ఐపీఎల్ _15వ సీజన్ షెడ్యూల్ విడుదల..

క్రికెట్​ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఐపీఎల్​ 2022 షెడ్యూల్​నూ బీసీసీఐ ప్రకటించింది. మార్చి 26న మొదలై మే 29న జరిగే ఫైనల్​తో ఐపీఎల్​ 15వ సీజన్​ ముగియనుంది. తొలి మ్యాచ్లో డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ తో కోలకతా జట్టు తలపడనుంది. 65 రోజుల పాటు సాగే ఈ సీజన్​లో 70 లీగ్‌మ్యాచ్‌లు, 4 ప్లే ఆఫ్‌మ్యాచ్‌లు జరగనున్నాయి. ప్లేఆఫ్స్​కు సంబంధించిన షెడ్యూల్​ను బీసీసీఐ త్వరలో ప్రకటించనుంది. ఇక ఈ సారి లఖ్​నవూ, గుజరాత్​ జట్ల…

Read More

‘రాధే శ్యామ్’ ఫస్ట్ రివ్యూ.. సినిమా ఎలా ఉందంటే ?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం రాధేశ్యామ్. పూజా హెగ్డే కథానాయిక. జిల్‌ ఫేం రాధాకృష్ణ కుమార్‌ దర్శకుడు. గోపికృష్ణ మూవీస్,యువీ క్రియేషన్స్ సంయుక్తంగా సుమారు రూ. 300కోట్లతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. పీరియాడికల్‌ బ్యాక్‌డ్రాప్‌గా తెరకెక్కిన ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికీ విడుదలైన టీజర్ ట్రైలర్ కూ అంతటా అపూర్వ స్పందన లభిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా ఈ నెల 11న విడుదల కాబోతున్న రాధే శ్యామ్ కోసం ప్రేక్షకుల ఎంతో…

Read More

ప్రపంచ కప్ లో బోణీ కొట్టిన మిథాలీ సేన..

ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్‌లో భారత జట్టు బోణీ కొట్టింది. ఆదివారం పాకిస్థాన్‌తో జరిగిన తొలి మ్యాచ్లో మిథాలిసేన 107 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. 245 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాక్ జట్టు 137 పరుగులకు ఆలౌటైంది. ఆ జట్టులో ఓపెనర్‌ సిద్రా అమీన్‌ (30; 64 బంతుల్లో) టాప్‌ స్కోరర్‌గా నిలిచింది. భారత బౌలర్లలో రాజేశ్వరి నాలుగు.. ఝులన్‌ గోస్వామి, స్నేహ్‌ రాణా రెండేసి వికెట్లు తీశారు. అంతకుముందు టాస్ గెలిచి…

Read More

శ్రీలంకతో తొలి టెస్టులో భారత్ ఘనవిజయం..!

శ్రీలంకతో తొలి టెస్ట్​లో భారత్​ ఘన విజయం సాధించింది. ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా విజృభించడంతో.. తొలి ఇన్నింగ్స్​లో 174 పరుగులకే కుప్పకూలిన లంక జట్టు ఫాలో ఆన్​లోనూ చతికిలపడింది. రెండో ఇన్నింగ్స్ లో భారత స్పిన్ ద్వయం జడేజా, అశ్విన్ ధాటికి ఆజట్టు 178 పరుగులకే కుప్పకూలింది. ఫలితంగా భారత జట్టు ఇన్నింగ్స్ 222 పరుగుల తేడాతో భారీ విజయాన్ని అందుకుంది. దీంతో రెండు టెస్టుల సిరీస్ లో 1_0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. అంతకుముందు తొలుత…

Read More

దేశంలో క్రమంగా తగ్గుముఖం పడుతున్న కరోనా!

దేశంలో కరోనా క్రమంగా తగ్గుముఖం పడుతోంది. తాజాగా గడిచిన 24 గంటల్లో 5 వేల 476 కరోనా కేసులు నమోదయ్యాయి. వైరస్ కారణంగా 158 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం 59 వేల 442 కేసులు యాక్టివ్‌గా ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. పాజిటివిటీ రేటు 0.60 శాతంగా ఉంది. ఇక గడిచిన 24 గంటల్లో 9 వేల 754 మంది మహమ్మారి నుంచి కోలుకున్నారు. వీరితో కలిపి కోలుకున్న వారి సంఖ్య 4,23,88,475 కి…

Read More

అరుదైన రికార్డు సొంతం చేసుకున్న కెప్టెన్ మిథాలీ రాజ్..

