ముఖ్యమంత్రి మార్పు లేదు: సీఎం కేసీఆర్

తెలంగాణ సీఎం మార్పు గురించి జరుగుతున్న ప్రచారం పై ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టత ఇచ్చారు. ఆదివారం తెలంగాణ భవన్లో నిర్వహించిన పార్టీ కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కేటీఆర్ ముఖ్యమంత్రి అంటూ బహిరంగ సమావేశంలో మాట్లాడే నేతలకు చురకలు అంటిచారు. తాను రాజీనామా చేయాలని చూస్తున్నారా అని నేతలను ప్రశ్నించారు. ఇంకోసారి ఎవరైన ముఖ్యమంత్రి మార్పు పై మాట్లాడితే కర్రు కాల్చి వాతపెడతానని హెచ్చరించారు. మరో 10 ఏళ్ళు తానే ముఖ్యమంత్రిగా కొనసాగుతానని స్పష్టంచేశారు. ఈ నెల…

Read More

దేశ ప్రతిష్టతను దిగజార్చే కుట్ర: మోదీ

దేశ ప్రతిష్టతను దిగజార్చేందుకు కొన్ని విదేశీ శక్తులు కుట్రలు పన్నుతున్నాయని ప్రధాని మోదీ అన్నారు. ఆదివారం అసోంలోని సొంటిపూర్ జిల్లాలో టీ కార్మికులు ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ.. దేశంలోని పరిశ్రమల గురించి బయటి శక్తులు అసత్య ప్రచారాలు చేస్తున్నాయని, అలాంటి వారికి మద్దతు తెలిపే రాజకీయ పార్టీలకు ప్రజలు తగిన రీతిలో బుద్ధి చెప్పాలని మోదీ పేర్కొన్నారు. అనంతరం రాష్ట్రంలో రహదారుల అభివృద్ధి కోసం 8 వేల కోట్లతో తలపెట్టిన ‘అసోంమాల’ పథకాన్ని ఆయన…

Read More

ఆత్మనిర్బర్ భారత్ లక్ష్యంగా ముందుకెళ్తున్నాం : అనురాగ్ ఠాకూర్

కరోనా తో కుదేలైన ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చేలా 2020-21 వార్షిక బడ్జెట్ రూపొందించామని కేంద్ర ఆర్ధిక సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్ పేర్కొన్నారు. శనివారం తెలంగాణ భాజపా రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కరోనా సంక్షోభంతో కష్టాల్లో ఉన్నవారిపై ఎలాంటి భారం పడకుండా.. ఆత్మనిర్భర భారత్ లక్ష్యంగా ముందుకెళ్తూమాని అన్నారు. అనంతరం లఘు ఉద్యోగ భారతి సంస్థ నిర్వహించిన పారిశ్రామిక వేత్తలు, మేధావులతో చర్చా గోష్టిలో పాల్గొన్నారు. నీతి ఆయోగ్ సూచన…

Read More

ఉప్పెన ప్రీ రిలీజ్ ఈవెంట్ గెస్ట్ మెగాస్టార్..?

మెగాస్టార్ మేనల్లుడు పంజా వైష్ణవ్ తేజ్ , కృతి శెట్టి హీరోహీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం ఉప్పెన. ప్రముఖ దర్శకుడు సుకుమారుడు శిష్యుడు బుచ్చిబాబు చిత్రానికి దర్శకుడు. కాగా చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ కీ మెగాస్టార్ చిరంజీవి చీఫ్ గెస్ట్ గా రాబోతున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది. ఇప్పటికే విడుదలైన సాంగ్స్ , టీజర్కికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. దీంతో వైష్ణవ్ తేజ్ తొలి చిత్రంతోనే భారీ విజయం సాధిస్తారని మెగా అభిమానులు ధీమా…

Read More

ఎస్ఈసీ మాటలు వింటే చర్యలు తప్పవు: మంత్రి రామచంద్రా రెడ్డి

ఎస్ఈసీ(ఎన్నికల కమిషనర్) మాటలు విని తప్పుడు నిర్ణయాలు తీసుకుంటే,బ్లాక్ లిస్టులో పెడతామని కలెక్టర్లు, పంచాయతీ ఎన్నికల అధికారులకు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హెచ్చరించారు. శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. మేము ఎన్నికల కమిషనర్ మాట వింటాం.. ఆయన చెప్పినట్లు చర్యలు తీసుకుంటాం అంటే.. పరిణామాలు తీవ్రంగా ఉంటాయని పెద్దిరెడ్డి అన్నారు. కాగా చిత్తూరు, గుంటూరు లో ఏకగ్రీవాలు అపమని ఎన్నికల కమిషనర్ అంటున్నారు. అందుకు సహకరిస్తూ, తొత్తులుగా పనిచేసే అధికారుల అందరిని గుర్తుపెట్టుకుంటామని…

Read More

ఫోర్బ్స్ జాబితాలో తెలంగాణ యువతి!

