News
చంద్రబాబుకు ‘అనారోగ్యం’ పై ఒక్కో కులం పత్రిక ఒక్కోలా చెబితే ఎలా ?
Nancharaiah merugumala senior journalist: చంద్రబాబుకు ‘అనారోగ్య’ కారణాలపై బెయిలు–అని ‘ఈనాడు, జ్యోతి’ చెబుతుంటే…‘ఆరోగ్య’ కారణాల దృష్ట్యా ఆయనకు బెయిలు మంజూరైందని ‘సాక్షి’ వెల్లడించింది!ఒక్కో కులం పత్రిక ఒక్కో రకంగా చెబితే మామూలు తెలుగోళ్లు ఏమైపోవాలి? గత 52 రోజులుగా రాజమహేంద్రి జైల్లో ఉన్న మాజీ సీఎం, టీడీపీ అగ్రనేత నారా చంద్రబాబు నాయుడుకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మధ్యంతర బెయిలు మంజూరు చేసిందని ఆంధ్రా మూలాలున్న మూడు తెలుగు దినపత్రికల వెబ్‌సైట్లు తెలిపాయి. అయితే, రెండు ‘వ్యవసాయధారిత’…
తెలంగాణలో కాంగ్రెస్ కేసీఆర్ పార్టీని దాటిపోతోందనడానికి ఆధారాలే లేవు..
Nancharaiah merugumala senior journalist: ‘తెలంగాణలో బీఆర్ఎస్ నిస్సందేహంగా ముందుంది, దాని పునాది చెక్కుచెదర లేదు..కాంగ్రెస్ పుంజుకుని కేసీఆర్ పార్టీని దాటిపోతోందనడానికి ఆధారాలే లేవు’..సెఫాలజిస్ట్ సంజయ్ కుమార్ మాటలు ఎప్పుడూ వాస్తవ పరిస్థితికే అద్దంపడతాయి! ‘‘తెలంగాణలో కేసీఆర్ నాయకత్వంలోని బీఆరెస్సే ఖాయంగా ముందంజలో ఉంది. కాంగ్రెస్ కోలుకుని ముందుకు పోవడం లేదు. రాష్ట్రంలో 2014 జూన్ నుంచీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాల కారణంగా బీఆరెస్ బలం చెక్కు చెదరలేదు. గ్రామీణ ప్రాంతాల్లో ఈ పార్టీకి విస్తృతమైన…
కుత్బుల్లాపూర్ గౌడ ‘కూన’లు ఎంతగా కలబడినా ‘కొలను’ రెడ్డికి ఫాయిదా ఉండదు!
Nancharaiah merugumala senior journalist:(కుత్బుల్లాపూర్ గౌడ ‘కూన’లు ఎంతగా కలబడినా ‘కొలను’ రెడ్డికి ఫాయిదా ఉండదు!ఇది హైదరాబాద్ మెట్రోపాలిటన్ ఏరియా..కాకినాడ రూరలో, రామచంద్రపురమో కాదు!!) ===================== గురువారం సూరారం రాంలీలా మైదానంలో– జాబిలీ హిల్స్‌లో భూమి విలువేగాక, హైదరాబాద్ నగర శివార్లలోని నేల ఖరీదెంతో తెలిసిన ఓ కృష్ణా జిల్లా ‘సెటిలర్’ యాజమాన్యంలోని ఓ తెలుగు టీవీ న్యూజ్ చానల్ నిర్వహించిన బహిరంగ చర్చలో ఒకే కులానికి చెందడమేగాక ఒకే ఇంటి పేరున్న ప్రస్తుత ఎమ్మెల్యే కూన…
తెలంగాణ కమ్యూనిస్టులకు మునుగోడు సీటు ఎందుకో!)
Nancharaiah merugumala senior journalist: (‘ఎర్ర బిడ్డలు’ పువ్వాడ అజయ్, చెన్నమనేని రమేష్ బీఆరెస్ లో ఉండగా తెలంగాణ కమ్యూనిస్టులకు మునుగోడు సీటు ఎందుకో!) ====================== మునుగోడు సీటు కోసం రైటు కమ్యూనిస్ట్ నేతలు చాడా వెంకట రెడ్డి, పల్లా వెంకట రెడ్డీ ఇక నుంచి నల్లగొండ కాంగ్రెస్ బడా నాయకులు కోమటిరెడ్డి వేంకట రెడ్డి, ఉత్తమ రెడ్డి, జానా రెడ్డి కాళ్లు మొక్కినా ప్రయోజనం ఉండకపోవచ్చు. రెండు కమ్యూనిస్టు పార్టీలూ తలా రెండు అసెంబ్లీ స్థానాల…
కర్ణాటక మంత్రి తెలంగాణ ‘కాంగ్రెస్ ప్రజా పంపిణీ వ్యవస్థ’ను ఎంత సమర్ధంగా నడిపిస్తారో!
