క్రికెట్ కెరీర్ పై మిథాలీ కీలక వ్యాఖ్యలు!

భారత మహిళాల క్రికెట్ జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్‌ తన కెరీర్ పై కీలక వ్యాఖ్యలు చేశారు. మరికొద్ది రోజుల్లో ప్రపంచ కప్ మొదలవుతున్న తరుణంలో ఆమె వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. తన సుదీర్ఘ 22 ఏళ్ల క్రికెట్ కెరీర్‌ ముగింపునకు వచ్చేసిందని మిథాలీ రాజ్‌ వ్యాఖ్యానించింది. ప్రస్తుతం ఆమె వయస్సు 39 ఏళ్లు. వయసు రీత్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రపంచకప్‌ కల మాత్రమే ఇంకా మిగిలి ఉందని.. జట్టులోని సభ్యులంతా మెరుగ్గా ఆడితేనే…

Read More

ప్రభాస్ ‘రాధేశ్యామ్ ‘ నుంచి మరో ట్రైలర్!

రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా పాన్ ఇండియా చిత్రం ‘రాధేశ్యామ్’​. అనివార్య కారణాల వలన విడుదల వాయిదా పడుతూ వస్తున్న ఈ చిత్రం ఎట్టకేలకు మార్చి 11న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో చిత్ర యూనిట్ ప్రమోషన్లనూ వేగవంతం చేసింది. ఇందులో భాగంగానే మరో ట్రైలర్​ను విడుదల చేసేందుకు సిద్ధమైంది చిత్రబృందం. నేడు మధ్యాహ్నం 3గంటలకు రెండో ప్రచార చిత్రాన్ని విడుదల చేయనుంది. ఈ విషయం తెలియడంతో ప్రభాస్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు….

Read More

దేశంలో భారీగా తగ్గిన కరోనా కేసులు!

దేశంలో కరోనా కేసులు భారీగా తగ్గాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 10 వేల 273 కేసులు నమోదవగా.. 243 మంది మరణించారు. వైరస్ నుంచి 20 వేల 439 మంది కోలుకున్నారు. పాజిటివిటీ రేటు 1.0శాతంగా ఉన్నట్లు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. అటు దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. శనివారం ఒక్కరోజే 24, లక్షల 5 వేల 49 డోసులు పంపిణీ చేశారు. దీంతో మొత్తం పంపిణీ చేసిన టీకా డోసుల సంఖ్య…

Read More

పవర్ స్టార్ సినిమా పై సూపర్ స్టార్ ప్రశంసల వర్షం!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజా చిత్రం ‘భీమ్లా నాయక్’ పై సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రశంసల వర్షం కురిపించారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. భీమ్లా నాయక్ మూవీ చూశాను..పవన్​ కల్యాణ్.. ఎనర్జిటిక్, ఫైరింగ్ యాక్టింగ్ తో అదరగొట్టేశారని.. డేనియల్ శేఖర్​గా రానా స్క్రీన్​ ప్రెజెన్స్ అద్భుతంగా ఉదంని.. త్రివిక్రమ్ ఎప్పటిలానే అద్భుతంగా డైలాగులు రాశారని..   విజువల్స్ అద్భుతంగా ఉన్నాయని.. తమన్ సంగీతం మంత్రముగ్ధులను చేసిందంటూ.. చిత్రయూనిట్ కు అభినందనలు…

Read More

టీ 20సీరీస్ భారత్ కైవసం!

శ్రీలంకతో జరుగుతున్న టీ20 సిరీస్​ను భారత్ కైవసం చేసుకుంది. శనివారం జరిగిన రెండో టి 20 మ్యాచ్​లో టీమ్​ఇండియా 7 వికెట్ల తేడాతో విజయం సాధించి మరో మ్యాచ్ మిగులుండగానే సీరీస్ సొంతం చేసుకుంది. కాగా అంతకుముందు టాస్ గెలిచిన భారత్.. లంక జట్టుకు బ్యాటింగ్ అప్పగించింది. నిర్ణీత 20 ఓవర్లలో ఆ జట్టు 5 వికెట్ల నష్టానికి 183 పరుగులు చేసింది. నిస్సంక హాఫ్ సెంచరీతో (75)రాణించాడు. ఇండియా బౌలర్లలో భువనేశ్వర్, చాహల్, హర్షల్ పటేల్,…

Read More

లంకతో టీ20.. బోణీ కొట్టిన భారత జట్టు!

