వైసీపీ గాడిదలు ఓండ్ర పెడతాయి: జనసేన పవన్

సత్తెనపల్లి కౌలు రైతు భరోసా యాత్ర సభలో జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్..రైతుల పట్ల వైసీపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న ధోరణిని ఎండగట్టారు. ‘రైతులు అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకొంటున్నారని.. ప్రకృతి విపత్తుల వల్ల నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. కష్టాల్లో ఉన్నాం ఆదుకోండి అంటే వైసీపీ గాడిదలు ఓండ్ర పెడతాయన్నారు. వైసిపి నేతలు.. ప్రజల సమస్యల్ని గాలికొదిలేసి..వారాహి రంగేమిటి?టైర్లు ఎలా ఉన్నాయి? ఎత్తు ఎంత? అంటూ మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు అధికారం రాని కులాలకు…

Read More

Rahul Gandhi: ‘అమ్మ ఒడి’ రాయ్‌ బరేలీయే రాహుల్ కి అత్యంత సురక్షిత స్థానం..

Nancharaiah merugumala senior journalist: అమెఠీలో గుజరాతీ పార్శీల కోడలు స్మృతి చేతిలో రెండోసారి ఓడిపోవడం మరో పార్శీ ప్రముఖుడు ఫిరోజ్‌ గాంధీ మనవడు రాహుల్‌ కు ఇబ్బందికరమే మరి.. ‘అమ్మ ఒడి’ రాయ్‌ బరేలీయే అత్యంత సురక్షిత స్థానం ఒక గుజరాతీ జొరాస్ట్రియన్‌ (జుబిన్‌ ఇరానీ) భార్య స్మృతి ‘మల్హోత్రా’ ఇరానీ చేతిలో వరుసగా రెండోసారి బాబాయి ఒరిజినల్‌ సీటు అమేఠీలో ఓడిపోవడం ఎందుకో కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీకి ఇష్టం లేదనుకుంటా. తొలి ప్రధాని…

Read More

మూడు సార్లు పెళ్లి చేసుకుందాామనుకున్నా..దేవుడు రక్షించాడు: సుస్మితా సేన్

బాలీవుడ్ నటి సుస్మితా సేన్ పెళ్లి గురించి ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేసింది. జీవితంలో కొంతమంది వ్యక్తులు మనసుకు దగ్గరగా అనిపించారు. వారితో బంధం పెళ్లి పీటల వరకూ వెళ్లింది. అదృష్టవశాత్తూ దేవుడి దయవల్ల పెళ్లి నుంచి తప్పించుకున్నాను అంటూ సుస్మిత సేన్ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. ట్వీక్ ఇండియా ది ఐకాన్స్ ప్రోగ్రాంలో భాగంగా ట్వింకిల్ ఖన్నా అడిగిన ప్రశ్నలకు సుస్మితా సమాధానమిస్తూ.. అదృష్టవశాత్తూ జీవితంలో ఇంట్రెస్టింగ్ వ్యక్తులను కలుసుకున్నాను.. నేను పెళ్లికి…

Read More

ఏపీ రాజకీయాల్లో మార్పు కోసం పవన్ యాత్ర: నాదెండ్ల మనోహర్

Janasenavarahi: ఏపీ రాజకీయాల్లో మార్పు కోసం… ఓ నూతన అధ్యాయం నిర్మాణం కోసం… ప్రజా సమస్యలపై బలమైన పోరాటం చేసేందుకు వారాహి యాత్రను జనసేన అధ్యక్షులు  పవన్ కళ్యాణ్  జూన్ 14వ తేదీన నుంచి ప్రారంభించబోతున్నారని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. మంగళగిరిలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా  మనోహర్ మాట్లాడుతూ ‘‘సకల శుభాలనిచ్చే అన్నవరం సత్యదేవుడి దర్శనం…

Read More

పీపుల్స్‌ పల్స్‌ ఎక్స్ క్లూజివ్.. ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్‌దే హవా..!