భారత మహిళల క్రికెట్ జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్ మరో అరుదైన రికార్డ్ సొంతం చేసుకుంది. ఆరు వరల్డ్ కప్ లు ఆడిన తొలి మహిళా క్రికెటర్‌గా మిథాలీ రాజ్‌ రికార్డు సృష్టించింది. ఇంతకుముందు సచిన్‌ టెండూల్కర్‌, జావెద్‌ మియాందాద్‌ మాత్రమే ఈ ఘనతను అందుకున్నారు. కాగా ఆమె ఇప్పటికే 2000, 2005, 2009, 2013, 2017 వరల్డ్‌కప్‌లలో ఆడింది. ప్రస్తుతం నేడు పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో బరిలోకి దిగిన ఆమె.. ఆరు వరల్డ్‌కప్‌ల అరుదైన రికార్డును సొంతం…

Read More

అపరేషన్ గంగా వేగవంతం !

కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ గంగ వేగవంతం చేసింది. ఉక్రెయిన్, రష్యా వార్ నేపథ్యంలో ఫిబ్రవరి 22న ప్రారంభమైన ఈ ఆపరేషన్ తరలింపు ప్రక్రియ.. ప్రత్యేక పౌర విమానాల ద్వారా ఇప్పటివరకు 6 వేల 200 మంది భారతీయ పౌరులను తిరిగి తీసుకువచ్చినట్లు కేంద్రం వెల్లడించింది. అంతేకాక రాబోయే 24 గంటల్లో మరో 18 విమానాలు షెడ్యూల్ చేయడం జరిగిందని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చి తెలిపారు. అటు నలుగురు కేంద్ర మంత్రులు హర్దీప్…

Read More

నాగ శ్రీనుకు మెగా బ్రదర్ ఆర్థిక సాయం!

మెగా బ్రదర్ నాగబాబు మరోసారి తన మానవత్వాన్ని చాటుకున్నారు. మంచు విష్ణు కార్యాలయంలో దొంగతనానికి పాల్పడ్డాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న హెయిర్ డ్రెస్సర్ నాగశ్రీను కుటుంబ పరిస్థితిని తెలుసుకొని రూ. 50 వేల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. అంతేకాక అతని పిల్లలకు వైద్య పరీక్షలు చేయిస్తానని హామీ ఇచ్చారు. అటు నాగబాబు సాయాన్ని మంచు ఫ్యామిలీ తీవ్రంగా పరిగణిస్తున్నట్లు తెలుస్తోంది. ‘‘ప్రతి నెల నాగ శ్రీనుకు కరెక్ట్‌గానే శాలరీ డిపాజిట్ చేయడం జరిగిందని.. గత నెల కూడా శాలరీ…

Read More

ఐసీసీ ర్యాంకింగ్స్.. తొలిసారి టాప్ 20 లోకి శ్రేయాస్..!

ఐసీసీ ప్రకటించిన టీ20 ర్యాంకింగ్స్‌లో భారత యువ బ్యాట్సమెన్ శ్రేయాస్ అయ్యర్‌ తొలిసారిగా టాప్ 20లోకి దుసుకొచ్చాడు. శ్రీలంకతో జరిగిన మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో అద్భుత ప్రదర్శనతో ఆకటుకున్న శ్రేయాస్.. 27 స్థానాలు ఎగబాకి 18వ స్థానానికి చేరుకున్నాడు. మరోవైపు టాప్-10లో ఉన్న విరాట్ కోహ్లీ 10వ స్థానం నుంచి పడిపోయి 15 వ స్థానానికి చేరుకున్నాడు. పాకిస్థాన్‌ బ్యాట్స్మెన్ బాబర్ అజామ్ 805 పాయింట్ల తో అగ్ర స్థానంలో ఉండగా, మహమ్మద్ రిజ్వాన్ 798…

Read More

మణిరత్నం ‘పొన్నియన్ సెల్వన్ ‘ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్!

ప్రముఖ దర్శకుడు మణిరత్నం ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం ‘పొన్నియన్ సెల్వన్’ . విక్రమ్‌, జయం రవి, కార్తీ, ఐశ్వర్యారాయ్‌, త్రిష తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. రెండు పార్ట్ లుగా రాబోతున్న ఈ చిత్రాన్ని మద్రాస్​ టాకీస్తో కలిసి లైకా ప్రొడక్షన్స్ అత్యంత​భారీ బడ్జెట్​తో నిర్మిస్తోంది. ప్రస్తుతం పార్ట్_1 షూటింగ్ చివరి దశలో ఉన్న తరుణంలో చిత్ర బృందం విడుదల తేదీని సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది. ఈ ఏడాది సెప్టెంబర్​ 30న ‘పొన్నియన్​ సెల్వన్’​ పార్ట్​ 1ను…

Read More
Optimized by Optimole