Literature: సాహిత్య సభల్లో టైమర్ అవసరం..!
విశీ: సాహిత్య సభల్లో టైమర్ పెట్టాలని, వాళ్లకి కేటాయించిన టైం రాగానే ఒక నిమిషం ముందు గంట మోగేలా ఏదైనా ఏర్పాటు చేయిస్తే బాగుంటుందని అప్పుడప్పుడూ అనుకుంటూ ఉంటాను.(నేను చూసినంత వరకు ఖదీర్ గారు నిర్వహించే సమావేశాలు టైం ప్రకారం జరుగుతాయి. టైం కాగానే ఆయన లేచి వాచీ చూస్తారు. ప్రసంగం ముగించాల్సిన సమయం వచ్చిందని అర్థమవుతుంది). TED Talksలో 18 నిమిషాలలోపు ప్రసంగం ముగించాలి. ఎంత ఘనులైనా అదే నిబంధన! మన దగ్గర మాత్రం కొందరు…