హిందూ ఆలయాలను ,ఆస్తులను కాపాడాలి: భారతి స్వామి

సెక్యులర్, ప్రభుత్వ పథకాల కోసం హిందు ఆలయాల ఆదాయం నుంచి ఒక్క పైసా ఖర్చు చెయ్యెదన్నారు పుష్పగిరి పీఠాధిపతులు విద్యాశంకర భారతి స్వామి. ఆలయాల నిధులను హిందు దేవాలయాల కోసమే ఖర్చు చేయాలని ఈ విషయంలో ఏపీ ప్రభుత్వ పనితీరు బాగోలేదని ఆయన తెలిపారు. ఇక ఏపీలో ఆలయాల మీద జరుగుతున్న దాడులు, ఆస్తులను కాపాడేందుకు మాజీ న్యాయమూర్తి ఆధ్వర్యంలో కమిటీ వేయాలని భారతి స్వామి కోరారు. రాష్ట్రంలోని దేవాలయ పరిరక్షణ కోసం ప్రభుత్వం , పురావస్తు శాఖతో…

Read Full News

సీబీఎస్ఈ ర్యాంకర్ కథ వింటే మెచ్చుకోకుండా ఉండలేరు!

టెక్నాలజీ ఇంతగా అభివృద్ధి చెందిన కాలంలోనూ ఆడపిల్లలపై వివక్ష కొనసాగుతూనే ఉంది. పుట్టిపుట్టగానే ఎక్కడో ఓ చోట చెత్తకుండీల్లోనూ , నిర్మానుష ప్రాంతాల్లో పసికందులు దర్శనమిస్తున్న ఉదంతాలు కోకొల్లలు. మనిషి ముసుగులో దాగున్న మానవమృగాల ముప్పు చెప్పనవసరం లేదు. ఇలా చెప్పుకుంటే ఒకటేమిటి అనేక సంఘటనలు నిత్యం చూస్తుంటాం. అలా వివక్షకు గురైన బాలిక ఎన్నో అవమానాలు చీత్కారాలు ఎదుర్కొని సీబీఎస్ఇ ఫలితాల్లో సత్తాచాటింది. ఆమె కథను బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ వెలుగులోకి తెచ్చారు. ప్రస్తుతం…

Read Full News

రాజన్న రాజ్యం రావాలన్న షర్మిలకు ఎక్కడి నుంచి వచ్చిందీ ధైర్యం?

Nancharaiah merugumala senior journalist: ” ఇందిరమ్మ రాజ్యం ఊసెత్తకుండానే….మన దేశంలోనే రాజన్న రాజ్యం రావాలన్న షర్మిలకు ఎక్కడి నుంచి వచ్చిందీ ధైర్యం?” కాంగ్రెస్‌ ప్రతిపక్ష నేత డా.వైఎస్‌ రాజశేఖరరెడ్డి 2004 ఏప్రిల్‌–మేలో జరిగిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో మొదటిసారి (దేశంలోనే తొలిసారి) ‘ఇందిరమ్మ  రాజ్యం తీసుకొద్దాం’ అనే నినాదాన్ని విజయవంతంగా వాడుకున్న విషయం ఆయన కూతురు వైఎస్‌ షర్మిలకు తెలుసు. అలాగే 2023 నవంబర్‌–డిసెంబర్‌ తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో  పీసీసీ అధ్యక్షుడు ఎనుముల…

Read Full News

మహేశ్వరం నియోజకవర్గం అధికార టీఆర్ఎస్ లో కోల్డ్ వార్..!!

రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం లో అధికార పార్టీలోని విభేదాలు రచ్చకెక్కాయి. మంత్రి సబితా ఇంద్రారెడ్డి భూకబ్జాలను ప్రోత్సహిస్తున్నారని.. ఆపార్టీనేత తీగల కృష్ణారెడ్డి బహిర్గతంగా ఆరోపణలు చేశారు. కొన్నాళ్లుగా అంతర్గతంగా కొనసాగుతున్న విభేదాలు తీగల తాజా వ్యాఖ్యలతో బహిర్గతమయ్యాయి. తమ ప్రాంతం కోసం అవసరమైతే ఆమరణ నిరాహారదీక్ష చేస్తానని తీగల ప్రకటించడం తీవ్ర చర్చనీయాంశమైంది. మహేశ్వరం నియోజకవర్గంలో మంత్రి సబితా, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్టారెడ్డి వర్గాల మధ్య పచ్చిగడ్డి వేస్తే భగ్గుమనేలా పరిస్థితి తయారైంది. మీర్…

Read Full News

కామన్వెల్త్ గేమ్స్ లో ఫైనల్ చేరిన భారత మహిళల క్రికెట్ జట్టు..

