రాజ్ కుంద్రాకు బెయిల్ మంజూరు..

పోర్న్ రాకెట్ కేసులో అరెస్టు అయిన వ్యాపార వేత్త రాజ్ కుంద్రాకు కోర్టు బెయిల్ మంజూరు చేసింది.అశ్లీల చిత్రాల కేసులో అరెస్టయిన రాజ్​ కుంద్రాకు(raj kundra news hindi) బెయిల్ లభించింది. రూ.50వేల పూచీకత్తుతో ముంబయి న్యాయస్థానం అతడికి బెయిల్ ఇచ్చింది. అశ్లీల చిత్రాల కేసులో అరెస్టయిన వ్యాపారి రాజ్​ కుంద్రాకు తాత్కాలిక ఊరట లభించింది. ముంబయిలోని న్యాయస్థానం అతనికి బెయిల్ మంజూరు చేసింది. ఇందుకోసం రూ.50వేలు పూచీకత్తు సమర్పించాలని ఆదేశించింది. కుంద్రాతోపాటు మరో నిందితుడు రయన్…

Read More

భాజాపా కురవృద్ధుడు కళ్యాణ్ సింగ్ కన్నుమూత!

యూపీ​ మాజీ సీఎం, భాజపా సీనియర్​ నేత కల్యాణ్‌సింగ్‌ కన్నుమూశారు. తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన గత కొద్దరోజులుగా లఖ్‌నవూలోని సంజయ్‌గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం రాత్రి తుదిశ్వాస విడిచారు. బాల్యం.. కళ్యాణ్ సింగ్ ఉత్తరప్రదేశ్ అలీఘడ్ 1932 జనవరి 5 న మారుమూల గ్రామంలో జన్మించారు.చిన్నపాటి నుంచి ఆధ్యాత్మిక భావాలతో ఆర్ ఎస్ ఎస్ లో చేరారు. అనతి కాలంలోనే జన్ సంఘ్.. జనతా పార్టీ.. బీజేపీ పార్టీలో కీలక నేతగా ఎదిగారు….

Read More

ఇండియన్ ఐడల్_12 వ సీజన్ విన్నర్ పవన్ దీప్ రాజన్!

సంగీత ప్రియుల్ని అలరించే పాపులర్‌ మ్యూజికల్‌ షో ఇండియన్‌ ‘ఐడల్‌ సీజన్‌ 12’ విజేతగా పవన్‌దీప్‌ రాజన్‌ నిలిచాడు. మన తెలుగు అమ్మాయి షణ్ముఖ ప్రియ ఆరో స్థానంలో నిలిచింది.ఎన్నో ఆశలతో ఫైనల్‌ పోరుకు చేరిన షణ్ముకప్రియకు నిరాశే ఎదురైంది. తన అద్భుతగానంతో సంగీత ప్రపంచాన్ని మెప్పించిన ఫైనల్‌ విజేత పవన్‌దీప్‌ రాజన్‌కు రూ. 25 లక్షల చెక్‌ను అందజేశారు. కాగా 12 గంటల పాటు నిర్విరామంగా సాగిన ఫైనల్‌ పోటీ ఆద్యంతం తీవ్ర ఉత్కంఠ రేపింది.మధ్యాహ్నం…

Read More

‘రిపబ్లిక్ ‘ మూవీ విడుదల డేట్ అనౌన్స్ !

మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ నటిస్తున్న తాజా చిత్రం రిపబ్లిక్.పొలిటికల్‌ థ్రిల్లర్‌ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి దర్శకుడు దేవకట్ట. తేజ్ సరసన ఐశ్వర్య రాజేష్ జోడి లో నటిస్తుంది.జీ స్టూడియోస్‌ పతాకంపై జె.భగవాన్‌, జె.పుల్లారావు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మణిశర్మ సినిమాకి సంగీతం అందిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర విడుదల తేదీని చిత్ర యూనిట్ ప్రకటించింది.అక్టోబర్‌ 1న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో సినిమా విడుదల చేయనున్నట్లు వెల్లడించింది.ఇప్పటికే విడుదలైన ఫస్ట్‌లుక్‌, టీజర్లకు మంచి స్పందన లభించింది….

Read More

పెగాసస్ పై స్పష్టత ఇచ్చినా కేంద్రం!

పార్లమెంటును కుదిపేస్తున్న పెగసస్​ వ్యవహారంపై కేంద్రం మౌనం వీడింది. పెగసస్​ వ్యవహారంపై ఉభయ సభల్లో విపక్షాలు పట్టుబడుతున్న నేపథ్యంలో.. ఈ స్పైవేర్ తయారీ సంస్థ, ఎన్​ఎస్​ఓ గ్రూపుతో ఎలాంటి ఒప్పందాలు లేవని రాజ్యసభలో స్పష్టం చేసింది. పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు జరగకుండా విపక్షాలు అడ్డుపడుతున్నాయని ప్రధాని మోదీ సైతం ఆవేదన వ్యక్తం చేసిన రెండు రోజుల్లోనే.. కేంద్రం ఈ ప్రకటన చేయడం గమనార్హం. ఇక పెగసస్ వ్యవహారంపై సీపీఎం ఎంపీ వి.శివదాసన్‌ రాజ్యసభలో కేంద్రాన్ని ప్రశ్నిస్తూ..ఎన్‌ఎస్‌వో గ్రూప్‌…

Read More

ముగిసిన విశ్వ క్రీడా సంరంభం!

