తెలంగాణలో బీజేపీకి అధికారం కలేనా…?

భారతీయ జనతా పార్టీ తెలంగాణలో అధికారంలోకి వచ్చేస్తున్నామని పగటి కలలుకంటూ క్షేత్రస్థాయిలో వాస్తవికతను పట్టించుకోవడంలేదు. రాష్ట్ర బీజేపీ ఢల్లీి హైకమాండ్‌కు ఎప్పటికప్పుడు నివేదికలు పంపుతున్నా ఢల్లీి పెద్దలు మాత్రం వాటిని పూర్తిగా విశ్వసించక ఆచితూచి అడుగులేస్తున్నారు. అందుకే రాష్ట్ర పార్టీతో సంబంధం లేకుండా పార్టీ అధిష్టానం రాష్ట్రంలో విడతలవారీగా అంతర్గత సర్వేలు నిర్వహిస్తూ రాష్ట్ర నాయకులను అప్రమత్తం చేస్తూన్నా ఇక్కడి లీడర్లు మాత్రం పగటికలలతో ఊహాలోకంలో ఉంటూ మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నారు. ఇటీవల రాష్ట్రానికి వచ్చిన పార్టీ…

Read More

అండర్ -19 ప్రపంచ కప్ విజేత భారత్..

అండర్ -19 ప్రపంచ కప్ లో భారత అమ్మాయిలు చరిత్ర సృష్టించారు. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) తొలిసారి నిర్వహించిన టీ 20 ప్రపంచ కప్ ఫైనల్లో.. క్రికెట్ పుట్టినిల్లు ఇంగ్లాండ్ పై గెలిచి భారత మహిళా క్రికెట్లో సరికొత్త అధ్యాయం లిఖించారు. అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన బ్రిటిష్ జట్టు 68 పరుగులకే కుప్పకూలింది. భారత్ బౌలర్లు నిప్పులు చెరిగే బంతులతో .. ఇంగ్లీష్ బ్యాట్స్ మెన్స్ ను ముప్పు తిప్పలు పెట్టారు. కెప్టెన్…

Read More

పాదయాత్రలో జగన్ పై లోకేష్ సెటైర్లు..

కుప్పం: ‘యువగళం ‘ రెండో రోజు పాదయాత్రలో భాగంగా నారా లోకేష్..సీఎం జగన్ పై సెటైర్లు పేల్చాడు. పెట్రోల్, డీజిల్ పై పన్ను బాదుడు లో ఏపి నంబర్1 స్ధానంలో ఉందన్న లోకేష్.. ఏపి కంటే కర్ణాటక లో క్వార్టర్ బాటిల్ 100 రూపాయిలు తక్కువన్నారు.విషం కంటే ప్రమాదకరమైన జగన్ లిక్కర్ తాగితే డైరెక్ట్ పైకి పోవడమేనని ఎద్దేవ చేశారు. నిత్యావసర సరుకుల ధరలు పెరిగిపోవడంతో .. ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారని లోకేష్ ఆవేదన వ్యక్తం…

Read More

ప్రచారంలో Hindutva ను దాటిపోతున్న Hindenburg..

Nancharaiah merugumala 🙁 senior journalist) ================== H (ఎచ్/హెచ్) తో మొదలయ్యే మాటల్లో Hindutva తర్వాత ఇప్పుడు భారతదేశంలో పెద్ద స్థాయిలో ప్రాచుర్యం పొందుతున్న మాట Hindenburg (హిండన్ బర్గ్). జర్మన్ సంస్థకు చెందిన ఎయిర్ షిప్ హిండన్ బర్గ్ (1937 ప్రమాదంలో అమెరికా న్యూజెర్సీలో కూలిపోయింది) పేరుతో అమెరికాకు చెందిన నాథన్ (నేట్) ఆండర్సన్ స్టాక్ మార్కెట్ పరిశోధనా సంస్థ నెలకొల్పి, ప్రపంచం కుబేరుల్లో మూడో స్థానం సంపాదించిన భారత బిలియనీర్ గౌతమ్ ఆదానీ…

Read More

గాంధీజీ హంతకులకున్న అభిమానులు రాజీవ్‌ని చంపినోళ్లకు లేరు..

Nancharaiah merugumala:(senior journalist) =========== గాంధీజీ హంతకులకున్న అభిమానులు రాజీవ్‌ని చంపినోళ్లకు లేరు..  ఖూనీ చేసినోళ్ల ప్రాంతం, కులం, మతం, రాజకీయ సిద్ధాంతాలే కీలకం.. మోహన్‌ దాస్‌ గాంధీ కన్నుమూసి రేపటికి 75 ఏళ్లు. గుజరాతీ మహాత్ముడిని చంపిన మరాఠీ హంతకుడు నాథూరామ్‌ గోడ్సేను దిల్లీలో గాంధీజీని హత్యచేసిన స్థలంలోనే పట్టుకున్నారు. కోర్టు విచారణ తర్వాత 1949 నవంబర్‌ 15న అతన్ని ఉరితీశారు. ఇప్పటి హరియాణాలోని అంబాలా జైలులో శిక్ష అమలు చేశారు. స్వతంత్ర భారతదేశంలో తొలి…

Read More

‘యువ గళం ‘ పాదయాత్రకు అపూర్వ స్పందన..

