×

మాచర్ల హింస ఘటనను ఖండిస్తున్నామన్నారు జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్. ఇది అప్రజాస్వామికని… ఈ ఘటనను ప్రజాస్వామికవాదులందరూ ఖండించాలన్నారు. ప్రజాస్వామ్యంలో రాజకీయపరమైన కార్యక్రమాలు చేసుకునే హక్కు అందరికీ ఉందన్నారు.అధికారాన్ని అడ్డుపెట్టుకుని దాన్ని అడ్డుకోవడం దారుణమని మండిపడ్డారు. వైసీపీ శాశ్వత అధికారం లక్ష్యంతో ఈ విధంగా ముందుకు వెళ్తోందని దుయ్యబట్టారు. ఘర్షణ వాతావరణం సృష్టించడం.. ప్రజల్ని భయబ్రాంతులకు గురి చేయడం.. ప్రైవేటు ఆస్తులపై, వ్యక్తులపై దాడులు చేయడం ఎంత మాత్రం సరి కాదని మనోహర్ తేల్చిచెప్పారు 

రైతుల్లో భరోసా నింపేందుకు సభ..

ఇక పోలీసులు ఇలాంటి ఘటనలను అడ్డుకోవాల్సిన ఆవసరం ఉందన్నారు. సత్తెనపల్లిలో  రైతు భరోసా సభ ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకే ప్రారంభించనున్నట్లు స్పష్టం చేశారు. రైతుల్లో  భరోసా నింపేందుకు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి.. పోలీసులు కూడా సహకరించాలని కోరుతున్నామన్నారు. గుంటూరు జిల్లాలో ఊహించిన దానికంటే కౌలు రైతుల ఆత్మహత్యలు అధికంగా ఉన్నాయన్నారు. సుమారు 280 మందికి పైగా కుటుంబాలకు చెక్కులు పంపిణీ చేయాల్సి ఉందని.. పల్నాడు ప్రాంతంలో ఆత్మహత్యలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టే ఆ ప్రాంతంలో కార్యక్రమం ఏర్పాటు చేశామని వెల్లడించారు.

సభను అడ్డుకునేందుకు కుట్రలు..

ఇదిలా ఉంటే.. రైతుల శ్రేయస్సు కోసం సభ పెడుతుంటే.. అప్పుడే కార్యక్రమాన్ని అడ్డుకునే ప్రయత్నాలు మొదలయ్యాయని ఆగ్రహాం వ్యక్తం చేశారు మనోహర్. జీపుల్లో వెళ్లొద్దు.. బస్సుల్లో వెళ్లొద్దు అంటూ ఆంక్షలు పెడుతున్నారన్నారు. లబ్దిదారుల్ని మభ్యపెట్టే కార్యక్రమాలు మొదలు పెట్టారన్నారు. జనసేన నుంచి  లక్ష తీసుకొంటే..   ప్రభుత్వం ఇచ్చే ఏడు లక్షలు పోతాయని వైసీపీ నేతలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. అన్ని జిల్లాల మాదిరి ఇక్కడ కూడా ప్రజల్ని మోసం చేసే కార్యక్రమాలు మొదలు పెట్టారన్నారు. గ్రామాల్లో రైతుల కుటుంబాలకు బెదిరింపులు కూడా మొదలైనట్టు తమ దృష్టికి వచ్చినట్లు మనోహర్ చెప్పుకొచ్చారు.

 

 

Author

dhoni.raju219@gmail.com

Related Posts

National: ప్రత్యామ్నాయంతోనే ఏకాభిప్రాయం…!

Delimitation: నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేష‌న్ అమలు – కీలకమైన ఈ రెండు అంశాల్లో ఏకాభిప్రాయం సాధన దేశంలో ఒక సవాల్‌గా తయారయింది. వీటితో ముడిపడి ఉన్న కొన్ని సున్నితాంశాల్లో...

Read out all

Telangana: ఇందిరమ్మ క్యాంటీన్లపై పీపుల్స్ పల్స్ నివేదిక…

Telangana: భూమ్మీద ‘పేదరికం’ ఏ రూపంలో ఉన్నా నిర్మూలించాలని, ‘ఆకలి’ అనే శబ్దానికి తావులేని ప్రపంచం ఏర్పడాలని ఐక్యరాజ్యసమితి (యూఎన్) కోరింది. కీలకమైన ఈ రెండంశాలనే ఒకటి, రెండుగా పేర్కొంటూ...

Read out all

politics: పుదుచ్చేరిలో ఎన్డీయేకు స్వల్ప ఆధిక్యం..!!

National: పుదుచ్చేరిలో ఏప్రిల్ 9వ తేదిన జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే స్వల్ప మెజారిటీతో అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నట్లు పీపుల్స్ పల్స్ రీసర్చ్ సంస్థ నిర్వహించిన ప్రీ పోల్...

Read out all

Telangana: విద్య, వైద్యంతోనే వికాసం…!!

Telangana: తెలంగాణ బడ్జెట్ ప్రతిపాదనల్లో విద్యకు ప్రాధాన్యతనిచ్చారు. ఇదే చొరవతో నిధుల కేటాయింపు కూడా జరిపి, అమలులో శ్రద్ద తీసుకుంటే రాష్ట్రంలో విద్యారంగం బాగుపడటానికి ఆస్కారం ఉంది. వైద్యరంగం మీద...

Read out all

Assam: అస్సాంలో హ్యాట్రిక్ దిశగా బీజేపీ..!!

Assam election: ఈశాన్య రాష్ట్రం, అస్సాంలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రజలు ఎటువైపు మొగ్గు చూపుతున్నారో ఇప్పటికే స్పష్టంగా తెలుస్తోంది. 2026 అసెంబ్లీ ఎన్నికలు మార్పు కోసం కాకుండా...

Read out all

HJDORA: వైవిధ్య కలపోత..!!

దిలీప్ రెడ్డి (సీనియర్ జర్నలిస్ట్): అది 1996 నవంబర్. అప్పటి CID చీఫ్ ఆఫీస్ డీజీపీ కార్యాలయ ప్రాంగణంలోనే, సుమారు ఇరవై అర్థచంద్రాకారపు మెట్ల పైన ఎంతో దర్జాగా, ఠీవీగా...

Read out all
Optimized by Optimole