News
Music: బిందుమాలిని – ఓ సంగీత దర్శకురాలి ప్రస్థానం..!
సాయి వంశీ ( విశీ) : 2016లో తమిళంలో ‘అరువి’ అనే సినిమా విడుదలై సంచలనం సృష్టించింది. టైటిల్ పాత్ర పోషించిన అదితి బాలన్ నటనకు అందరూ ఫిదా అయ్యారు. రజనీకాంత్ అంతటి నటుడు ఆమెకు ఫోన్ చేసి చాలా బాగా చేశావంటూ మెచ్చుకున్నారు. తమిళం తెలియనివారు సైతం ఆ సినిమా వెతుక్కుని మరీ చూశారు. 2018లో కన్నడలో ‘నాతిచరామి’ సినిమా విడుదలైంది. శ్రుతి హరిహరన్, సంచారి విజయ్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమా గురించీ…
Ambedkar: అంబేడ్కర్ ఎంతటి గొప్ప నాయకుడో మండల్ వ్యతిరేక ఉద్యమం వల్లే బీసీలకు తెలిసింది!
Nancharaiah merugumala senior journalist: ‘గాంధీ’ సినిమాతో మోహన్ దాస్ గాంధీకి ‘అంతర్జాతీయ గుర్తింపు’ వచ్చిన మాట ఎంత వరకు నిజమోగాని–బాబాసాహబ్ అంబేడ్కర్ ఎంతటి గొప్ప నాయకుడో మండల్ వ్యతిరేక ఉద్యమం వల్లే బీసీలకు తెలిసింది! ప్రధాని నరేంద్రమోదీ ఏబీపీ న్యూస్ చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పినట్టు –మహాత్మా మోహన్ దాస్ గాంధీకి ‘ప్రపంచవ్యాప్త గుర్తింపు’ 1982లో ‘గాంధీ’ సినిమా విడుదలైన తర్వాత వచ్చిన మాట ఎంత వరకు నిజమో గాంధీ ఇంటి పేరున్న రాహుల్…
spiritualunion: ఓ మేలు కలయిక..!
దిలీప్ రెడ్డి సీనియర్ జర్నలిస్ట్: ‘ఇంతమంది మంచివాళ్లు …. ఒక చోట, ఒకే రోజు ఎలా కలిశారు?’ అని ఆశ్చర్యపోతూ అడిగారు ప్రొ.పురుషోత్తం రెడ్డి గారు ఇవాళ (ఆదివారం) మమ్మల్ని అభినందిస్తూ! అది ఆయన మంచితనం. అయితే, అలా అని మేమేం మంచివాళ్లం కాదని కాదు సుమా! మేమంతా మంచోళ్లమే, మాదొక మేల్ కలయిక! ఆయన ప్రశ్నకు మా దగ్గర నిర్దుష్టంగా సమాధానం కూడా వుంది! అదేమంటే, రామోజీరావు గారి వల్ల అది సాధ్యమైంది. ప్రధాన స్రవంతి…
YsJagan: 12 ఏళ్లనాటి జగన్ అరెస్టును గుర్తుచేసిన రాధాకృష్ణకు జేజేలు పలుకుతున్న వైసీపీ
Nancharaiah merugumala senior journalist: ” 12 ఏళ్లనాటి జగన్ అరెస్టును గుండెలు పిండేసేలా గుర్తుచేసినందుకు వేమూరి రాధాకృష్ణకు జేజేలు పలుకుతున్న వైసీపీ అభిమానులు.. ” ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పుష్కర కాలం క్రితం 2012 మే 12న అరెస్టయ్యారనే విషయం సోమారం మధ్యాహ్నం ఏబీఎన్ ఆంధ్రజ్యోతి అనే తెలుగు టెలివిజన్ న్యూజ్ ఛానల్ గుర్తుచేసింది. పాత కతలు చాలా వరకు విసుగుపుట్టించే స్థాయిలో రాసే అలవాటున్న నాకు జగన్ ను సీబీఐ…
APpolitics : ఏపీలో కూటమిది గాలా?…. తుఫానా..?
