‌ను కుదిపేస్తున్న ముంబై క్రూజ్‌ డ్రగ్స్‌ వ్యవహారం ఊహించని మలుపు తీసుకుంటోంది. తాజాగా ముడుపుల వ్యవహారం తెరపైకి వచ్చింది. ఈ డ్రగ్స్‌ కేసును విచారిస్తున్న దర్యాప్తు సంస్థ అధికారులపైనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఆర్యన్‌ ఖాన్‌ విడుదలకు ఎన్‌సీబీ అధికారి 25 కోట్లు షారూఖ్‌ను డిమాండ్‌ చేశారని ప్రత్యక్ష సాక్షి ప్రభాకర్‌ సెయిన్‌ చేసిన సంచలన ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. దీనికి బలం చేకూర్చేలా శివసేన ఎంపీ సంజయ్‌ రౌత్‌, మహారాష్ట్ర మంత్రులు ఈ అంశంపై కీలక వ్యాఖ్యలు…

Read More

ఐపీఎల్లో మరో రెండు కొత్త టీంలు_బీసీసీఐ

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ లో మరో రెండు కొత్త జట్లు వచ్చి చేరాయి. కొత్తగా లక్నో, ఆహ్మదాబాద్‌ ఫ్రాంచైజీలను బిసిసిఐ ప్రకటించింది. దీంతో ఐపీఎల్‌ లో జట్ల సంఖ్య పదికి చేరింది. లక్నో ఫ్రాంచైజీని సంజీవ్‌ గోయెంకా గ్రూప్‌ 7090 కోట్లకు దక్కించుకోగా… ఆహ్మదాబాద్‌ ఫ్రాంచైజీని సివిసి కంపెనీ 5600 కోట్లకు కొనుగోలు చేసింది. వచ్చే ఏడాది నుంచి ఐపీఎల్‌ లో పది జట్లు ఆడతాయని బిసిసిఐ తెలిపింది. ఆటగాళ్ల మెగా వేలం డిసెంబర్‌ లో నిర్వహించనున్నట్లు…

Read More

కేసీఆర్ మరోసారి దళితులను మోసం చేస్తున్నారు: సంజయ్

హుజూరాబాద్ నియోజకవర్గం వీణవంక మండలం బేతిగల్ గ్రామంలో బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వ పథకాలు, నిధుల కేటాయింపు వివరాలను ప్రజలకు తెలుపుతూ, రాష్ట్ర ప్రభుత్వ అసమర్థత, వైఫల్యాలు, మోసాలు, కుటుంబ, అవినీతి పాలన గురించి ప్రజలకు వివరించారు. కేసీఆర్ కు హుజూరాబాద్ లో ముఖం చెల్లక ఈసీపై నిందలు వేస్తున్నారని సంజయ్ మండిపడ్డారు. భారత జాతీయ ఎన్నికల సంఘానికి ప్రపంచంలోనే మంచి గుర్తింపు ఉందన్నారు. సీఎంగా ఉంటూ ఈసీపై నిందలేయడం…

Read More

అట్టహాసంగా జాతీయ చలనచిత్ర అవార్డుల కార్యక్రమం..

భారతీయ చలనచిత్ర రంగంలో ప్రతిష్ఠాత్మకంగా భావించే జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సవం దిల్లీలోని విజ్ఞాన్‌ భవన్‌లో జరిగింది. ఈ కార్యక్రమానికి పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. ఇటీవల సినీరంగంలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన నటీనటులతోపాటు ప్రేక్షకుల మన్ననలు పొందిన చిత్రాలకు అవార్డులు అందజేశారు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చేతుల మీదుగా పలువురు అవార్డులు అందుకున్నారు. బెస్ట్‌ ఫీచర్‌ ఫిల్మ్‌గా మలయాళం నుంచి ‘మరక్కర్‌’ నిలవగా, ‘భోంస్లే’ చిత్రానికి మనోజ్‌ బాజ్‌పాయీ, ‘అసురన్’ చిత్రానికి ధనుష్‌ ఉత్తమ నటులుగా అవార్డులను…

Read More

టాలీవుడ్ ప్రముఖ నటుడు మృతి..!

తెలుగు సినిమాల్లో క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ ప్ర‌సిద్ధి చెందిన‌ రాజ‌బాబు క‌న్నుమూశారు. గ‌త కొంత కాలంగా అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్నా ఆయ‌న గ‌త రాత్రి మృతి చెందారు. 64 సంవ‌త్స‌రాల రాజ‌బాబు 62 సినిమాల్లో న‌టించి మంచి పేరు పొందారు. ఆయ‌న‌కు భార్య‌, ఇద్ద‌రు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. రాజ‌బాబు స్వ‌స్థ‌లం తూర్పుగోదావ‌రి జిల్లా రామ‌చంద్రాపురం మండ‌లంలోని న‌ర‌స‌రావుపేట‌. చిన్న‌ట‌ప్ప‌టి నుంచే న‌ట‌న‌పై మ‌క్కువ పెంచుకున్న ఆయ‌న దేశ‌వ్యాప్తంగా నాట‌క ప్ర‌ద‌ర్శ‌న‌లు ఇచ్చారు. 1995లో ఊరికి మొన‌గాడు సినిమాతో…

Read More

టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షునిగా 9వ సారీ కేసీఆర్ ఏకగ్రీవం..

టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షునిగా 9వ సారి ఎన్నికైన కేసీఆర్ ప్రజలకు కృతజ్నతలు తెలిపారు. తనపైన, పార్టీపైన ఇంతటి ప్రేమను నమ్మకాన్ని చూపిస్తున్న ప్రజలందరికి ధన్యవాదాలు తెలిపారు. సమైక్య పాలనలో ఎన్ని ఇబ్బందులు పడినా ఓ మహా ఉద్యమం ద్వారా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామని కేసీఆర్ అన్నారు. అన్నీరంగాల్లో స్థిరీకరణ సాధించిన తరువాత మనం అభివృద్ధిలో దేశానికే దిక్చూచిగా నిలిచామన్నారు. కాగా దళితబంధు మహా ఉద్యమంగా సాగుతోందని కేసీఆర్ ఆకాంక్షించారు. సంక్షేమంలో తెలంగాణ అగ్రగామిగా మారిందని కేసీఆర్ తెలిపారు….

Read More

ఉద్యోగాల్లో పురుషులతోపాటు స్త్రీలకు అవకాశం కల్పించాలి: మోడీ

ప్రభుత్వ ఉద్యోగాలు పురుషులకు మాత్రమేనన్న భావన ఇక ఎంత మాత్రం పనికిరాదన్నారు ప్రధాని మోదీ . తాము అధికారంలోకి వచ్చిన ఈ ఏడేళ్లలో బలగాల్లో మహిళల సంఖ్య రెట్టింపయిందని అన్నారు. ఆదివారం జాతినుద్దేశించి ప్రధాని ఆకాశవాణిలో ‘మన్‌ కీ బాత్‌’ కార్యక్రమంలో మాట్లాడారు. 2014లో తాను పగ్గాలు చేపట్టినప్పుడు పోలీసు బలగాల్లో మహిళల సంఖ్య 1.05 లక్షలు ఉండేదని.. ప్రస్తుతం అది 2.15 లక్షలకు చేరిందని తెలిపారు. భవిష్యత్‌లో కొత్త తరం పోలీసింగ్‌కు వారే సారథులవుతారన్న ప్రధాని…

Read More
Optimized by Optimole