కామన్వెల్త్ గేమ్స్‌_2022 లో భారత మహిళా క్రికెట్ జట్టు చరిత్ర సృష్టించింది. శనివారం అతిథ్య ఇంగ్లాండ్ తో జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్‌లో హర్మన్ సేన 4 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌ను ఓడించి ఫైనల్‌ కి చేరింది. దీంతో భారత్ కు మరో పతకం ఖాయమైంది. అంతకుముందు తొలుత టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన టీమిండియా 20 ఓవర్లలో 164 పరుగులు చేసింది. ఓపెనర్ స్మృతి మంధాన మెరుపు హాఫ్ సెంచరీతో అదరగొట్టింది. కేవలం 32 బంతుల్లో…

Read Full News

నాగ్ అశ్విన్ నిర్మాతగా ‘ జాతిరత్నాలు’

మొదటి చిత్రం ‘ఎవడే సుబ్రహ్మణ్యం’తో టాలీవుడ్ లో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు నాగ్ అశ్విన్. రెండో చిత్రం ‘మహానటి’తో ఏకంగా జాతీయ అవార్డు గెలుచుకొని దేశవ్యాప్తంగా క్రేజ్ సంపాదించుకున్నాడు. ఇక మూడో చిత్రం తన మామగారు అశ్వినిదత్ ప్రతిష్టాత్మక బ్యానర్ ‘వైజయంతి మూవీస్ బ్యానర్’ 100 వ చిత్రంగా రెబల్ స్టార్ ప్రభాస్తో తీస్తున్న విషయం తెలిసిందే. ‘బాహుబలి’ రెండు పార్టులు, ‘సాహో’తో ప్యాన్ ఇండియా హీరోగా పేరుతెచ్చుకున్న ప్రభాస్ తో అశ్విన్ కలయికలో…

Read Full News

భూమా అఖిల ప్రియకు బెయిల్ మంజూరు!

బోయినపల్లి కిడ్నాప్ కేసులో ప్రధాన నిందితురాలిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ శనివారం బెయిల్ పై విడుదలయ్యారు. ఆమెకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేస్తున్నట్లు కోర్టు తీర్పునిచ్చింది. 15 రోజులకొకసారి బోయినపల్లి స్టేషన్లో రిపోర్ట్ చేయాలని న్యాయమూర్తి ఆదేశించారు. అఖిల ప్రియ విడుదల సందర్భంగాచంచల్ గూడ జైలు వద్ద అనుచరులు ,కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలివచ్చారు. హఫిజిపేట భూవివాదానికి సంబంధించి ప్రవీణ్, సునీల్, నవీన్ ముగ్గురు సోదరులు కిడ్నాప్ కేసులో ఆమె…

Read Full News

ఎంపీ అరవింద్ పై దాడి కేంద్రం సీరియస్.. బీజేపీ నేతలు ఫైర్!

బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ పై దాడిని కేంద్రం సీరియస్ గా పరిగణిస్తోంది. కే్ంద్ర హోమంత్రి అమిత్ షా దాడిని ఖండించారు. నేరుగా అరవింద్ కి ఫోన్ చేసి ఘటన వివరాలను ఎంపీని అడిగి తెలుసుకున్నారు. అటు రాష్ట్ర బీజేపీ నేతలు దాడిని ఖండించారు. ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై ప్రశ్నిస్తే భౌతిక దాడులు చేయడం సిగ్గు చేటన్నారు బండిసంజయ్. బీజేపీకి వస్తున్న ఆదరణ తట్టుకోలేక దాడులకు దిగుతున్నారని ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. జగిత్యాల…

Read Full News

Hyderabad: మహా న్యూస్ ఛానల్ కార్యాలయం పై దాడి హేయం: టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్

హైదరాబాద్: మహా న్యూస్ ఛానల్ కార్యాలయం పై జరిగిన దాడిని టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ తీవ్రంగా ఖండించారు. మహా న్యూస్ నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ దాడిని ఆయన “హేయమైన చర్య”గా అభివర్ణించారు. మీడియా స్వేచ్ఛపై దాడి చేయడం అనేది ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమేనన్నారు. చానల్ కార్యాలయంపై కొందరు గుండాలు, రౌడీల మాదిరిగా దాడికి పాల్పడటం దుర్మార్గంగా అభివర్ణించారు. మీడియా సంస్థలపై భయభ్రాంతులు కలిగించే ప్రయత్నాలను ప్రజాస్వామ్యం సహించదన్నారు….

Read Full News
Optimized by Optimole