ప్రపంచ ప్రఖ్యాత ఫోర్బ్స్ జాబితాలో తెలంగాణ యువతికి చోటుదక్కింది. ప్రతి ఏటా ప్రకటించే 30 మంది ఫోర్బ్స్ యువ జాబితాలో సిద్ధిపేట జిల్లా పోతారం గ్రామానికి చెందిన కీర్తిరెడ్డికి స్థానం లభించింది. ఈమె మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి కుమార్తె..లండన్లో స్కూల్ ఆఫ్ ఎకానమిక్స్ అండ్ పొలిటికల్ సైన్స్లో గ్లోబల్ మాస్టర్స్ లో డిగ్రీ పట్టా పొందిది. ప్రస్తుతం స్టాట్విగ్ అనే వ్యాక్సిన్ ట్రిగింగ్ కంపెనీ కి సీఈఓ గా పనిచేస్తుంది. ఆమె ఆ కంపెనీకి…

Read More

పెళ్లి పీటలు ఎక్కబోతున్న సుమంత్ అశ్విన్!

టాలీవుడ్ యువ హీరోలు ఒక్కొక్కరుగా బ్యాచిలర్ లైఫ్ కి స్వస్తి చెబుతున్నారు. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రానా దగ్గుబాటి, నితిన్ ఇటీవలే ఓ ఇంటివారయ్యారన్న విషయం అందరికీ తెలిసిందే. తాజాగా ఈ జాబితాలోకి యువ హీరో సుమంత్ అశ్విన్ జాయిన్ కాబోతున్నాడు. ఈ విషయాన్ని అతని తండ్రి , నిర్మాత ఎమ్మెస్ రాజు ట్విట్టర్ వేదికగా వెల్లడించాడు. దీపిక అనే అమ్మాయితో అశ్విన్ మ్యారేజ్ ఫిక్సైనట్లు త్వరలో వారిద్దరూ ఒక్కటి కాబోతున్నారని రాజు ట్వీట్లో పేర్కొన్నాడు. సుమంత్…

Read More

పటిష్ట స్థితిలో ఇంగ్లాండ్!

భారత్ , ఇంగ్లాండ్ తొలి టెస్టులో మొదటి రోజు ఇంగ్లాండ్ పై చేయి సాధించింది. ఇంగ్లాండ్ సారథి జో రూట్ సెంచరీ (197 బంతుల్లో 128)తో చెలరేగడంతో ఆజట్టు భారీ స్కోర్ దిశగా ముందుకెళ్తోంది. ఓపెనర్ సిబ్లీ( 286 బంతుల్లో 87) అర్థ సెంచరీతో మెరిశాడు. మొదటి రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లాండ్ జట్టు 263/3 స్కోర్ తో మెరుగైన స్థితిలో ఉంది. భారత్ బౌలర్లలో బుమ్ర రెండు, అశ్విన్ ఒక్క వికెట్ పడగొట్టారు. టాస్…

Read More

హిందూ ఆలయాలను ,ఆస్తులను కాపాడాలి: భారతి స్వామి

సెక్యులర్, ప్రభుత్వ పథకాల కోసం హిందు ఆలయాల ఆదాయం నుంచి ఒక్క పైసా ఖర్చు చెయ్యెదన్నారు పుష్పగిరి పీఠాధిపతులు విద్యాశంకర భారతి స్వామి. ఆలయాల నిధులను హిందు దేవాలయాల కోసమే ఖర్చు చేయాలని ఈ విషయంలో ఏపీ ప్రభుత్వ పనితీరు బాగోలేదని ఆయన తెలిపారు. ఇక ఏపీలో ఆలయాల మీద జరుగుతున్న దాడులు, ఆస్తులను కాపాడేందుకు మాజీ న్యాయమూర్తి ఆధ్వర్యంలో కమిటీ వేయాలని భారతి స్వామి కోరారు. రాష్ట్రంలోని దేవాలయ పరిరక్షణ కోసం ప్రభుత్వం , పురావస్తు శాఖతో…

Read More

పీవీ పోస్టల్ స్టాంప్ విడుదల : కేంద్ర సహాయ మంత్రి

పీవీ నరసింహారావు శత జయంతిని పురస్కరించుకుని పోస్టల్ స్టాంప్ విడుదల చేయనున్నట్లు కేంద్రం నిర్ణయించింది. ఈ విషయమై ప్రధాని మోదీ, ఐటీ శాఖ మంత్రి రవి శంకర్ తో చర్చించిన మేరకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర హోంశాఖ మంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు. ముఖ్యమంత్రి, ప్రధాన మంత్రిగా దేశ ప్రజలకు పీవీ ఎనలేని సేవలు అందిచారని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. చాణక్య నీతి, సంస్కరణలతో క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న దేశాన్ని ప్రగతి బాట పట్టించి,…

Read More
Optimized by Optimole