×

Janasenaparty:  వైసీపీ ప్రభుత్వం సలహాదారులకు పెట్టిన ఖర్చు ఎంతో అసెంబ్లీ సమావేశాల్లో చెప్పాలని  జనసేన పార్టీ  పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ డిమాండ్ చేశారు.గురువారం జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నాదెండ్ల మాట్లాడుతూ..వైసీపీ ప్రభుత్వం సలహాదారులకు పెట్టిన ఖర్చు అక్షరాలా రూ.680 కోట్లని స్పష్టం చేశారు. ఇందులో ప్రధాన సలహాదారుడు  సజ్జల రామకృష్ణారెడ్డి కోసం పెట్టిన ఖర్చే రూ.140 కోట్లు అని.. ఇంత భారీగా ప్రజాధనాన్ని వెచ్చించి ఏర్పాటు చేసుకున్న ప్రభుత్వ సలహాదారులు ఈ ప్రభుత్వానికి ఇచ్చిన సలహాలు ఏమిటో.. ఆ సలహాల వల్ల తీసుకున్న నిర్ణయాలు, వాటి వల్ల అందిన అభివృద్ధి ఫలాలు.. అసలు ఎవరికి ఎంత మొత్తం ఖర్చు చేశారో ప్రభుత్వం శాసనసభ సమావేశాల్లో సమాధానం చెప్పి తీరాలని అన్నారు. సుమారుగా 89 మంది సలహాదారులు ఉన్నారని… ఈ ముఖ్యమంత్రికి తన ప్రభుత్వంలో సలహాదారులు ఎంత మంది ఉన్నారో, వారి పేర్లేమిటో కూడా తెలియదని ఎద్దేవా చేశారు. అసలు ఈ సలహాదారుల వివరాలను ప్రభుత్వం అత్యంత రహస్యంగా ఎందుకు ఉంచుతుందో కూడా బయటపెట్టాలని మనోహర్ కోరారు. 

కాగా ఇబ్బడిముబ్బడిగా, ఏ అర్హత లేకున్నా వైసీపీ ప్రభుత్వం నియమించిన సలహాదారుల విషయంలో ప్రభుత్వం మొదట్లోనే కేసును ఎదుర్కొందని  నాదెండ్ల గుర్తు చేశారు. సలహాదారుల సంఖ్య చూసి జిల్లా కలెక్టర్లకు కూడా సలహాదారులను నియమిస్తారేమో అని గౌరవ హైకోర్టు ఆశ్చర్యపోయిందన్నారు. సలహాదారులు కూడా ప్రజాసేవకు నియమితులైనవారే అనీ ..అంతా తగిన అర్హతలు ఉన్నవారినే నియమించామని కూడా తెలియజేసిందని తెలిపారు. ప్రభుత్వం ఆయా శాఖలవారీగా ఏ నిర్ణయం తీసుకున్నా, సలహాదారులను అడిగే తీసుకుంటున్నామని తెలిపిందని .. మరి ప్రభుత్వం వారి వివరాలను మాత్రం ఎందుకు బయటపెట్టలేదని నాదెండ్ల ప్రశ్నించారు.

 సలహాలతో తీసుకువచ్చిన పాలసీలు ఏమిటి?

సలహాదారులు సైతం ముఖ్యమంత్రిని, ప్రభుత్వ అధికారులను కలవలేని దౌర్భగ్య పరిస్థితి ఉందని  మనోహర్  ఆగ్రహం వ్యక్తం చేశారు.వైసీపీ నియమించిన సలహాదారుల్లో కొందరు రాజీపడలేని వ్యక్తులు ఉన్నారని.. వారు రాజీనామా చేసి వెళ్లిపోయారని చెప్పుకొచ్చారు. సుభాష్ గార్గ్,  రామచంద్రమూర్తి, జుల్ఫీ లాంటి వారు ఈ ప్రభుత్వంలో తమ సలహాలు ఎవరూ వినేవారే లేరని తెలుసుకొని వెళ్లిపోయారని వెల్లడించారు. అయితే వైసీపీ ప్రభుత్వంలో తమ అనుకున్న వారి కోసం వేతనాలు, వారి ఖర్చులు, ఇతర సిబ్బంది ఖర్చుల కోసం రూ.680 కోట్లు వెచ్చించారని.. వీరి ఇచ్చిన సలహాలు ఏమిటో, దాని వల్ల తీసుకున్న పాలసీలు ఏమిటో ప్రజలకు తెలియాల్సిన అవశ్యకత ఎంతైనా ఉందని మనోహర్ పేర్కొన్నారు.

Author

dhoni.raju219@gmail.com

Related Posts

Literature: Where Books Live, Civilization Breathes….

World Book Day: A home is not measured by its size, but by the books it holds. A society is not judged...

Read out all
dilip reddy

journalism: సత్యాన్వేషణలో 37ఏళ్లు…!

Journalism: జర్నలిజం అంటే కేవలం వృత్తి కాదు… అది ఒక బాధ్యత. ప్రజల తరఫున నిజాన్ని వెలికి తీయడం, అధికారాన్ని ప్రశ్నించడం, సమాజానికి దిశా నిర్దేశం చేయడం ఇవన్నీ కలగలిపిన...

Read out all

National: ప్రత్యామ్నాయంతోనే ఏకాభిప్రాయం…!

Delimitation: నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేష‌న్ అమలు – కీలకమైన ఈ రెండు అంశాల్లో ఏకాభిప్రాయం సాధన దేశంలో ఒక సవాల్‌గా తయారయింది. వీటితో ముడిపడి ఉన్న కొన్ని సున్నితాంశాల్లో...

Read out all

DacoitReview: A Visually Rich Emotional Thriller That Falls Slightly Short of Its Potential

Dacoit Movie Review:  Rating: 3.25/5 By Anrwriting/ Film critic  Story: Dacoit revolves around Hari Das (Adivi Sesh), a man from a marginalized...

Read out all

tollywood: ఐకాన్ స్టార్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన TFJA టీం…

Tollywood: హైదరాబాద్‌లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా (TFJA) సభ్యులు కలిసి ఆయనకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా TFJA ప్రతినిధులు 2026 సంవత్సరానికి...

Read out all

“Biker Review: Style Over Substance in This Racing Drama”

BikerMovie Review: Rating : (2.75/5) By Anrwriting /Film Critic In an era where sports dramas often rely on emotional depth to leave...

Read out all
Optimized by Optimole