కుప్పం: కుప్పంలో నారా లోకేష్ ‘ యువ గళం ‘ పాదయాత్ర రెండో రోజు దిగ్విజయంగా సాగింది. యాత్రకు మద్దతుగా.. రైతులు, విద్యార్దులు,యువత అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో లోకేష్ మాట్లాడుతూ..వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారు. రైతులు పండించిన పంటలకు కనీస గిట్టుబాటు ధర దక్కడం లేదని ఆవేదన వ్యక్తంచేశారు. ఆరుగాలం శ్రమించి పండించిన టొమాటో లు రోడ్ల మీద పారబోసే పరిస్థితి దాపురించందన్నారు.ఎరువులు ధరలు పెరిగిపోయాయి..డ్రిప్ ఇరిగేషన్ పథకాన్ని ఎత్తేసారు…..

Read More

కెసిఆర్ హామీలన్నీ నెరవేర్చారు: మంత్రి జగదీష్ రెడ్డి

సూర్యాపేట: ఎనిమిదేళ్ళ పాలన లో సీఎం కేసీఆర్.. ఇచ్చిన హామీలన్ని నెరవేర్చారని మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. సూర్యాపేట క్యాంపు కార్యాలయంలో కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారాక్ చెక్ ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి.. నియోజకవర్గ వ్యాప్తంగా 424 మంది లబ్దిదారులకు, 4కోట్ల 24 లక్షల చెక్ లను పంపిణీ చేశారు. తెలంగాణ తరహా అభివృద్ది దేశ వ్యాప్తం చేయడానికే టీ.ఆర్.ఎస్ పార్టీ.. బీఆర్ఎస్ గా మారిందన్నారు. కళ్యాణ లక్ష్మి కోసం ఇప్పటి వరకు…

Read More

కలశాన్ని ఎందుకు పూజించాలి?

  కలశము అంటే ఏమిటి? నీటితో నిండిన ఇత్తడి లేక మట్టి లేక రాగి పాత్ర; పాత్ర మొదట్లో మామిడి ఆకులు; వాటి పైన కొబ్బరి కాయ ఉంచబడుతుంది. తెలుపు లేక ఎరుపు దారం దాని మెడ చుట్టూ లేక పూర్తిగా కానీ సమ చతురస్రాకారపు నమూనాలో చుట్టబడి ఉంటుంది. అటువంటి పాత్ర “కలశం” అనబడుతుంది. ఆ పాత్రను నీటితో గానీ బియ్యముతో గానీ నింపినప్పుడు “పూర్ణకుంభము” అనబడుతుంది. అది దివ్యమైన ప్రాణశక్తితో నింపబడిన జడ శరీరానికి…

Read More

అభినవ సత్యభామ ఇక లేరు…

మాజీ ఎంపి, బిజెపి నాయకురాలు..తెలుగు చలనచిత్ర రంగంలో అభినవ సత్యభామగా పేరొందిన సీనియర్ నటి జమున ఇక లేరు. వయసు రీత్యా హైదరాబాద్ లోని ఆమె స్వగృహంలో  శుక్రవారం ఉదయం తుదిశ్వాస విడిచారు.ఆమె మృతి పట్ల.. అభిమానులు  ప్రముఖులు..నటులు..రాజకీయ నాయకులు సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలిపారు. స్వస్థలం.. అందం.. అభినయం..నటనతో జనహృదయాలను గెలుచుకున్న జమున స్వస్థలం కర్ణాటక. ఆమె 1936 ఆగష్టు 30న హంపీలో పుట్టింది. ఆమె తల్లితండ్రులు నిప్పని శ్రీనివాసరావు, కౌసల్యాదేవి. సినిమాల్లోకి రాకముందు..గుంటూరు…

Read More

తమిళ గమళ్ల గవర్నర్‌ తో గొడవ తెలంగాణ వెలమ సమాజానికి అరిష్టమేమో!

Nancharaiah merugumala: (senior journalist) ……………………………………………………. తమిళ గమళ్ల (నాడార్‌ లేదా ఈడిగ లేదా గౌడ) కుటుంబంలో జన్మించిన తెలంగాణ గవర్నర్‌ డాక్టర్‌ తమిళిసై సౌందరరాజన్‌ తో గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావు గారు పదే పదే ఘర్షణకు దిగుతున్నారు. కాంగ్రెస్‌ కుటుంబం నుంచి వచ్చిన బీజేపీ గవర్నర్‌ తమిళిసై. మొదటి నుంచీ కాషాయంతో సంబంధంలేకున్నా తర్వాత ఆ పార్టీలో చేరిన మంచి డాక్టర్‌ (గైనకాలజిస్ట్‌ ఆమె). ఆమె రాజ్యపాల్‌ గా హైదరాబాద్‌ వచ్చి మూడేళ్లు…

Read More
Optimized by Optimole