APpolitics: ‘వీచింది గాలా? వచ్చింది తుఫానా?’ తనను కలిసిన ఆంధ్రప్రదేశ్ నాయకులతో ప్రధానమంత్రి, బీజేపీ అగ్రనేత నరేంద్ర మోదీ ఆరా తీసిన తీరు ఇది! ఈ ఎన్నికల్లో ఎన్డీయే కూటమికి అనుకూలంగా గాలి వీచిందని… అది తుఫానుగా మారే అవకాశాలు ఉన్నాయని వారు ఆయనకు చెప్పినట్టు తెలిసింది. ప్రధానమంత్రి స్థాయి వ్యక్తి ‘‘గాలా..? తుఫానా..?’’ అని అడిగారంటే, ఆయనకు విశ్వసనీయ వ్యక్తులు, సంస్థల నుంచి ముందే అందిన సమాచారాన్ని సరిపోల్చుకోవడానికేనని అర్థం చేసుకోవచ్చు. రాష్ట్రంలో రాజకీయ గాలీ…
Poetry: నిన్నను క్షమించేద్దాం..!
Poetry: నిన్నను క్షమించేద్దాం రేపటి రోజును నాశనం చేసే అవకాశాన్ని నిన్నకు ఇవ్వొద్దు. బాస రూపుమాసిపోతుంది. గొంతు ఊగిసలాడుతుంది. రాలిన ఆకుల చప్పుళ్లతో చెవులు గింగురుమంటుంటాయి. పొద్దు పొడిచే లోపే అవకాశానికి ఆటంకం ఎదురవుతుంది. నిన్నటి రోజును దాని మానాన గడచిపోనిద్దాం. కాలజాలంలోని కలనేతను కాసింత సడలించుదాం. రేపటి రోజును అదుపు చేయవద్దని నేటిని వేడుకుందాం. వెనుదిరిగి చూడనే చూడొద్దు. ఇక నిన్ను నడిపించేది నీ సంకల్పమే! — బాస్క్ మూలం: వీ ఫ్లమింగో స్వేచ్ఛానువాదం: పన్యాల…
Guppedamanasu: ప్రతి ఒక్కరిలో స్త్రీ ఉంటుంది..!
సాయి వంశీ ( విశీ) : శరత్‌బాబు గారు మరణించినప్పుడు అందరూ ‘సాగరసంగమం’, ‘సితార’, ‘అభినందన’, ‘సీతాకోకచిలుక’ లాంటి సినిమాల్లో ఆయన నటన గురించి ప్రస్తావించారు. ‘గుప్పెడు మనసు'(1979) గురించి ఎవరూ రాసినట్టు కనిపించలేదు. ఆ సినిమా గురించి చెప్పుకోకుండా ఆయన కెరీర్ గురించి చెప్పడం కష్టం. తెలుగులో వచ్చిన అతి విలువైన సినిమాల్లో అదీ ఒకటి. కె.బాలచందర్ గారి క్రియేషన్. కమర్షియల్లీ ఫ్లాప్. క్లాసికల్లీ హిట్. సుజాత, సరిత, శరత్‌బాబు.. ఎవరికి ఎక్కువ మార్కులు వేయాలో…
Telugu literature: కుక్కతోక..!
Literature: కుక్కతోక ‘నేను బాగా నాట్యమాడతాను’ కుక్కతో దాని తోక అంది. ‘మనం పోటీ పడదాం’ తోకకు సవాలు విసిరింది కుక్క. అలసిపోయిన కుక్క సహనం కోల్పోయింది. తోకను కొరికి అవతలకు ఉమ్మేసింది. ‘జాగ్రత్త! ఏమనుకున్నావో, ఏమో!’ గుర్రుమంటూ హెచ్చరించింది. — టిగ్రిన్యా మూలం: రీసమ్ హెయిలీ స్వేచ్ఛానువాదం: పన్యాల జగన్నాథదాసు
Religion:మనుషులు మత గ్రంథాలను ప్రశ్నించకూడదట ..!
సాయి వంశీ ( విశీ) : (బ్రో! మనుషులు మత గ్రంథాలను ప్రశ్నించకూడదట ) పవిత్ర గ్రంథం: ఆదియందు దేవుడు భూమ్యాకాశములను సృజించెను. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. చీకటి అగాధ జలము పైన కమ్మియుండెను. దేవుని ఆత్మ జలములపైన అల్లాడుచుండెను. దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను. దేవుడు వెలుగును చీకటిని వేరుపరచెను. దేవుడు వెలుగునకు పగలనియు, చీకటికి రాత్రి అనియు పేరు పెట్టెను. …. దేవుడు ఆ…