విశ్వ క్రీడా సంగ్రామం ముగిసింది. రెండు వారాల పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రీడాభిమానులను అలరించిన టోక్యో ఒలింపిక్స్​ ముంగిపు కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. బాణసంచా వెలుగులు పాప్ సంగీతం, సంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. భారత్ నుంచి 10 మంది అథ్లెట్లు ముగింపు వేడుకల్లో పాల్గొన్నారు. ఇక టోక్యో ఒలంపిక్స్ అద్భుతాలే కాదు ఎన్నో ప్రత్యేకతలతో పాటు సంచలనానికి కేంద్ర బిందువు అయింది. చైనా అమెరికా జపాన్ ఆస్ట్రేలియా దేశాలు తమకు తిరుగులేదని మరోసారి చాటిచెప్పాయి. 38 గోల్డ్…

Read More

ఒలంపిక్స్ అథ్లెటిక్స్ లో భారత్ 100 ఏళ్ల స్వర్ణం సాకారం!

ఒలంపిక్స్ అథ్లెటిక్స్ లో.. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా వంద ఏళ్ళ భారత్ కలను నెరవేర్చాడు యువ అథ్లెట్ నీరజ్ చోప్రా. జావెలిన్​ త్రో ఫైనల్లో గెలిచి.. మువ్వన్నెల పతాకానికి పసిడి కాంతులద్దాడు. మొత్తంగా టోక్యో ఒలంపిక్స్ లో భారత అథ్లెట్లు ఈసారి గొప్ప ప్రదర్శన చేశారు. దీంతో ఓ స్వర్ణం.. రెండు రజతాలు.. నాలుగు కాంస్యాలు భారత్ ఖాతాలో చేరాయి. టోక్యో ఒలంపిక్స్ లో సరికొత్త చరిత్రను లిఖించిన నీరజ్‌ పై ప్రశంసల వర్షం…

Read More

ప్రభాస్ తో స్టెప్స్ వేయనున్న క్యాట్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం సలార్. కేజిఎఫ్ డైరక్టర్ ప్రశాంత్ నీల్ ఈ చిత్రానికి దర్శకుడు. యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్ సరసన శృతహాసన్ నటిస్తోంది. ఇప్పటికే ఫస్ట్ షెడ్యూల్ పూర్తి ఈ సినిమాలో బాలీవుడ్ టాప్ హీరోయిన్ కత్రినా కైఫ్ ప్రతేక గీతంలో నటించనుందని టాక్ ఇండస్ట్రీలో నడుస్తోంది. ఇందుకోసం చిత్ర యూనిట్ సదరు హీరోయిన్ను సంప్రదించినట్లు తెలుస్తోంది.ఇక ఈ సాంగ్ కోసం భారీ మొత్తంలో రెమ్యున‌రేష‌న్…

Read More

కోవిడ్ థర్డ్ వేవ్ ను ఎదుర్కొనేందుకు మరో ఎత్తుగడ!

దేశవ్యాప్తంగా మళ్లీ కరోనా విజృంభణ నేపథ్యంలో కేంద్రం కొత్త ప్రయోగం చేపట్టింది. వైరస్​ సామాజిక వ్యాప్తి ఏ స్థాయిలో ఉందో తెలుసుకునేందుకు మురుగునీటి నమూనాలను సేకరించి పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపింది.ఇన్సాకాగ్​ ఆధ్వర్యంలో ఈ పరిశోధన జరగనుంది. కోవిడ్ రూపాంతరం తో కొత్త కొత్త వేరియంట్ లు పుట్టుకొస్తున్న తరుణంలో వేరియంట్ తీవ్రత తెలుసుకునేందుకు ఈ తరహా ప్రయోగం చేపట్టింది. ఈపరీక్షల వలన ప్రస్తుతం ఏవైనా కొత్త వేరియంట్ల​ వ్యాప్తి ఉంటే గుర్తించే అవకాశం ఉంటుందని అధికారులు భావిస్తున్నారు….

Read More

మౌనం వీడిన నటి శిల్పా శెట్టి!

బాలీవుడ్ నటి శిల్పాశెట్టి ఎట్టకేలకు మౌనం వీడింది. తన భర్త రాజ్​కుంద్రా పోర్న్​ చిత్రాల కేసు విషయమై తప్పుడు ఆరోపణలు చేయొద్దని ఆమె కోరింది. కుటుంబ గోపత్యను గౌరవించాలని.. నిజా నిజాలు ఏమిటో తెలియకుండా తప్పుడు ఆరోపణలు చేయొద్దని అభ్యర్థించింది. మీడియా తమ కేసుపై ఆసక్తి కాస్త మానుకోవాలని సూచించింది. కొంత మంది మాపై పనికట్టుకుని అసత్య ప్రచారాలు చేస్తున్నారు. మీడియా, శ్రేయోభిలాషులు కూడా మాపై ఎన్నో నెగటివ్​ కామెంట్లు చేశారు. దయచేసి తప్పుడు ఆరోపణలు చేయొద్దు….

Read More
Optimized by Optimole