లక్షలాది మంది భవిష్యత్ పైనా చిల్లర రాజకీయాలేనా? భరోసా నింపే ప్రయత్నం ఎక్కడ?
టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ వ్యవహారం రాష్ట్రంలో సంచలనం కలిగిస్తోంది. తమ వీక్ నెస్ తో బోర్డులో ఉన్న కొంతమంది వ్యక్తులు చేసిన పనికి, ఉద్యోగాల కోసం అహోరాత్రులు కష్టపడి చదువుకున్న లక్షలాది మంది అభ్యర్థులు రోడ్డునపడ్డారు. ఇన్నాళ్లు కష్టపడి చదివాం, ఉద్యోగాలు కొట్టేందుకు అడుగు దూరంలో ఉన్నాం అనుకున్నారు. కానీ, నోటికాడికి వచ్చిన ముద్ద మట్టిపాలైంది. *పార్ట్ టైమ్ ఉద్యోగాలు చేసుకుంటూ, తిండి లేక, నిద్ర లేక అవస్థలు పడుతూ పరీక్షలు రాశారు.* చాలా కాలం తర్వాత…