తెలంగాణాలో రంజుగా రాజకీయం..
బొజ్జ రాజశేఖర్ సీనియర్ జర్నలిస్ట్: తెలంగాణలో రాజకీయం రంజుగా మారింది. అసెంబ్లీ ఎన్నికల గడువు ముంచుకొస్తుండటంతో ప్రధాన రాజకీయ పార్టీలు బహిరంగ సభలతో వేడి పుట్టిస్తున్నాయి. బహిరంగ సభల్లో ప్రజలకు మేలు చేసే హమీల కన్నా.. ఒకరిపై మరోకరు బురద చల్లడమే పనిగా నేతలు మాటల తూటాలు పేలుస్తున్నారు. తాజాగా కాంగ్రెస్ చేవేళ్లలో ఎస్సీ, ఎస్టీ డిక్లెరేషన్ పేరుతో సభ నిర్వహించగా.. పట్టులేని ఖమ్మంలో రైతు గోస.. బీజేపీ భరోసా పేరుతో కాషాయం పార్టీ బహిరంగ సభ…