ప్రభాస్ ‘రాధేశ్యామ్ ‘ నుంచి మరో ట్రైలర్!
రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా పాన్ ఇండియా చిత్రం ‘రాధేశ్యామ్’. అనివార్య కారణాల వలన విడుదల వాయిదా పడుతూ వస్తున్న ఈ చిత్రం ఎట్టకేలకు మార్చి 11న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో చిత్ర యూనిట్ ప్రమోషన్లనూ వేగవంతం చేసింది. ఇందులో భాగంగానే మరో ట్రైలర్‌ను విడుదల చేసేందుకు సిద్ధమైంది చిత్రబృందం. నేడు మధ్యాహ్నం 3గంటలకు రెండో ప్రచార చిత్రాన్ని విడుదల చేయనుంది. ఈ విషయం తెలియడంతో ప్రభాస్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు….
బౌలర్లపై కోట్లాభిషేకం!
చెన్నై వేదికగా జరుగుతున్న ఐపీఎల్ వేలంలో గురువారం పలు ఆసక్తికర చిత్రాలు చోటుచేసుకున్నాయి. ఒక జట్టు వద్దనుకున్న ఆటగానికి ఐపీఎల్ చరిత్రలో రికార్డు డేట్ పలకగా.. ఇంకో జట్టు విడిచి పెట్టేసిన ఆటగాడికి రెండు మిలియన్ డాలర్లు.. అసలు ఐపీఎల్ ముఖం చూడని కొత్త ఆటగాళ్లు భారీ రేటు పలకగా.. భారీ రేటు పలుకుతుందనుకున్నా ఆటగాళ్లు నామమాత్రం ధర.. కొందరు స్టార్ ఆటగాళ్లకు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. ఐపిఎల్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా బౌలర్ల కోసం…
ఇండియన్ ఐడల్_12 వ సీజన్ విన్నర్ పవన్ దీప్ రాజన్!
సంగీత ప్రియుల్ని అలరించే పాపులర్ మ్యూజికల్ షో ఇండియన్ ‘ఐడల్ సీజన్ 12’ విజేతగా పవన్‌దీప్ రాజన్ నిలిచాడు. మన తెలుగు అమ్మాయి షణ్ముఖ ప్రియ ఆరో స్థానంలో నిలిచింది.ఎన్నో ఆశలతో ఫైనల్ పోరుకు చేరిన షణ్ముకప్రియకు నిరాశే ఎదురైంది. తన అద్భుతగానంతో సంగీత ప్రపంచాన్ని మెప్పించిన ఫైనల్ విజేత పవన్‌దీప్ రాజన్‌కు రూ. 25 లక్షల చెక్‌ను అందజేశారు. కాగా 12 గంటల పాటు నిర్విరామంగా సాగిన ఫైనల్ పోటీ ఆద్యంతం తీవ్ర ఉత్కంఠ రేపింది.మధ్యాహ్నం…
టాలీవుడ్ ప్రముఖ నటుడు మృతి..!
తెలుగు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ ప్రసిద్ధి చెందిన రాజబాబు కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నా ఆయన గత రాత్రి మృతి చెందారు. 64 సంవత్సరాల రాజబాబు 62 సినిమాల్లో నటించి మంచి పేరు పొందారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. రాజబాబు స్వస్థలం తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం మండలంలోని నరసరావుపేట. చిన్నటప్పటి నుంచే నటనపై మక్కువ పెంచుకున్న ఆయన దేశవ్యాప్తంగా నాటక ప్రదర్శనలు ఇచ్చారు. 1995లో ఊరికి మొనగాడు సినిమాతో…
2047 నాటికి ఆర్థికంగా అభివృద్ధి చెందిన దేశంగా ‘‘భారత్’’: బండి సంజయ్
తెలంగాణ రాష్ట్రాన్ని దివాళా తీయించి.. ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబం మాత్రం వేల కోట్ల ఆస్తులు సంపాందించిందని బీజేపీ స్టేట్ చీఫ్ ఎంపీ బండి సంజయ్ ఆరోపించారు. సీఎం కేసీఆర్ కు నిజంగా చిత్తశుద్ధి ఉంటే… 2014కు ముందు కుటుంబ ఆస్తులెన్ని? అధికారంలోకి వచ్చాక సంపాదించిన ఆస్తులెన్ని? వివరాలపై రాబోయే అసెంబ్లీ సమావేశాలకు ముందే శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. 2014 నాటి రాష్ట్ర ఆర్దిక పరిస్థితి, నేటి ఆర్దిక పరిస్థితి, తీసుకొచ్చిన అప్పులు, వాటిని…
మాచర్ల ఘటనను ఖండిస్తున్నా : నాదెండ్ల మనోహర్
మాచర్ల హింస ఘటనను ఖండిస్తున్నామన్నారు జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్. ఇది అప్రజాస్వామికని… ఈ ఘటనను ప్రజాస్వామికవాదులందరూ ఖండించాలన్నారు. ప్రజాస్వామ్యంలో రాజకీయపరమైన కార్యక్రమాలు చేసుకునే హక్కు అందరికీ ఉందన్నారు.అధికారాన్ని అడ్డుపెట్టుకుని దాన్ని అడ్డుకోవడం దారుణమని మండిపడ్డారు. వైసీపీ శాశ్వత అధికారం లక్ష్యంతో ఈ విధంగా ముందుకు వెళ్తోందని దుయ్యబట్టారు. ఘర్షణ వాతావరణం సృష్టించడం.. ప్రజల్ని భయబ్రాంతులకు గురి చేయడం.. ప్రైవేటు ఆస్తులపై, వ్యక్తులపై దాడులు చేయడం ఎంత మాత్రం సరి కాదని…
ఉద్ధవ్ ఠాక్రే రాజీనామా.. సీఎంగా ఫడ్నవీస్?
ఊహించినట్లగానే మహారాష్ట్ర రాజకీయ సంక్షోబానికి తెరపడింది. బలపరీక్షకు ముందే సీఎం పదవికి ఉద్ధవ్ ఠాక్రే రాజీనామా చేశారు. గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీ నిర్ణయంపై సుప్రీంకోర్డు వెళ్లిన శివసేనకు ఎదురుదెబ్బతగిలింది. ఎట్టి పరిస్థితుల్లోనూ మహారాష్ట్ర అసెంబ్లీలో బలపరీక్ష జరగాల్సిందేనని ధర్మాసనం తీర్పు వెలువరించిన.. క్షణాల్లోనే సోషల్ మీడియా వేదికగా ఠాక్రే తన రాజీనామా ప్రకటించారు. ఎమ్మెల్సీ పదవికి సైతం తాను రాజీనామా చేస్తున్నట్లు స్పష్టం చేశారు. ఇన్నాళ్లు సహకరించిన సోనియాగాంధీ, శరద్ పవర్ కి ప్రత్యేకంగా కృతజ్ఞతలు…
