ఉద్ధవ్ ఠాక్రే రాజీనామా.. సీఎంగా ఫడ్నవీస్?
ఊహించినట్లగానే మహారాష్ట్ర రాజకీయ సంక్షోబానికి తెరపడింది. బలపరీక్షకు ముందే సీఎం పదవికి ఉద్ధవ్ ఠాక్రే రాజీనామా చేశారు. గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీ నిర్ణయంపై సుప్రీంకోర్డు వెళ్లిన శివసేనకు ఎదురుదెబ్బతగిలింది. ఎట్టి పరిస్థితుల్లోనూ మహారాష్ట్ర అసెంబ్లీలో బలపరీక్ష జరగాల్సిందేనని ధర్మాసనం తీర్పు వెలువరించిన.. క్షణాల్లోనే సోషల్ మీడియా వేదికగా ఠాక్రే తన రాజీనామా ప్రకటించారు. ఎమ్మెల్సీ పదవికి సైతం తాను రాజీనామా చేస్తున్నట్లు స్పష్టం చేశారు. ఇన్నాళ్లు సహకరించిన సోనియాగాంధీ, శరద్ పవర్ కి ప్రత్యేకంగా కృతజ్ఞతలు…
క్లైమాక్స్ కి చేరిన మహరాష్ట్ర రాజకీయ సంక్షోబం!
మహరాష్ట్ర రాజకీయ సంక్షోబానికి తెరపడే అవకాశం కనిపిస్తోంది. గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీ.. తక్షణమే అసెంబ్లీ సమావేశం ఏర్పాటు చేసి మెజారిటీని నిరూపించుకోవాలని సీఎం ఉద్ధవ్ ఠాక్రేను కోరారు.ఈమేరకు గవర్నర్ సీఎంకు లేఖరాశారు. మరోవైపు గవర్నర్ నిర్ణయం పై శివసేన మండిపడుతోంది.బలనిరూపణ చట్టవిరుద్ధమని.. ఈవిషయమై సుప్రీం కోర్డు కు వెళ్తామని స్పష్టం చేసింది. బీజేపీ మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ బలపరీక్షకు ఆదేశించాలని గవర్నర్ ని కోరిన కొద్ది గంటల్లోనే.. భగత్ సింగ్ కోశ్యారీ బలనిరూపణపై నిర్ణయం…
అనారోగ్యంతో కన్నూమూసిన నటి మీనా భర్త!
ప్రముఖ నటి మీనా అభిమానులకు బ్యాడ్ న్యూస్. ఆమె భర్త విద్యాసాగర్ అనారోగ్యంతో మరణించారు. గత కొన్నేళ్లుగా ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్న ఆయనకు.. జనవరిలో కరోనా సోకింది. ఈనేపథ్యంలో ఊపిరితిత్తుల మార్పిడి చేయాల్సి ఉండగా.. మంగళవారం రాత్రి ఆయనకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తింది . దీంతో వెంటనే కుటుంబ సభ్యులు దగ్గర్లోని ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. విద్యాసాగర్ మృతిపట్ల పలువురు సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా సంతాపం వ్యక్తం చేశారు….