ఛత్తీస్‌గఢ్‌లో ముఖ్యమంత్రి భూపేష్‌ భఘేల్‌ నేతృత్వంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం వరుసగా రెండోసారి  అధికారంలోకి వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి. కాంగ్రెస్‌ ప్రభుత్వం పనితీరుతో రాష్ట్ర ప్రజలు సంతృప్తిగా ఉండడంతో పాటు భూపేష్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిర్మాణాత్మక పాత్ర పోషించడంలో బీజేపీ విఫలమవడంతో రాష్ట్రంలో మరోసారి కాంగ్రెస్‌ సర్కారు ఏర్పాటు ఖాయంగా కనిపిస్తోంది. బీజేపీలో అంతర్గత కలహాలు, భూపేష్‌కు ప్రత్యామ్నాయంగా పార్టీ నాయకుడిని తెరమీదకు తేవడంలో కేంద్ర బీజేపీ విఫలమవడంతోపాటు రాష్ట్ర పార్టీపై అధిష్టానానికి  పట్టు సడలడం వంటి…

Read More

Telangana: పంద్రాగస్టులోపు రూ.2 లక్షల రుణమాఫీ పెద్ద బోగస్: బండి సంజయ్

BjpTelangana:  ‘‘వంద రోజుల్లో 6 గ్యారంటీలను అమలు చేస్తామని హామీలిచ్చి అధికారంలోకి వచ్చాక మోసం చేసిన కాంగ్రెస్ పార్టీ మళ్లీ ఎన్నికలు రావడంతో ‘ఇప్పుడు ఓటేయండి. ఆగస్టు 15లోపు రూ. 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పడం పెద్ద బోగస్’’ అని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ అని మండిపడ్డారు. ‘‘రైతులు ఆరుగాలం పండించిన వడ్లకు రూ.500 బోనస్ కూడా ఇవ్వలేనోడు… తాలు, తరుగు, తేమ లేకుండా వడ్లు కొనలేనోడు.. ఏకంగా…

Read More

Telangana: పార్టీ ఫిరాయింపులపై ప్లేటు ఫిరాయిస్తున్న కాంగ్రెస్‌..!