శ్రీలంకతో టీ20 సిరీస్​లో భాగంగా గురువారం జరిగిన మ్యాచ్​లో భారత జట్టు బోణీ కొట్టింది. 200 పరుగులు లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో లంక జట్టు 137 పరుగులకే పరిమితమైంది. దీంతో భారత జట్టు 62 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. ఓపెనర్లు శుభారంభం: అంతకు ముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన టీం ఇండియాకు..కెప్టెన్ రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్ శుభారంభం అందించారు. వీరికీ తోడు శ్రేయాస్ అయ్యర్ రాణించడంతో.. నిర్ణీత 20 ఓవర్లలో భారత్…

Read More

పవన్ స్టార్ అభిమానులకు తెలంగాణా సర్కార్ గుడ్ న్యూస్!

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ చెప్పింది తెలంగాణా సర్కార్. భీమ్లానాయక్ చిత్రానికి రెండు వారాల పాటు ఐదు షోలకు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ సినిమాపై భారీ హైప్ క్రియేట్ చేశాయి. దీంతో థియేటర్లు వారం రోజుల పాటు బుక్ కావడంతో పాటు.. టికెట్స్ హాట్ కేక్ లా అమ్ముడుపోయాయి. ఈ నేపథ్యంలోనే మేకర్స్ చిత్ర ప్రమోషన్స్ వేగవంతం చేశారు. అటు పవన్ అభిమానులు.. భీమ్లానాయక్…

Read More

దేశంలో తగ్గుతున్న కరోనా కేసుల సంఖ్య!

దేశంలో కరోనా కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తోంది. తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 16 వేల 51‬ కేసులు నమోదయ్యాయి. 24 గంటల వ్యవధిలో వైరస్ తో 206 మంది మరణించారు. మహమ్మరి నుంచి 37 వేల 901 మంది కోలుకున్నట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. మరోవైపు వ్యాక్సినేషన్ శరవేగంగా కొనసాగుతోంది. ఆదివారం ఒక్కరోజే 7లక్షల 706 మందికి టీకాలు అందించారు. దీంతో ఇప్పటివరకు పంపిణీ అయిన మొత్తం డోసుల సంఖ్య…

Read More

ప్రముఖ సంగీత దర్శకుడు కన్నుమూత!

ప్రముఖ సంగీత దర్శకుడు బప్పిలహరి కన్నుమూశారు.గత కొద్ది కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. ముంబయిలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.ఈ విషయాన్ని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. బప్పిలహరి 1952, నవంబర్‌ 27న జన్మించారు. భారత చిత్రసీమకు డిస్కోను పరిచయం చేసిన ఘనత ఆయనకే దక్కుతుంది. ఆయన ఆలపించిన పాటల్లో.. ‘చల్తే చల్తే’, ‘డిస్కో డ్యాన్సర్’, ‘షరాబీ’ వంటి గీతాలు యువతను ఉర్రూతలూగించాయి. హిందీ, తెలుగు, బెంగాళీ, తమిళం, కన్నడ, గుజరాతీ చిత్రాలకు ఆయన సంగీత దర్శకుడిగా…

Read More

భీమ్లా నాయక్ విడుదల తేదీ ఖరారు..!

పవర్ స్టార్ అభిమానులకు గుడ్ న్యూస్. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ‘భీమ్లా నాయక్’ మూవీని ఈనెల 25వ తేదీన విడుదల చేస్తున్నట్లు నిర్మాత నాగ వంశీ ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. రెండు రాష్ట్రాల్లో కోవిడ్ ఉధృతి తగ్గడంతో చిత్రబృందం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కాగా ఇప్పటికే విడుదలైన మూవీ టీజర్‌, గ్లింప్స్ ఆకట్టుకున్నాయి.దీంతో సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. సినిమా కోసం అభిమానులు ఈగర్‌గా వెయిట్‌ చేస్తున్నారు. ఇక మలయాళ హిట్ ‘అయ్యప్పనుమ్ కోశియుమ్’కు రీమేక్​గా…

Read More
Optimized by Optimole