Nancharaiah merugumala senior journalist:(పశ్చిమగోదావరిలో మూలాలున్న కర్ణాటక మంత్రి నడింపల్లి బోసురాజు ఎన్నికల ‘స్పెషలబ్జర్వర్’గా ..తెలంగాణ ‘కాంగ్రెస్ ప్రజా పంపిణీ వ్యవస్థ’ను ఎంత సమర్ధంగా నడిపిస్తారో!) =================== తెలంగాణ శాసనసభ మూడో ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రత్యేక పరిశీలకులు ఇద్దరిలో ఒకరిగా కర్ణాటక చిన్న తరహా నీటిపారుదల శాఖా మంత్రి నడింపల్లి ఎస్ బోసు రాజు గారిని శనివారం కాంగ్రెస్ ఐ కమాండ్ నియమించింది. పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరు మండలం మోగల్లులో పుట్టి పెరిగిన ఈ కాంగ్రెస్…
ఆంధ్రప్రదేశ్ ‘ బీసీ’ లకు ఉత్తరాంధ్ర జిల్లాల్లో టికెట్లు ఇవ్వడం ‘చక్కటి వ్యూహం’..!
Nancharaiah merugumala senior journalist: (తెలంగాణ బీసీలకు ‘ఎక్కువ’ టికెట్లు హైదరాబాద్ పాత బస్తీలో ఇస్తుంటే..ఆంధ్రప్రదేశ్‌లో ఉత్తరాంధ్ర మూడు ఉమ్మడి జిల్లాల్లోనే ఇవ్వడం ‘చక్కటి వ్యూహం’!) =≠====≠======== పెద్దలు డాక్టర్ చెరుకు సుధాకర్ గారు, మిత్రుడు సంగిశెట్టి శ్రీనివాస్ ఇదివరకే చెప్పినట్టు కాంగ్రెస్ పార్టీ తన మొదటి జాబితాలోని 12 మంది ఓబీసీల్లో ఐదుగురికి హైదరాబాద్ పాత నగరంలోని అసెంబ్లీ స్థానాల టికెట్లు కేటాయించి చేతులు దులిపేసుకుంది. 55 మంది అభ్యర్థుల తొలి లిస్టులో బీసీలకు డజను…
రేవంత్ నోటికి తాళం వేసే సత్తువ సిద్దిపేట పద్మనాయకులకు లేదేమో మరి!
Nancharaiah merugumala senior journalist: (‘సోనియా తెలంగాణ ఇస్తే–కేసీఆర్ దాన్ని దిల్లీ నుంచి మోసుకొచ్చాడు’..తెలంగాణ జనాన్ని నాడు ఆంధ్రోళ్లు సైతం ఇలాంటి ‘బూతు మాటల’తో కించపరచలేదే!రేవంత్ నోటికి తాళం వేసే సత్తువ సిద్దిపేట పద్మనాయకులకు లేదేమో మరి!) ………………………………………………………………………….. ‘ఆనాడు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ తెలంగాణ ఇవ్వకుంటే టీఆస్ నేత కేసీఆర్, ఆయన కొడుకు కేటీఆర్ పరిస్థితి అధ్వానంగా ఉండేది,’ అని గురువారం తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఏ రేవంత్ రెడ్డి పెద్దపల్లిలో అన్నారు. 1956–2014…
Lifetimeachievement: విమోచన’ ఎడిటర్–ప్రచురణకర్తగానే’ హెచ్చార్కే చాలా మందికి గుర్తు!
Nancharaiah merugumala senior journalist: (ఉదయంలో కొద్ది మాసాలు, ఈనాడులో సుదీర్ఘకాలం పనిచేసినా ..‘విమోచన’ ఎడిటర్–ప్రచురణకర్తగానే హెచ్చార్కే చాలా మందికి గుర్తు!) =============== ఎంత కాదని చెప్పినా… ఏదైనా అవార్డు ప్రకటించినప్పుడు దానికి ఎంపికైన వ్యక్తిపై కొద్ది రోజులు చర్చ నడుస్తుంది. 2023 సంవత్సరానికి మీడియా విభాగంలో జీవనకాల సాఫల్య పురస్కారానికి ఎంపికైన ఇద్దరిలో ఒకరైన హెచ్చార్కే గారు (కొడిదెల హనుమంత రెడ్డి) ఎక్కువ మందికి కవిగా, పాత్రికేయుడిగా తెలుసు. తెలుగు కవిత్వం లోతుపాతులు పెద్దగా అర్ధంగాని…