Telangana politics: ప్రజలు ఒక పార్టీని గద్దె దించారంటే అది చేసిన అనేక తప్పిదాలు కారణాలవుతాయి. వారి స్థానంలో అధికారం చేపట్టిన పార్టీ ఆ పొరపాట్ల నుండి గుణపాఠాలు నేర్చుకొని వాటిని పునరావృతం చేయకుండా పాలిస్తే ప్రజాదరణ పొందుతారు. అలాకాక వారికంటే మేము నాలుగు ఆకులు ఎక్కువే తిన్నామంటూ ప్రత్యర్థులు నడచిన ప్రజావ్యతిరేక అడుగుజాడల్లోనే నడుస్తామంటే వీరిపై కూడా ప్రజాభిప్రాయం మారడం ఖాయం. పదేళ్ల కేసీఆర్‌ పాలనకు వ్యతిరేకంగా తీర్పు ఇచ్చిన తెలంగాణ ప్రజలు రేవంత్‌ సర్కారును అందలమెక్కిస్తే, కాంగ్రెస్‌ ఇప్పుడు బీఆర్‌ఎస్‌ విడిచిన చెప్పులనే వేసుకుంటూ, వారి బాటలోనే నడుస్తోంది. తెలంగాణలో కేసీఆర్‌కు ఓటర్లు రెండు సార్లు స్పష్టమైన మోజార్టీతో అధికారం అప్పగించినా విపక్షమే లేకుండా అంతా తానై పాలించాలనే ఆలోచనలతో ఆయన ప్రత్యర్థి పార్టీలను నిర్వీర్యం చేయాలని చూశారు. 2014లో 63 సీట్లతో బీఆర్‌ఎస్‌ను గెలిపించిన ప్రజలు 2018లో మరో 25 స్థానాల్లో అదనంగా గెలిపించి 88 సీట్లు కట్టబెట్టినా కేసీఆర్‌ సంతృప్తి చెందకుండా, ప్రతిపక్షం లేకుండా చేయాలనే ఉద్ధేశంతో వంద స్థానాల మార్కు దాటాలని లక్ష్యంగా పెట్టుకొన్నారు. ప్రజాతీర్పుకు భిన్నంగా ప్రతిపక్ష పార్టీల నుండి గెలిచిన ఎమ్మెల్యేలను తన పార్టీలో చేర్చుకునే కుట్రకు కేసీఆర్‌ తెరదీశారు. ప్రజాప్రతినిధులతో రాజీనామా చేయించి తమ పార్టీ తరఫున గెలిపించుకొని ప్రజాక్షేత్రంలో వారి బలాన్ని నిరూపించుకుంటే ఎలాంటి వివాదాలుండేవి కావు. కేసీఆర్‌ ఇందుకు భిన్నంగా చట్టంలోని లొసుగులను అనుకూలంగా మల్చుకొని 2018 తరువాత గంపగుత్తగా ప్రతిపక్ష ఎమ్మెల్యేలను బీఆర్‌ఎస్‌లో చేర్చుకున్నారు. పాలక పార్టీలో చేరితే నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేసుకోవచ్చనే నెపంతో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు అధికారాన్ని అనుభవించారు. కొందరికి మంత్రి హోదా కూడా దక్కింది   బీఆర్‌ఎస్‌ చేసిన ప్రజావ్యతిరేక కార్యకలాపాలను లెక్కపెట్టుకున్న ప్రజలు సరైన సమయంలో సరైన తీర్పు ఇస్తూ ఆ పార్టీని ఓడిరచారు. ఆ అనుభవాలతో జాగ్రత్త పడాల్సిన రేవంత్‌ సర్కారు అందుకు భిన్నంగా పావులు కదుపుతోంది. అసెంబ్లీలో సంపూర్ణ మెజార్టీ కలిగున్న రేవంత్‌ సర్కారు అవసరం లేకపోయినా లోగడ తమను ఇబ్బంది పెట్టిన కేసీఆర్‌పై కక్ష తీసుకోవాలనే ఏకైక లక్ష్యంతో సాగుతోంది.  బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు దానం నాగేందర్‌, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావులను ఇప్పటికే పార్టీలో చేర్చుకున్న కాంగ్రెస్‌ మరింత మంది ఎమ్మెల్యేల వలసలను ప్రోత్సహించేందుకు ప్రయత్నిస్తోంది. బీఆర్‌ఎస్‌ను నిర్వీర్యం చేసేందుకు ఆ పార్టీలోని మెజార్టీ ఎమ్మెల్యేలను చేర్చుకొని న్యాయపరమైన చిక్కులు రాకుండా విలీనాన్ని సంపూర్ణం చేయాలని కాంగ్రెస్‌ అడుగులేస్తోంది. అధికారంలో ఉండి ఏమి చేసినా చెల్లుబాటయినా, ప్రజా కోర్టులో మాత్రం శిక్ష తప్పదు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల చరిత్రను చూస్తే ఈ విషయం స్పష్టం అవుతోంది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఫిరాయించిన 14 మంది ఎమ్మెల్యేలకు బీఆర్‌ఎస్‌ తిరిగి టికెట్లిస్తే వారిలో మహేశ్వరంలో సబితా ఇంద్రారెడ్డి, ఎల్బీనగర్‌లో సుధీర్‌ రెడ్డి మాత్రమే గెలవగా మిగతా 12 మంది ఓడిపోయారు. అధికార దాహంతో ఫిరాయించే ఎమ్మెల్యేలతో పార్టీలో గ్రూపు రాజకీయాలకు నాందిపలికినట్టేనని గతనుభవాలే నిరూపిస్తున్నాయి. లోగడ కాంగ్రెస్‌ నుండి బీఆర్‌ఎస్‌లో చేరిన ఎమ్మెల్యేలతో సదరు నియోజకవర్గాల్లో ఆధిపత్య పోరు కేసీఆర్‌ సర్కారు పుట్టిముంచాయి….

Read More

కారు స్పీడును అందుకోగలరా?

Telanganapolitics: తెలంగాణ అసెంబ్లీకి త్వరలో జరగనున్న ఎన్నికల రణరంగానికి  రాజకీయ పార్టీలు అసెంబ్లీ సమావేశాల వేదికగా అస్త్రాలను సిద్ధం చేసుకున్నాయి. బరాబర్‌ మళ్లీ తామే అధికారంలోకి వస్తామని, ఇప్పుడున్న వాటికంటే ఏడెనిమిది సీట్లు ఎక్కువగానే గెలుస్తామని సీఎం కేసీఆర్‌ ఆత్మవిశ్వాసంతో ప్రకటిస్తే, బీఆర్‌ఎస్‌కు భంగపాటు తప్పదని ఆ పార్టీ పాతిక సీట్లను మించి గెలవదని టిపిసిసి చీఫ్‌ రేవంత్‌ రెడ్డి ఉత్తరకుమార ప్రగల్భాలు పలుకుతున్నారు. గోల్కొండపై కాషాయ జెండా ఎగురవేస్తామని బీజేపీ చెబుతుంటే ఆ పార్టీ ఎమ్మెల్యే…

Read More
Optimized by Optimole