టీమిండియా కెప్టెన్సీ మార్పు పై హగ్ ఆసక్తికర వ్యాఖ్యలు!

  టీమిండియా కెప్టెన్ మార్పుపై ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ బ్రాడ్ హగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుత పరిస్థితుల్లో భారత జట్టుకు కెప్టెన్సీ మార్పు మంచిది కాదని  ఆప్రభావం కోహ్లీ ఆటతీరుపై  పడుతుందని, ఇది భారత క్రికెట్ సంస్కృతికి విరుద్ధమని హెచ్చరించాడు. క్రికెట్లో ఎంతపెద్ద ఆటగాడికైనా ఒడిదుడుకులు సహజమని అంతమాత్రాన అతని శక్తి సామర్ధ్యాలను శంకించడం సబబు కాదని హితువు పలికాడు. ఆస్ట్రేలియా టూర్లో అతని సారధ్యంలో జట్టు వన్డే సిరీస్ కోల్పోవడం, అడిలైడ్ టెస్టులో అత్యల్పంగా 36 పరుగులకే…

Read More

గ్రేటర్ పీఠం టీఆర్ఎస్ దే!

జిహెచ్ఎంసి కొత్త పాలక వర్గం గురువారం కొలువుదిరింది. కొత్తగా ఎన్నికైన 149 మంది కార్పొరేటర్లతో ప్రిసైడింగ్ అధికారి (హైదరాబాద్ కలెక్టర్)శ్వేతా మహంతి నాల్గు భాషల్లో ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం మేయర్ ఎన్నిక నిర్వహించారు. అధికార టీఆర్ఎస్ నుంచి బంజారాహిల్స్ కార్పొరేటర్గా ఎన్నికైన గద్వాల విజయలక్ష్మి మేయర్ గా, డిప్యూటీ మేయర్ గా తార్నాక కార్పొరేటర్గా గెలిచిన మోతె శ్రీలత ఎన్నికయ్యారు. కాగా మేయర్ ఎన్నికకు టీఆరెస్ నుంచి విజయలక్ష్మి, బీజేపీ నుంచి రాధ పోటీపడ్డారు. మేయర్…

Read More

అన్నదాత బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది: నాదెండ్ల మనోహర్

దేశానికి అన్నం పెట్టే అన్నదాతకు అండగా నిలబడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్  నాదెండ్ల మనోహర్.  వైసీపీ అధికారంలోకి వచ్చాకా.. మూడున్నరేళ్లలో దాదాపు 3 వేల మంది కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.  బలవన్మరణాలకు పాల్పడ్డ కౌలు రైతు కుటుంబాల దీనస్థితిని చూసైనా ప్రభుత్వ పెద్దల మనసు కరగడం లేదని.. వారిలో మానవత్వం లేదని మనోహర్ మండి పడ్డారు. కాగా పల్నాడు జిల్లా సత్తెనపల్లి…

Read More

BharatRatna: పీవీకి భారతరత్న ఇబ్బందికరం కాబట్టే.. ఇద్దరు ప్రముఖుల పేర్లతో కలిపి ప్రకటించేశారా?

Nancharaiah merugumala senior journalist: ” పీవీకి భారతరత్న విడిగా ఇవ్వడం బీజేపీకి ఇబ్బందికరం కాబట్టే మరో ఇద్దరు దివంగత ప్రముఖుల పేర్లతో కలిపి ప్రకటించేశారా?” హరియాణా, పశ్చిమ ఉత్తర ప్రదేశ్‌ లో కుటుంబ మూలాలున్న గొప్ప వ్యవసాయ అర్థశాస్త్రవేత్త, రాజకీయ, సామాజిక సంస్కర్త, రైతు నాయకుడు చౌధరీ చరణ్‌ సింగ్, తమిళనాడుకు చెందిన ప్రపంచ ప్రఖ్యాత వ్యవసాయ శాస్త్రవేత్త ఎం.ఎస్‌.స్వామినాథన్‌ పేర్లతో కలిపి తెలంగాణ తెలుగు బిడ్డ పీవీ నరసింహారావు గారికి భారతరత్న పురస్కారం ప్రకటించింది…

Read More

Iran : చుట్టూ ఇనుప కంచెలున్న జైలు – ఒక పాత్రికేయుడి వ్యథ ✍️✍️

సాయి వంశీ ( విశీ) : (ఇరానియన్-కుర్దిష్ పాత్రికేయుడు, రచయిత Behrouz Boochani వివిధ సందర్భాల్లో చెప్పిన విషయాలను ఇక్కడ అనువదించాను). I’m a Child of War. అవును! నేను యుద్ధానికి పుట్టిన బిడ్డని. యుద్ధం, పేదరికం, కన్నీళ్లు, మరణాలు.. అన్నీ చూస్తూ పెరిగినవాణ్ని. కాసింత తిండి దొరకడాన్ని పండుగలా, కాసింత ఆశ్రయం దొరకడాన్ని వేడుకలా చూసినవాణ్ని. అనంతమైన ప్రేమ, అంతులేని ఆనందం కూడా నా జీవితంలో ఉంది. కానీ నేను వాటి గురించి చెప్పబోవడం…

Read More

Tirupati: మంత్రి కొండా సురేఖ చొరవ.. సిఫార్సు లేఖలకు టీటీడి అనుమతి..!

Tirupati: తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ లేఖకి ఏపీ ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. తెలంగాణ ప్రజా ప్రతినిధుల సిఫార్సు లేఖలను మార్చి 24 నుంచి అనుమతించనున్నట్లు టీటీడి తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు టీటీడి ప్రకటనలో పేర్కొంది. దీంతో సిఫార్సు లేఖల విషయంలో మంత్రి కొండా సురేఖ జరిపిన సంప్రదింపులు ఎట్టకేలకు సత్ఫలితానిచ్చాయి. కాగా ఇటీవల తెలంగాణ ప్రజా ప్రతినిధుల సిఫార్సు లేఖలను…

Read More

Poetry: రాయడానికి ఒక చేయి చాలదు..!

Literature:  రాయడానికి ఒక చేయి చాలదు. ఈ రోజుల్లో రెండోది కూడా కావాలి. చెప్పలేని సంగతుల వంచనను చప్పున గ్రహించడానికి, వచ్చే ప్రళయం తర్వాత ఉదయించే తారక పేరును లిపిబద్ధం చేయడానికి, మోహవస్త్రంలోని వేలాది దారపు పోగుల అల్లిక తెగిపోకుండా చూడటానికి, వ్యర్థాల పోగు నుంచి మళ్లీ మొదలుపెట్టడానికి రెండో చేయి కూడా కావాలి. నిజానికి ఈ రోజుల్లో రాయడానికి రెండు చేతులూ చాలవు. కష్టాల తొక్కిడిలో నలిగిపోయి, ఈ నీచాతినీచ మరుభూమికి చేరుకోవలసిన అగత్యాన్ని రాయాలంటే,…

Read More
Optimized by Optimole