News
ganeshchaturthi:మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో వినాయక చవితి పూజలు..!
PawanKalyan: మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో వినాయక చవితి పూజలు సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. మట్టి గణపతి ప్రతిమకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పూజలు చేశారు. విఘ్నాలు లేకుండా రాష్ట్రాభివృద్ధికి దైవం ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షించారు. విఘ్నేశ్వరుడి కరుణాకటాక్షాలతో ప్రతి కుటుంబం సుఖసంతోషాలతో గడపాలని, విజయాలు సిద్ధించాలని అభిలషించారు. ఈ కార్యక్రమంలో పార్టీ శాసనమండలి సభ్యులు పిడుగు హరిప్రసాద్, పార్టీ కార్యక్రమాల నిర్వహణ కమిటీ కన్వీనర్ కళ్యాణం శివ శ్రీనివాస్, చేనేత వికాస విభాగం ఛైర్మన్ …
ganeshchaturthi: హిందూ బంధువులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు: బండి సంజయ్
Bandisanjay: వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని కేంద్ర హాంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కరీంనగర్ లోని మహాశక్తి ఆలయంలో గణనాథుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజారుల వేద మంత్రోచ్చారణల మధ్య మంగళ హారతి పట్టి విఘ్నేశ్వరుడి ఆశీస్సులు అందుకున్నారు. అనంతరం అక్కడున్న భక్తుల కోరిక మేరకు వినాయకుడితో బండి సంజయ్ సెల్ఫీ తీసుకున్నారు. ఈ సందర్భంగా హిందూ బంధువులందరికీ బండి సంజయ్ వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. హిందువుల ఐక్యతే లక్ష్యంగా, హిందూ…
Emchestunnav: ఏం చేస్తున్నావ్ రివ్యూ .. ” అచ్చమైన ప్రేమ కథ ”
విశీ(వి.సాయివంశీ): నాలుగు ప్రేమలు ఉన్న అచ్చమైన ప్రేమకథ..! ‘ఏం చేస్తున్నావ్?’ ఏం చేస్తాం? పెద్దలైతే కాలక్షేపం చేస్తారు. పిల్లలైతే అల్లరి చేస్తారు. అమ్మానాన్నలు పనులు చేస్తారు. మరి అప్పుడే కాలేజీ ఏజ్ దాటిన కుర్రకారు ఏం చేస్తారు? కొలువు. అదే వారికి నెలవు. అంతేనా? అంతకుమించి ఏమీ లేదా? ఉండకూడదా? ‘కలలు కనండి.. సాధించండి’ అన్నారు అబ్దుల్ కలాం. దాన్ని మనవాళ్లు మరోలా వ్యాఖ్యానించుకున్నారు. ‘ఫలానా కలలే కనండి.. ఫలానా మార్కులొస్తే అవే మీకు మీ కలల్ని…
Mirchi: అలరించిన మిర్చి తెలుగు మాట…!
Mirchi: తెలుగు భాష దినోత్సవం సందర్భంగా 98.3 రేడియో మిర్చి, ‘‘మిర్చి తెలుగు మాట’’ పేరుతో ఒక ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. తెలుగు భాష దినోత్సవం ఆగస్టు 29న మొదలై వరుసగా నాలుగు రోజుల పాటు తలపెట్టిన ‘‘మిర్చి తెలుగు మాట’’ కార్యక్రమంలో తెలుగుకు సంబంధించిన అనేక ఆసక్తికరమైన విషయాలను తెలియయజేశారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోని రేడియో మిర్చి స్టేషన్లలో నిర్వహించిన ఈ ప్రత్యేక కార్యమ్రం, ఖండతారాలు దాటిన తెలుగు ఖ్యాతిని ఆవిష్కరించింది. తెలుగును అమితంగా…
Vijayawada: మా అమ్మ చెప్పిన మాట నిజమేనని నిరూపిస్తున్న బెజవాడ వరదలు!
Nancharaiah merugumala senior journalist: ‘ఐదుగురు అప్పాచెల్లెళ్లలో కళ్లులేనిది బుడమేరు’ అని ఎప్పుడో మా అమ్మ చెప్పిన మాట నిజమేనని నిరూపిస్తున్న బెజవాడ వరదలు..! బెజవాడ నగరంలో సమాంతరంగా కనిపించే రెండే రెండు పెద్ద రోడ్లు ఏలూరు రోడ్డు, బందరు రోడ్డు ప్రాంతాలు ప్రస్తుత వరదల నుంచి సురక్షితంగా ఉన్నాయని తెలుగు టీవీ చానళ్లు చెబుతున్నాయి. ఇది చాలా గొప్ప శుభవార్తే. మరి నిన్నమొన్నటి వానలతో ఈ మధ్యస్థ–మిడీవల్ సిటీకి ఉత్తరమో లేదా ఈశాన్యమో తెలియదుగాని ఊరు…
RTI: ఇది వంచన కాదా..?
ఆర్. దిలీప్ రెడ్డి ( మాజీ ఆర్టీఐ కమిషనర్, సీనియర్ జర్నలిస్ట్): ప్రజలను శక్తివంతులను చేయడం పాలకులకు ఇష్టముండదు. తమపై ఆధారపడుతూ, ప్రజలెప్పుడూ దుర్బలులుగా ఉండటాన్నే వారు కోరుకుంటారు. జనం ఏ కొంచెం బలపడుతున్నారని పొడగన్నా చాలు… దాన్ని భంగపరిచే వరకు నిద్రపోరు. ఎక్కడ ప్రజలు తెలివిపరులై ఏమడుగుతారో? ఏ తప్పులను ఎండగడతారో? ఏమి జవాబు చెప్పాల్సి వస్తుందో? తమ పని మరింతగా సంక్లిష్టమౌతుందేమో…..? ఇవే వారి భయాలు! నెమ్మదిగా బలపడుతున్న ఒక సువ్యవస్థ ‘అధికారిక…